TE/Prabhupada 0039 - ఆధునిక నాయకుడు కేవలం తోలుబొమ్మలాంటివాడు

Revision as of 18:25, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.10.3-4 -- Tehran, March 13, 1975

కావున యుధిష్ఠర వంటి ఆదర్శ రాజు, ఈ భూమినే కాకుండా, సముద్రాలను,ఈ గ్రహం అంతటిని పాలించగలడు. అది ఆదర్శం. (చదువుతూన్నారు): ఆధునిక ఆంగ్ల చట్టము అయిన మొదట పుట్టిన వారికి వారసత్వపు చట్టము మహారాజ యుధిష్ఠర భూమిని మరియు సముద్రాలను పాలిస్తున్న ఆ రోజుల్లో కూడా ఆచరణలో ఉండేది అంటే మొత్తం గ్రహం, సముద్రాలతో కలుపుకొని. (చదువుతున్నారు): ఆ రోజుల్లో హస్తినాపుర రాజు, ఇప్పుడు న్యూఢిల్లీ లో భాగము, ఈ ప్రపంచానికి చక్రవర్తి, సముద్రాలను కలుపుకొని. మహారాజ పరిక్షిత్ కాలము వరకు, మహారాజ యుధిష్ఠర మనవడు. అతని చిన్న తమ్ముళ్ళు అతనికి మంత్రిగా మరియు సైనిక దళపతులుగా వ్యవహరించేవారు. మరియు రాజు యొక్క అన్నదమ్ముల మధ్య సంపూర్ణమైన సహకారం ఉండేది. మహారాజ యుధిష్ఠర ఆదర్శవంతమైన రాజు లేదా శ్రీకృష్ణుడి ప్రతినిధి.. రాజు కృష్ణుని యొక్క ప్రతినిధి అయ్యి ఉండాలి. ఈ భూమిని పాలించడానికి మరియు ఇంద్రునితో సమానముగా ఉండాలి, ఇంద్రుడు స్వర్గ లోకము యొక్క అధికారిక పరిపాలకుడు. దేవతలు ఉదాహరణకు ఇంద్రుడు, చంద్రుడు సూర్యుడు, వరుణుడు,వాయువు, మొదలగు వారు విశ్వములో వివిధ గ్రహముల యొక్క ప్రతినిధి రాజులు. అదేవిధముగా మహారాజ యుధిష్ఠర కూడా వాళ్ళలో ఒకరు, ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు.

మహారాజ యుధిష్ఠర ఆధునిక ప్రజాస్వామ్యం యొక్క జ్ఞానం లేని రాజకీయ నాయకుని వంటి వాడు కాదు. భీష్మదేవునిచే మరియు నిర్దుష్టమయిన భగవంతుడిచే ఆదేశాలు పొందాడు. అందువలన అతనికి ప్రతి దాని పైన ఖచ్చితమైన జ్ఞానము ఉండేది ఆధునికంగా ఎన్నుకోబడ్డ దేశ నాయకుడు ఒక కీలు బొమ్మ వంటి వాడు ఎందుకంటే అతనికి ఎటువంటి రాజ శక్తి లేదు. అతను మహారాజ యుధిష్ఠర లాగా జ్ఞానం ఉన్నవాడు అయినా, అతను మంచి ఉద్దేశముతో ఏమైనా చేద్దాం అనుకున్నా అతను రాజ్యాంగ స్థితి వల్ల చెయ్యలేడు. అందుకే, ఈ భూమి పైన చాలా రాజ్యాలు గొడవలు పడుతున్నాయి. ఎందుకంటే సైద్ధాంతిక తేడాలు లేదా వేరే స్వార్ధమైన ఆలోచనల వల్ల. కానీ మహారాజ యుధిష్ఠర వంటి రాజుకు తన యొక్క సొంత సిద్ధాంతం ఏమి లేదు. అతను తప్పు చెయ్యని భగవంతుని మరియు భగవంతుని ప్రతినిధి ఆదేశాలను పాటించాలి, మరియు అధికార ప్రతినిధి, భీష్మదేవుడు. శాస్త్రములలో సూచించ బడింది ప్రతి ఒక్కరూ అనుసరించాలి గొప్ప ప్రామాణికుని మరియు నిర్దుష్టమయిన భగవంతుడిని ఎటువంటి వ్యక్తిగత ఆశయము మరియు తయారు చేసిన సిద్దంతాలు లేకుండా అనుసరించాలి. అందువలన మహారాజ యుధిష్ఠర ఈ మొత్తం ప్రపంచాన్ని, సముద్రములతో సహా పాలించగలిగాడు. ఎందుకంటే అతను పాటించిన సూత్రములు తప్పు లేనివి మరియు ప్రపంచ వ్యాప్తంగా అందరికి వర్తిస్తాయి.

