TE/Prabhupada 0175 - ధర్మము అంటే క్రమముగా కాకులను హంసలుగా మార్చుట

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972

దేవుడి జ్ఞానంతో సంబంధం లేని ఏ సాహిత్యం అయిన, , tad, tad vayasam tirtham, కాకులు ఆనoదాన్ని అనుభవిoచే చోటులానే ఉoటుoది. ఎక్కడ కాకులు సoతృప్తిని పొoదుతాయి? మురికిగా ఉన్న స్థలములో. హంసలు, తెల్లని హంసలు, అవి చక్కని స్పష్టమైన నీటిలో ఆనందముగా వుoటాయి. ఉద్యానవనములు ఎక్కడ ఉంటాయో , అక్కడ పక్షులు ఉoటాయి.

జంతువులలో కూడా విభాగాలు ఉన్నాయి. హంస వర్గము, కాకి వర్గము. సహజగా విభజించబడినవి. కాకులు హంసల దగ్గరకు వెళ్ళవు. హంసలు కాకుల దగ్గరకు వెళ్ళవు. అదేవిధంగా మానవ సమాజంలో, కాకి వర్గపు వ్యక్తులు హంస వర్గపు వ్యక్తులు ఉన్నారు. హంస వర్గపు వ్యక్తులు ఇక్కడ వస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, బాగుంటుంది, మంచి తత్వము, మంచి ఆహారము, మంచి విద్య, మంచి దుస్తులు, మంచి మనస్సు, ప్రతిదీ మంచిది కాకి వర్గపు వ్యక్తులు ఫలానా క్లబ్లకు, ఫలానా పార్టీలకు, నగ్న నృత్యములకు, చాలా విషయాలకు వెళ్లుతారు. మీరు చూడoడి.

ఈ కృష్ణ చైతన్యము ఉద్యమం హంస వర్గపు వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. కాకి వర్గపు వ్యక్తుల కోసము కాదు. కానీ మనము కాకులను హంసలుగా మార్చగలము. ఇది మన తత్వము కాకిగా వున్నవాడు ఇప్పుడు హంస వలె ఇతకొడుతున్నాడు. ఇది మనము చేయగలము. ఇది కృష్ణ చైతన్యము యొక్క ప్రయోజనం. హంసలు కాకులుగా మారితే, అది భౌతిక ప్రపంచం. కృష్ణుడు ఇలా చెబుతారు yada yada hi dharmasya glanir bhavati (BG 4.7). ఈ భౌతిక శరీరంలో జీవి ఉంచబడుతాడు అయిన తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోవటానికి ప్రయత్నిస్తుoటాడు, ఒక్క శరీరము తరువాత మరొక శరీరము, ఒక్క శరీరము తరువాత మరొక శరీరము. ఇది పరిస్థితి. ధర్మము అంటే క్రమంగా కాకులను హంసలుగామార్చటము. అది ధర్మము .

ఒక వ్యక్తి చాలా నిరక్షరాస్యులుగా, సంస్కారము లేని వ్యక్తి అయినా, అతనిని విద్యావంతుడిగా, సంస్కారము కలిగిన వ్యక్తిగా మార్చవచ్చు. విద్య ద్వారా, శిక్షణ ద్వారా. అందువల్ల మానవ జీవితంలో మార్పు తీసుకు వచ్చే అవకాశము ఉన్నది. ఒక భక్తుడిగా ఉండటానికి నేను కుక్కకు శిక్షణ ఇవ్వలేను. అది కష్టం. ఆది కూడా చేయవచ్చు. కానీ నేను అంత శక్తివంతమైన వాడిని కాదు. చైతన్య మహాప్రభు చేస్తున్నట్లుగానే. అయిన అడవి గుండా వెళ్ళుచుండగా, జర్ఖండా, పులులు, పాములు, జింకలు, జంతువుల అవి భక్తులు అయ్యాయి. మనము చేయలేము చైతన్య మహాప్రభకు సాధ్యమయ్యింది ... ఎందుకంటే అయిన దేవుడు. అయిన ఏమీ అయిన చేయగలరు. మనము అలా చేయలేము. కానీ మనం మానవ సమాజంలో పనిచేయవచ్చు. ఇది పట్టింపు లేదు, అయిన ఎంత పతితుడు అయిన అయిన మన ఆదేశాన్ని అనుసరించినట్లయితే, అయినను మార్చ వచ్చు.

దీనిని ధర్మ అని పిలుస్తారు. ధర్మ అంటే తన స్వరూప స్థితికి తీసుకురావటాము అని అర్ధం. అది ధర్మము . డిగ్రీలు ఉండవచ్చు. కానీ మన స్వరూప స్థితి మనము దేవుడి ఆoశ, మనము దేవుడు యొక్క ఆoశ అని అర్ధము చేస్తుకున్నప్పుడు, అది మన స్వరూప స్థితి. దీనిని బ్రహ్మ-బుతా స్థితి అని పిలుస్తారు (SB 4.30.20), తన బ్రాహ్మణ సాక్షాత్కారాన్ని, గుర్తింపుని అర్ధము చేసుకొనుట.