TE/Prabhupada 0225 - నిరాశ చెందవద్దు, గందరగోళం చెందవద్దు



Lecture at Engagement -- Columbus, may 19, 1969


మానవ నాగరికత ఆత్మను అర్థం చేసుకోవడము కోసం ఉంది, నేను ఏమిటి, ఆ ప్రకారం వ్యవహరించడానికి. అందువల్ల భాగవతము చెప్తుంది, మనము ఆ విషయమును అర్థం చేసుకునే ఆ దశకు రాకపోతే, అప్పుడు నేను చేస్తున్నది లేదా ప్రయత్నిస్తున్నది, అది కేవలం ఓటమి అవుతుంది, లేదా కేవలం సమయం వృధా అవుతుంది. అదే సమయంలో, మన జీవితంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదని హెచ్చరిక ఉంది. ఈ వేదముల సూచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎంత బాగున్నాయో. చాణిక్య పండితుడు అనే గొప్ప రాజకీయ నాయకుడు ఉన్నాడు. గ్రీసులో అలెగ్జాండర్ ది గ్రేట్ పాలనలో సమకాలీకుడు, చక్రవర్తి చంద్ర గుప్తునికి ప్రధాన మంత్రి. ఈ విధంగా ఆయన ఆ చక్రవర్తి చంద్రగుప్తునికి ప్రధాన మంత్రిగా ఉన్నాడు, ఆయన దగ్గర అనేక నైతిక సూచనలు మరియు సామాజిక సూచనలు ఉన్నాయి. తన శ్లోకాలలో ఒకదానిలో, ఆయన చెప్తాడు āyuṣaḥ kṣaṇa eko 'pi na labhyaḥ svarṇa-koṭibhiḥ. Āyuṣaḥ, "మీ జీవిత కాల వ్యవధిలో." ఉదాహరణకు మీరు ఇరవై సంవత్సరాల వయస్సు గలవారని అనుకుందాం. నేడు మే 19, అక్కడ 4 p.m. సమయము ఇప్పుడు, ఈ సమయం, 4 p.m., 19 మే 1969, వెళ్ళి పోయినది. మీరు మిలియన్ల డాలర్లను చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ మీరు తిరిగి పొందలేరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధముగా, మీ జీవితంలో ఒక క్షణం అయినా, వ్యర్థము చేసుకుంటే ఏమి సాధించకుండా, కేవలం ఇంద్రియ తృప్తి విషయములో - తినడం, నిద్రపోవటం, మైథున సుఖము, రక్షించుకోవటము - అప్పుడు మీకు మీ జీవిత విలువ తెలియదు. మిలియన్ల డాలర్లు చెల్లించడం ద్వారా మీరు మీ జీవితం యొక్క క్షణం తిరిగి పొందలేరు. ఎంత విలువైనది మీ జీవితమో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి.

కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు జీవితము ఎంత విలువైనదో తెలుసుకునేలా చేసి, ఆ విధముగా దానిని ఉపయోగించుకునేటట్లు చేయడము మన ఉద్యమం sarve janah sukhino bhavantu: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. మానవ సమాజము మాత్రమే కాదు, జంతు సమాజం కూడా. మనము ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చూడాలనుకుంటున్నాము. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము. ఆచరణాత్మకముగా ఉంది; ఇది కల కాదు. మీరు సంతోషంగా ఉండవచ్చు. నిరాశ చెందవద్దు, గందరగోళం చెందవద్దు. మీ జీవితం విలువ కలిగి ఉంది. నీవు ఈ జీవితంలో, నీ శాశ్వత జీవితాన్ని, జ్ఞానం యొక్క శాశ్వతమైన ఆనందకరమైన జీవితాన్ని గ్రహించగలవు. అది సాధ్యమే; ఇది అసాధ్యం కాదు. కాబట్టి మనము కేవలం ఈ సందేశాన్ని ప్రపంచానికి ప్రచారము చేస్తున్నాము మీ జీవితం చాలా విలువైనది. కేవలం పిల్లులు కుక్కలు వలె దానిని వృధా చేసుకోవద్దు. పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇది భగవద్గీతలో ప్రకటన. భగవద్గీతను యధాతధముగా మనము ప్రచురించాము. దీన్ని చదవడానికి ప్రయత్నించండి. నాలుగవ అధ్యాయంలో భగవద్గీతలో ఇది చెప్పబడింది, janma karma me divyaṁ yo jānāti tattvataḥ: కేవలం కృష్ణుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, కృష్ణుడు అంటే ఏమిటి ఆయన కర్తవ్యము ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు, ఆయన ఏమి చేస్తాడు...., జన్మ కర్మ. జన్మ అంటే ఆవిర్భావము. అంతర్ధానము; కర్మ అంటే కార్యక్రమాలు ; దివ్యం - అధ్యాత్మికము. Janma karma me divyaṁ yo jānāti tattvataḥ. వాస్తవానికి, కృష్ణుడి ఆవిర్భావము మరియు కార్యక్రమాలను తెలిసిన ఒక వ్యక్తి భావోద్వేగంతో కాకుండా కానీ శాస్త్రీయ అధ్యయనం ద్వారా - అప్పుడు ఫలితము tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) కేవలము కృష్ణుడిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు భౌతిక జీవితము యొక్క ఈ దుర్భరమైన స్థితికి ఇంక రారు. ఇది సత్యము. మీ జీవితంలో కూడా, ఈ జీవితంలో, మీరు అర్థం చేసుకుంటారు, మీరు సంతోషంగా ఉంటారు