TE/Prabhupada 0165 - పవిత్రమైన క్రియలను భక్తి అంటారు

Revision as of 18:46, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG Introduction — New York, February 19-20, 1966

మహోన్నతమైన చేతన్యము, ఇది భగవద్గీతలో వివరించబడింది జీవుడుకి ఐశ్వరుడికి మధ్య వ్యత్యాసం వివరించిన అధ్యాయంలో. Kṣetra-kṣetra-jña. భగవంతుడు kṣetra-jña అని, లేదా చేతన్యావంతుడు అని వివరించబడినది, జీవులు, వారు కూడా చైతన్యము కలిగి ఉన్నారు. కానీ వ్యత్యాసం ఒక జీవి తన శరీరాము వరకే చైతన్యము కలిగి వుంటాడు కానీ భగవంతుడు అన్ని శరీరాల చైతన్యమును కలిగి వుంటాడు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati (BG 18.61). భగవంతుడు ప్రతి జీవి హృదయము లోపల నివసిస్తాడు, అందువలన ఆయనకు ప్రతి జీవి యొక్క మానసిక ఆలోచనలు, కార్యకలాపల గురించి తెలుస్తుంది. మనము మర్చిపోకూడదు. పరమాత్మా, లేదా భగవంతుడు మహోన్నతమైన వ్యక్తి, ప్రతి ఒక్కరి హృదయంలో īśvara నిగా జీవిస్తున్నాడు , నియంత్రికునిగా ఆయన దిశను ఇస్తున్నాడు. ఆయన దిశను ఇస్తున్నాడు. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭhaḥ (BG 15.15). ప్రతి ఒక్కరి హృదయములో ఆయన ఉన్నడు, జీవి కోరికలను తీర్చటానికి దిశను ఇస్తాడు.

జీవి ఏమి చేయాలో మర్చిపోతాడు. మొదట ఆయన ఒక నిర్దిష్ట మార్గంలో పని చేయడానికి నిర్ణయము చేస్తాడు, తరువాత తను చేసిన కర్మ యొక్క క్రియ ప్రతిక్రియలలో చిక్కుకుపోతాడు. కానీ ఒక్క శరీరం వదిలేసి మరొక శరీరములో ప్రవేశించినప్పుడు ... ఉదాహరణకు మనము ఒక దుస్తుల కోసము మరొక రకమైన దుస్తులను వదిలేస్తాము అదేవిధంగా, భగవద్గీతలో వివరించబడింది, vāsāṁsi jīrṇāni yathā vihāya (BG 2.22). మనము వేర్వేరు దుస్తులను మార్చుకున్నట్లుగా, అదేవిధంగా జీవులు వారు కూడా వేర్వేరు శరీరాలను మారుస్తున్నారు, ఆత్మ ఒక్క శరీరము నుండి మరొక శరీరమునకు వెళ్ళుతు, తన గత జన్మ యొక్క క్రియ ప్రతిక్రియల ఫలములను తనతో తీసుకు వెళ్ళుతుంది. ఒక జీవి సత్వ గుణములో ఉన్నప్పుడు, ఈ కర్మలను మారవచ్చు, సత్వ గుణములో ఉన్నప్పుడు, ఆయన ఏ విధమైన కర్మలను పాటించాలో ఆయనకు అర్ధమవుతుంది, ఆయన అలా చేస్తే, తన గత కర్మల క్రియ ప్రతిక్రియల ఫలితాలను మొత్తం మార్చవచ్చు. అందువలన కర్మ శాశ్వతమైనది కాదు. అయిదు అంశాలలో నాలుగు అంశాలు īśvara, jīva, prakṛti, kāla, and karma - ఈ నాలుగు అంశాలు శాశ్వతమైనవి, అయితే కర్మ, కర్మ అని పిలువబడే అంశం, ఇది శాశ్వతమైనది కాదు.

ఇప్పుడు చేతన్యము ఉన్న īśvara, మహోన్నతమైన చేతన్యము īśvara మహోన్నతమైన చేతన్యము ఉన్న īśvara, భగవంతుడు మరియు జీవికి మధ్య ఉన్న వ్యత్యాసం ప్రస్తుత పరిస్థితులలో, ఇలా ఉంటుంది. చైతన్యము, భగవంతుడు మరియు జీవులు ఇరువురి చైతన్యము, ఈ చైతన్యం ఆధ్యాత్మికము. ఈ బౌతిక ప్రకృతి యొక్క సంబంధం ద్వారా ఈ చైతన్యము సృష్టించబడుతుందని కాదు. ఇది ఒక పొరపాటు. బౌతిక కలయిక వలన కొన్ని పరిస్థితులలో చైతన్యము అభివృద్ధి చెందుతుoది ఆన్న సిద్ధాంతం, భగవద్గీతలో అంగీకరించలేదు. వారు చెప్పలేరు. చైతన్యం బహుశా బౌతిక పరిస్థితులచే కప్పబడి వికృత రూపములో ప్రతిబింబిస్తుంది, రంగు అద్దాల ద్వారా ప్రతిబింబించే కాంతి ఆ రంగు ప్రకారం కనిపించవచ్చు. అదేవిధంగా, భగవంతుడు యొక్క చైతన్యము, అది భౌతికము వలన ప్రభావితం కాదు. దేవాదిదేవుడు, కృష్ణుడిలాగే, ఆయన చెప్పుతాడు. mayādhyakṣeṇa prakṛtiḥ (BG 9.10). ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినన్నప్పుడు, ఆయన చైతన్యం భౌతికము వలన ప్రభావితం కాదు. ఆయన చైతన్యం భౌతికముగా ప్రభావితం అయినా, భగవద్గీతలో ఆధ్యాత్మిక విషయముల గురించి మాట్లాడటానికి ఆయనకు అర్హత లేదు. భౌతికంగా కలుషితమైన చైతన్యం నుండి స్వేచ్ఛ పొందకుండానే, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఎవ్వరూ చెప్పలేరు.

భగవంతుడు బౌతికముచే కలుషితమైన వాడు కాదు. కానీ ప్రస్తుత చైతన్యములో,మనచైతన్యము, భౌతికంగా కలుషితమైనది. అంతేకాదు, భగవద్గీత బోధిస్తున్నట్లుగా మనము కలుషితమైన చైతన్యాన్ని సంపూర్ణంగా పవిత్రము చేసుకోవాలి ఆ పవిత్రమైన చైతన్యములో, కర్మలు చేస్తే ఆది మనకు సంతోషము నిస్తుంది. మేం ఆపలేం.మన కర్మలను మనము ఆపలేము. కర్మలు పవిత్రము చేయాలి. ఈ పవిత్ర కర్మలను భక్తి అని పిలుస్తారు. భక్తి అంటే అవి, సాధారణ కర్మలు వలె కనిపిస్తాయి, కానీ అవి కలుషిత కర్మలు కాదు. అవి పవిత్రమైన కర్మలు. అజ్ఞాని ఒక భక్తుడు ఒక సాధారణ మనిషిలా పనిచేస్తున్నాడని చూడవచ్చు, కానీ జ్ఞానం లేని వ్యక్తికి, ఆయనకు తెలియదు ఒక భక్తుడు లేదా భగవంతుడు యొక్క కర్మలు, అవి బౌతికము యొక్క అపవిత్రమైన చైతన్యం ద్వారా కలుషితము కావు, మూడు గుణాల యొక్క మలినము, ప్రకృతి గుణాలు, కానీ ఆధ్యాత్మిక చైతన్యము. మనచైతన్యము బౌతికముగా కలుషితమవుతుంది, మనము తెలుసుకోవాలి.