TE/Prabhupada 0029 - బుద్ధుడు రాక్షసులను మోసగించాడు

Revision as of 18:23, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970

బుద్ధుడు రాక్షసులను మోసం చేసాడు. ఎందుకు ఆయన మోసం చేసాడు? సదయ-హృదయ దర్శిత-పశు-ఘటం. ఆయన చాలా కారుణ్యము కలిగిన వాడు. భగవంతుడు అన్ని జీవులపై ఎల్లప్పుడూ జాలి కలిగి ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన కొడుకులే. కానీ ఈ జులాయిలు ఎటువంటి నియంత్రణ లేకుండా చంపుతున్నారు, కేవలం జంతు హత్యలు చేస్తున్నారు. మరియు మీరు అడిగితే ఎందుకు చంపుతున్నారు అని? వారు వెంటనే తిరిగి చెప్తారు, ఓహ్ ఇది వేదములలో చెప్పబడింది అని. పశవో వధయ స్రష్ట. జంతు హత్య వేదములలో చెప్పబడింది, కానీ దాని ఉద్దేశం ఏంటి? అది వేద మంత్రములకు పరీక్ష. ఒక జంతువుని అగ్ని లోకి పంపించి, వేద మంత్రములతో దానికి మరలా జీవం పోస్తారు. అది యజ్ఞము, జంతు యజ్ఞం, తినడానికి ఉద్దేశించి కాదు. కావున ఈ కలి యుగములో అన్ని రకములయిన యజ్ఞాలను చైతన్య మహాప్రభు నిషేధించారు. ఎందుకంటే, నేను చెప్పేది ఏమిటంటే మంత్రములను జపించే నిపుణుడయిన బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. మరియు వేద మంత్రములతో ఈ విధముగా ప్రాణం తిరిగి పోయడానికి ప్రయోగం చేయగల బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. అది ఏంటంటే, యజ్ఞము చేసే ముందు మంత్రము యొక్క శక్తిని తెలుసుకోవడానికి, జంతువును చంపి మళ్లీ తిరిగి కొత్త జన్మను ఇవ్వడం చెయ్యడానికి. ఆ మంత్రములను జపించే వారు బ్రాహ్మణులు అని అర్థం చేసుకోవాలి, అది సరైన పద్ధతి. అది ఒక పరీక్ష. జంతు సంహారం కోసం కాదు. కానీ ఈ మూర్ఖులను, జంతువులను తినడానికి వేదములను చూపించి," ఇక్కడ వుంది జంతు సంహరణ" కలకత్తాలో మాదిరిగా.. కలకత్తాకి మీరు వెళ్ళరా? అక్కడ కాలేజీ వీధి అనే పేరుతో ఒక వీధి వుంది.. ఇప్పుడు అది వేరే పేరుతో వుంది. విధాన రాయ.. ఆ విధమైన పేరు ఏదో వుంది.. ఏమైనప్పటికీ, అక్కడ కొన్ని కబేళాలు వున్నాయి. కబేళాలు అనగా హిందువులు, ముస్లిముల అంగడి నుంచి మాంసం కొనరు. అది అపరిశుభ్రమైనది. అదే విధయము : అటువైపున మరియు ఇటువైపున కూడా. అది మలినము వారు మాంసాన్ని తింటున్నారు మరియు హిందువుల అంగడి స్వచ్ఛమైనది మరియు ముస్లిములది అపరిశుభ్రమైనది. ఇవన్నీ పిచ్చి కల్పితాలు. ధర్మము (మతము) ఆ విధముగా నడుస్తుంది. అందువలన గొడవలు.. నేను హిందువును, నేను ముస్లిమును, నేను క్రైస్తవుడను అని. మీరు చూడండి. ఎవ్వరికి ధర్మము గురించి తెలియదు.. ఈ మూర్ఖులు ధర్మమును వదిలేసారు. ధర్మము లేదు. అసలైన మతము భగవంతుడిని ఎలా ప్రేమించాలో నేర్పించే కృష్ణ చైతన్యము. అంతే. అది ధర్మము. హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవం అయినా, ఏది అయినా అది సంబంధం లేదు, మీరు భగవంతుని పై ప్రేమను పెంచుకుంటూ ఉంటే, అప్పుడు మీరు మీ ధర్మములో పరిపూర్ణముగా ఉన్నారు