TE/Prabhupada 0287 - కృష్ణుడి పట్ల మీ జ్ఞాపకశక్తిని, మీ ప్రేమను పునరుద్ధరించుకోండి

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture -- Seattle, September 30, 1968


ప్రభుపాద: ఏమైన ప్రశ్నలు ఉన్నాయా?

మధుద్విస: ప్రభుపాద? మీ భగవద్-గీత వచ్చేంతవరకు మేము శ్రీమద్-భాగావతం చదవవచ్చా? లేదా భగవద్గీత చదివేందుకే మా సమయాన్ని పూర్తిగా అంకితం చేయమంటార, తరువాత మేము ..., అక్కడ నుండి చదువుకుంటూ పోవాలా లేదా శ్రీమద్-భాగావతం యొక్క అధ్యయనం కొనసాగించాలా?

ప్రభుపాద: లేదు మీరు భగవద్గీత యధాతధమును చదవండి. ఇది ఒక ప్రాథమిక విభాగం. ఆధ్యాత్మిక స్థితిలో, ప్రతిదీ సంపూర్ణంగా ఉంటుంది. మీరు భగవద్గీత చదివినట్లయితే, మీకు శ్రీమద్-భాగావతం లో ఉన్నట్లుగానే అదే ప్రతిపాదన లభిస్తుంది. మీరు శ్రీమద్-భాగావతం చదివిన్నంత మాత్రానా మీరు భగవద్గీత అధ్యయనం చేయలేదని కాదు. ఇది అలాంటిది కాదు. మీరు ఈ సాహిత్యాలను చదివి హారే కృష్ణ మంత్రాన్ని జపము చేయండి, నియమాలు నిబంధనలు అనుసరించి సంతోషంగా నివసిoచండి మా కార్యక్రమము చాలా అన్నందాన్ని ఇచ్చే కార్యక్రమము. మనము జపము చేస్తాము, మనము నృత్యం చేస్తాము, మనము కృష్ణుడి ప్రసాద్ని తింటాము, మనము కృష్ణుడి యొక్క మంచి చిత్రాలను చిత్రిస్తాము చక్కగా అలంకరించబడినవిగా చూస్తాము, మనము తత్వము చదువుతాము. కావునా మీకు ఇంకా ఏమి కావాలి? (నవ్వుతూ) జాహ్నవ: ప్రారంభంలో కృష్ణుడి మీద మన వాస్తవమైన ప్రేమ యొక్క అవగాహనను ఎలా మరియు ఎందుకు కోల్పోయాము?

ప్రభుపాద: హమ్?

తమాల కృష్ణ: ఎలా మరియు ఎందుకు ... మొదట్లో కృష్ణుడి పట్ల మన ప్రేమను ఎలా కోల్పోయాము?

జాహ్నవ: లేదు, ప్రేమ కాదు. ప్రేమ యొక్క అవగాహన, కృష్ణుడి పట్ల మనకున్న వాస్తవమైన ప్రేమ.

ప్రభుపాద:మనకు అవగాహన ఉంది. మీరు ఎవరినైన ప్రేమిస్తారు. కానీ మీరు కృష్ణుడిని ప్రేమిoచడానికి ఉన్నారు, మీరు మర్చిపోయారు. మరచిపోవడము కూడా మన స్వభావం . కొన్నిసార్లు మనం మర్చిపోతాము. ఎందుకంటే మనము చాలా చిన్న వారిమి నేను గత రాత్రి ఈ సమయంలో ఏమి చేస్తున్నన్నో నాకు సరిగ్గా గుర్తులేదు. మరచిపోవడము మనకు అసహజమైనది కాదు. మరలా, ఎవరైనా మన జ్ఞాపకశక్తిని పునరుద్ధరించినట్లయితే, దానిని అంగీకరిస్తాము, అది కూడా అసహజమైనది కాదు. మన ప్రేమించవలసినది కృష్ణుడిని . ఎట్లగైతేనే, మనము అయినని మర్చిపోయాము. మనము ఎప్పుడు మర్చిపోయము అన్నది చరిత్ర నుoడి కనుగొనలేము. అది నిరుపయోగమైన పని. కానీ మనము మర్చిపోయము, అది వాస్తవం. ఇప్పుడు అది పునరుద్ధరించుకోండి. ఇక్కడ గుర్తించే అవకాశము ఉంది. అవకాశాన్ని తీసుకోండి. చరిత్ర,లో ప్రయత్నించవద్దు, ఎందుకు మీరు మర్చిపోయారు, నా మతిమరుపు ఎ రోజునుండి వచ్చింది. మీకు తెలిసినా, ఉపయోగం ఏమిటి? మీరు మర్చిపోయారు. తీసుకోoడి. మీరు ఒక వైద్యుడి దగ్గరకు వెళ్లినట్లయితే, మీకు ఈ వ్యాధికి ఎలా వచ్చిoదో, ఈ వ్యాధి యొక్క చరిత్ర ఏమిటి అని,అయిన అడగడు, ఏ రోజున, మీరు ఏ సమయంలో మీకు సోకినది. అడగడు.

అయిన మీ పల్స్ను చూస్తాడు మీకు ఒక వ్యాధిని వు౦ది ఆని చూస్తాడు అయిన మీకు ఔషధం ఇస్తాడు: "అవును, మీరు తీసుకోండి." అదేవిధంగా, మనము బాధపడుతున్నాము. ఇది వాస్తవము. ఎవరూ తిరస్కరిస్తారు. ఎందుకు మీరు బాధపడుతున్నారు? కృష్ణుడిని మర్చిపోయారు. అంతే. ఇప్పుడు మీరు కృష్ణుడి గురించి మీ జ్ఞాపక శక్తిని పునరుద్ధరించుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. అంతే. చాలా సులభమైన విషయము. ఇప్పుడు మీరు మర్చిపోయినప్పుడు చరిత్రను కనుగొనుటకు ప్రయత్నించ వద్దు మీరు మర్చిపోయారు, ఇది వాస్తవము, మీరు బాధ పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమము ఒక అవకాశం ఉన్నది. కృష్ణుడి పట్ల మీ జ్ఞాపకశక్తిని, మీ ప్రేమను పునరుద్ధరించుకోండి, సరళమైన విషయము. హరే కృష్ణ కీర్తన చేయండి, నృత్యం చేయండి, కృష్ణ ప్రసాదమును తీసుకోండి. మీరు విద్యావంతులు కాకపోతే, మీరు నిరక్షరాస్యులు అయితే, వినండి. మీకు సహజ బహుమతి, చెవి ఉన్నది. మీకు సహజ నాలుక ఉంది. మీరు హారే కృష్ణ కీర్తన చేయండి. మీరు జ్ఞానం ఉన్న వ్యక్తుల నుండి భగవద్గీత లేదా శ్రీమద్-భగవతం వినండి. అడ్డంకులు లేవు. ఏ ఇబ్బంది లేదు. దీనికి ఏ పూర్వ అర్హత అవసరం లేదు. ఉదాహరణకు మీకు ఉన్న మీ ఆస్తిని ఉపయోగించాలి. అంతే. మీరు అంగీకరించాలి. అది కావలసినది. "అవును, నేను కృష్ణ చైతన్యాన్ని తీసుకుoటాను." ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు స్వతంత్రులు. మీరు విభేదిస్తే, "లేదు. నేను ఎందుకు కృష్ణుడిని తీసుకోవాలి?" ఎవరూ మీకు ఇవ్వలేరు. కానీ మీరు అంగీకరిస్తే, ఇది చాలా సులభం. తీసుకోoడి.