TE/Prabhupada 0259 - కృష్ణుడి మీద ప్రేమగల ఆధ్యాత్మిక స్థితికి తిరిగి ప్రవేశించినట్లయితే

Revision as of 18:59, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 27, 1968


కొంత మంది ఈ సమావేశంలో ఉన్న వారు ఎవ్వరైనా చెప్పగలరా తాను ఎవ్వరికి లేదా దేనికి సేవకుడు కాదు అని? అయిన అయి తీరాలి, ఎందుకంటే ఇది తన స్వరూప స్థానము. కానీ కష్టం ఏమిటంటే మన ఇంద్రియాలకు సేవ చేయటము ద్వారా, సమస్య పరిష్కారం కాదు, దుఃఖముల యొక్క. ప్రస్తుతానికి, నేను సంతృప్తి చెంద వచ్చు ఈ మత్తుని తీసుకున్నాను అని, ఈ మత్తు లో నేను "నేను స్వేచ్ఛగా ఉన్నాను నేను ఎవరి సేవకుడిని కాదు, కానీ ఇది కృత్రిమమైనది" అని అనుకోవచ్చు. భ్రాంతి పోయిన వెంటనే, అతడు మళ్ళీ, సేవకుడిగా ఉంటాడు.మళ్ళీ సేవకుడు.

ఇదిమనపరిస్థితి. కానీ ఎందుకు ఈ పోరాటము ఉంది? నేను బలవంతం సేవ చేస్తున్నాను, కాని నాకు సేవ చేయడానికి ఇష్టము లేదు. సర్దుబాటు ఏమిటి? ఈ సర్దుబాటు కృష్ణ చైతన్యము, మీరు కృష్ణుడి సేవకునిగా ఉంటే, మీరు యజమానిగా మారాలనే ఆశయాము అదే సమయంలో స్వేచ్ఛగా ఉండాలనే మీ ఆశయము, వెంటనే సాధించవచ్చు. అర్జునుడు కృష్ణుడి యొక్క ఒక చిత్రాన్ని ఇక్కడ చూస్తారు. కృష్ణుడు దేవాదిదేవుడు. అర్జునుడు ఒక జీవుడు, జీవిస్తున్నడు, ఒక్క మానవుడు, కానీ అయిన కృష్ణుడితో ప్రేమలో ఉన్నాడు. తన స్నేహపూర్వక ప్రేమ వలన కృష్ణుడు అయినకు రధసారధి అయ్యాడు అతనికి సేవకుడు అయ్యాడు. అదేవిధంగా, మనలో ప్రతీ ఒక్కరము, కృష్ణుడి మీద ప్రేమగల ఆద్యాత్మిక స్థితిలో తీరిగి ప్రవేశపెట్టబడినట్లయితే, అప్పుడు యజమాని అవ్వాలనే కోరిక నెరవేరుతుంది. ప్రస్తుతం ఇది తెలియదు, కానీ మనము కృష్ణుడికి సేవ చేయడానికి అంగీకరిస్తే, అప్పుడు క్రమంగా మనకు కృష్ణుడు సేవ చేస్తున్నాడని చూస్తాము. ఇది సాక్షాత్కారము యొక్క ప్రశ్న. కానీ ఈ భౌతిక ప్రపంచములో ఈ ఇంద్రియాల సేవ నుండి బయటపడాలనుకుంటే, అప్పుడు మనముమన సేవ వైఖరిని కృష్ణుడికి బదిలీ చేయాలి. దీనిని కృష్ణ చైతన్యము అని పిలుస్తారు.

kāmādīnāṁ kati na katidhā pālitā durnideśās
teṣāṁ mayi na karuṇā jātā na trapā nopaśāntiḥ
sāmpratam aham labdha-buddhis
tvām āyātaḥ niyuṅkṣvātma-dāsye

ఒక భక్తుడు కృష్ణుడికి ప్రార్థిస్తున్నాడు, "నా జీవితంలో, నేను నా ఇంద్రియాలకు సేవ చేశాను" Kāmādīnām. కామా అంటే ఇంద్రియాలు, కామము. నేను చేయకూడనిది అయిన, ఇంకా, నా కామ ప్రేరణ వలన నేను దానిని చేశాను. ప్రతి ఒక్కరు చేయాలి. ఒకరు బానిస లేదా సేవకుడిగా ఉన్నప్పుడు, అప్పుడు అయిన బలవంతము వలన పని చేసాడు కానీ ఆయినకు పని చేయడము ఇష్టం లేదు. అయిన బలవంతంగా. ఇక్కడ, ఒక భక్తుడు ఒప్పుకుంటాడు "నేను చేశాను నా కామము వలన" నేను చేయకుడానిది, కానీ నేను చేశాను. " సరే, మీరు చేసారు, మీరు మీ ఇంద్రియాలకు సేవ చేస్తున్నారు. పర్వాలేదు. కానీ ఇబ్బంది ఏమిటంటే teṣāṁ karuṇā na jātā na trapā nopaśāntiḥ. నేను చాలా సేవ చేశాను, కానీ వారు సంతృప్తి చెందలేదు అని నేను గుర్తించాను. వారు సంతృప్తి చెందలేదు. ఇది నా కష్టం. ఇంద్రియాలు సంతృప్తిపడలేదు లేదా నేను సంతృప్తి చెందాలేదు, లేదా ఇంద్రియాలు దయతో నాకు ఉపశమనం ఇవ్వలేదు , సేవ నుండి పెన్షన్ ఇవ్వలేదు. ఇది నా పరిస్థితి. " నేను చూసినట్లయితే, నేను భావించినట్లయితే, నేను చాలా సంవత్సరాలు నా ఇంద్రియాలను సేవించాను, ఇప్పుడు నా ఇంద్రియాలు సంతృప్తి చెందినవి ... లేదు. అవి సంతృప్తి చెందలేదు. ఇప్పటికీ నిర్దేశిస్తున్నాయి. ఇప్పటికీ నిర్దేశిస్తున్నాయి. "నేను చాలా..." వాస్తవానికి, ఇది చాలా సహజమైనది, కానీ నేను బహిర్గతం చేస్తున్నాను ఇప్పుడు, నా విద్యార్ధులు కొందరు, తన తల్లి వృద్ధాప్యంలో, ఆమె పెళ్లి చేసుకోబోతుందని చెప్పారు. చూడండి. ఆమె ఎదిగిన పిల్లలను కలిగి ఉంది. తన అమ్ముమ్మ కూడా వివాహము చేసుకుంటుందని కొంత మంది ఫిర్యాదు చేశారు. ఎందుకు? చూడండి. డెభ్భై-ఐదు సంవత్సరాల వయస్సులో, యాభై సంవత్సరాల వయస్సులో, ఇంద్రియాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి, ఆమె ఆదేశించబడుతున్నది: "అవును, నీవు చేయవలెను."