ప్రపంచం అంతా ఒకే దేశం అనే భావన నేరవేరాలి అంటే మనము నిర్దుష్టమైన ప్రామాణికుడిని అనుసరించాలి. ఒక అసంపూర్ణమైన మనిషి అందరు అంగీకరించే సిద్దాంతాన్ని సృష్టించలేడు. కేవలం సంపూర్ణమైన మరియు నిర్దుష్టమైన అతనే ఒక కార్యక్రమాన్ని సృష్టించగలడు. ఏదైతే అందరికీ అన్ని ప్రదేశాలలో వర్తిస్తుందో మరియు ప్రపంచములో అందరూ అనుసరించే విధంగా.. అటువంటి మనిషే పాలించగలడు, వ్యక్తిగత ప్రభుత్వం కాదు. మనిషి పరిపూర్ణుడు అయితే, ప్రభుత్వం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. మనిషి మూర్ఖుడు అయితే, ప్రభుత్వం మూర్ఖుల స్వర్గం. అది ప్రకృతి ధర్మం. లోపము కలిగిన రాజులు లేదా కార్యనిర్వాహకుల గురించి చాలా కథలు ఉన్నాయి. అందువలన, కార్యనిర్వాహకులు మహారాజ యుధిష్ఠర వలె బాగా శిక్షణ పొంది ఉండాలి, మరియు అతనికి ప్రపంచం అంతా నిరంకుశంగా పాలించడానికి సంపూర్ణ అధికారం ఉండాలి. ప్రపంచం మొత్తం ఒకే రాజ్యం అనే భావన కేవలం మహారాజ యుధిష్ఠర వంటి రాజు రాజ్యంలో మాత్రమే రూపు చెందగలదు. ఆ రోజుల్లో ప్రపంచం అంతా సంతోషంగా ఉండేది ఎందుకంటే మహారాజ యుధిష్ఠర వంటి రాజులు ప్రపంచమును పాలించేవారు. ఈ రాజులూ మహారాజ యుధిష్ఠరను అనుసరించి ఉదాహరణ చూపించండి సంపూర్ణమైన రాజ్యము రాచరికము ద్వార ఎలా వస్తుందో అని శాస్త్రములో ఒక సూత్రము ఉంది, మరియు అతను దాన్ని అనుసరిస్తే, అతను అది చెయ్యగలడు. అతనికి శక్తి ఉంది.

అతను సంపూర్ణమైన రాజు కనుక, కృష్ణుడి యొక్క ప్రతినిధి. అందువలన,కామం వావర్స పర్జన్యః ( SB 1.10.4) పర్జన్యః అనగా వర్షపాతం. కావున వర్షపాతం అనేది జీవితము యొక్క ప్రాథమిక అవసరాల కోసము ప్రాథమిక అవసరం. అందువలన కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, అన్నాద్ భవన్తి భూతాని పర్జన్యాద్ అన్న-సంభవః ( BG 3.14) మీరు ప్రజలను సంతోష పరచాలి అంటే, మనిషి మరియు జంతువు రెండూ.. జంతువులు కూడా ఉన్నాయి. అవి.. ఈ మూర్ఖపు రాజ్య కార్యనిర్వాహకులు, కొన్నిసార్లు ప్రజల అవసరం కోసం కొన్ని సార్లు పోజులు కొడతారు కానీ జంతువులకు ఎటువంటి లాభం ఉండదు. ఎందుకు? ఎందుకు ఈ అన్యాయము? అవి కూడా ఈ భూమి పైనే పుట్టాయి. అవి కూడా జీవం ఉన్న ప్రాణులే. అవి జంతువులయి ఉండవచ్చు. వాటికి తెలివి లేదు. వాటికీ తెలివి ఉంది, మనిషికి ఉన్నంతగా కాదు, కానీ దాని అర్థం వాటిని చంపడం కోసం నిత్య కృత్యమైన కబేళాలు నిర్మించాలా? అది న్యాయమా? మరియు అది ఒక్కటే కాదు, ఎవరైనా రాజ్యములో రాజు దగ్గరికి వస్తే రాజు వాళ్ళకి ఆశ్రయము ఇవ్వాలి. ఎందుకు తేడా? ఎవరైనా ఆశ్రయం పొందితే, "అయ్యా, నేను మీ రాజ్యములో ఉండాలి అనుకుంటున్నాను," అని అడిగితే, అప్పుడు అతనికి అన్ని సౌకర్యములును ఇవ్వాలి. ఎందుకు ఇది," లేదు,లేదు, నువ్వు రాకూడదు, నువ్వు అమెరికా దేశస్థుడివి, నువ్వు భారతియుడివి, నువ్వు అది అని ? లేదు. అవి చాలా ఉన్నాయి, నిజంగా ఒకవేళ సూత్రములు పాటిస్తే, వేదముల సూత్రములు, అప్పుడు ఆదర్శవంతమైన రాజు మంచి నాయకుడు అవుతాడు. మరియు ప్రకృతి సహకరిస్తుంది. అందువలన ఇలా చెప్పబడింది ఏంటంటే, మహారాజ యుధిష్టర పరిపాలన చేస్తున్నప్పుడు, కామం వావర్స పర్జన్యః సర్వ-కామా-దుఘ మహి ( SB 1. 10. 4) మహి, ఈ భూమి, మీరు మీ అవసరములు అన్ని ఈ భూమి నుండి పొందవచ్చు. అది ఆకాశము నుండి కిందకి పడదు. అవును, అది ఆకాశము నుండి వర్షపు రూపములో కిందకి వస్తుంది కానీ వారికి శాస్త్రము తెలియదు భూమి నుండి అన్ని వివిధ ఏర్పాటులు ద్వారా ఎలా వస్తున్నాయో అని ? కొన్ని ఖచ్చిత సందర్బములలో వర్షాలు కురుస్తాయి మరియు జ్యోతిష్య ప్రభావం. అప్పుడు అనేక వస్తువులు ఉత్పత్తి చెందుతాయి, అమూల్యమైన రాళ్ళూ, ముత్యాలు. వాళ్ళకి తెలియదు ఇవి ఎలా వస్తున్నాయో అని అందువలన, రాజు పవిత్రము అయిన వాడు అయితే, అతనికి సాయం కోసం ప్రకృతి కూడా సహకరిస్తుంది. మరియు రాజు, ప్రభుత్వం అధర్మము అయితే, అప్పుడు ప్రకృతి కూడా సహకరించదు.