TE/Prabhupada 0298 - మీరు కృష్ణుడికి సేవ చేయాలనే ఆందోళనతో ఉంటే, అది వాస్తవమైన ఆస్తి

Revision as of 19:06, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 4, 1968


ప్రభుపాద: ఏమైన ప్రశ్నలు ఉన్నాయా?

విష్ణుజన: కృష్ణుడికి మనం ఎలా పరిపూర్ణ సేవ చేస్తాము?

ప్రభుపాద: మీ ఆందోళన ద్వారా. (నవ్వు, "హరిబోల్!") మీరు కృష్ణుడికి సేవ చేయాలనే ఆందోళనతో ఉంటే, అది వాస్తవమైన ఆస్తి. కృష్ణుడు అపరిమితమైనవాడు. మనము ఏ సేవ చేయగలము? అయినకు అపరిమితమైన సేవకులు కూడా ఉన్నారు. ఆయినకు నీ నుండి నా నుండి ఏ సేవ అవసరము? అయిన తనకు తానే పరిపూర్ణుడు. అయినకు ఏ సేవ అవసరం లేదు. కానీ అయినను సేవించాలని మీరు కోరుకుంటే, అయిన తిరస్కరిoచడు. అది అయన దయ; ఇది అయిన ఔదార్యం మీరు కృష్ణుడికి సేవ చేయాలని మీ ఆందోళనను మీరు మరింత పెంచుకుంటూ ఉంటే, అది మరింత పరిపూర్ణము అవ్వుతుంది. అయిన అపరిమితమైన వాడు. మీ ఆందోళన, మీరు అపరిమితమైన వాడిగా మారుతారు. కావునా పోటీ ఉంది. మరింత మీరు కృష్ణుడికి సేవచేస్తుంటే, అతడు మిమ్మల్ని మరింత అంగీకరిస్తారు అతను మీకు మరింత తెలివి ఇస్తాడు. మీరు చూడoడి? ఆధ్యాత్మిక ప్రపంచం అపరిమితమైంది. సేవకు ముగింపు అనేది లేదు, సేవను తీసుకొనటానికి ముగింపు లేదు. అది కాదు. కావునా ఆత్రుత ఉండాలి Tatra laulyam eka mūlyam. అంటే ... నేను జవాబును తయారు చేయడములేదు, కానీ నేను రుపా గోస్వామి,మన ఆచార్యులు నుండి మీకు రుజువు ఇస్తున్నాను. అయిన అన్నాడు, kṛṣṇā-bhakti-rasa-Bhāvitā matiḥ krīyatāṁ yadi kuto 'pi labhyate: నా ప్రియమైన పెద్దమనుషుల్లారా, నా ప్రియమైన అబ్బాయిలు అమ్మాయిలు, మీరు ఒక కొనుగోలు చేస్తే ..., మీ భావనతో కృష్ణుడి ప్రేమను - 'నేను కృష్ణుడిని ఎంత ఎక్కువగా ఎంత ఎక్కువగా ప్రేమించగలను?' - ఇoతగా, ఈ ఆందోళన, మీరు ఈ మతిని కొనుగోలు చేయగలిగితే, "- అంటే అర్థం మేధస్సును ఇవి చాలా మంచి తెలివితేటలు, "'నేను కృష్ణుడిని ఎలా సేవిస్తాను ...' Kṛṣṇa-bhakti-rasa-bhāvitā matiḥ. మతి అంటే అంటే మేధస్సు లేదా మనస్సు యొక్క స్థితి ఆని అర్థం, "నేను కృష్ణుడికి సేవ చేస్తాను". మీరు ఈ మనస్సు యొక్క స్థితిని ఎక్కడైనా కొనుగోలు చేయగలిగితే, దయచేసి వెంటనే కొనుగోలు చేయండి. అప్పుడు తదుపరి ప్రశ్న ఉంటుంది, "సరే, నేను కొనుగోలు చేస్తాను. ధర ఏమిటి, మీకు తెలుసా? "" అవును, ధర ఏమిటో నాకు తెలుసు. " ఆ ధర ఏమిటి? "Laulyam, కేవలము మీ ఉత్సాహం, అది అంతే." Laulyam ekaṁ mūlyam. ", నేను కలిగి ఉంటాను." లేదు Na janma koṭibhis sukṛtibhir labhyate. ఈ ఆత్రుత, కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలి, ఇది ఎన్నో జన్మల తరువాత కూడా మీకు అందుబాటులో ఉండదు. అందువల్ల మీకు ఆ ఆందోళన చిటికెడు ఉంటే, "నేను కృష్ణుడిని ఎలా సేవించగలను?" మీరు చాలా అదృష్టవంతులు అని మీరు తెలుసుకోవాలి. ఒక చిటికెడు మాత్రమే, laulya, ఈ ఆందోళన, "నేను కృష్ణడికి సేవ ఎలా చేయాలి?" అది చాలా బాగుంది. అప్పుడు కృష్ణుడు మీకు తెలివితేటలు ఇస్తాడు.


teṣāṁ satata-yuktānāṁ
bhajatāṁ prīti-pūrvakam
buddhi-yogaṁ dadāmi tam...
(BG 10.10)


ఏ కపటత్వం లేకుండా, నా సేవలో ప్రేమతో మరియు వాత్సల్యంతో నిమగ్నమైనప్పుడు ఎవరైనా, అప్పుడు కృష్ణుడు ప్రతిదీ అర్థం చేసుకుoటాడు. అయిన మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అప్పుడు అయిన మీకు తెలివితేటలు ఇస్తాడు: "నా ప్రియమైన పుత్రుడా, నీవు ఇలా చేయి." అలా చేస్తే, అయిన ఏమి సాధిస్తాడు? Yena mām upayānti teay: "అయిన నా దగ్గరకు తిరిగి వస్తాడు." అయిన అక్కడకు వెళ్ళడం ద్వారా ఏమి లాభము పొందుతారు? Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama ( BG 15.6) Māṁ hi pārtha vyapāśritya ye 'pi syuḥ pāpa-yonayaḥ ( BG 9.32) Duḥkhalayam aśāśvatam ( BG 8.15) చాలా ఉన్నాయి. దయచేసి భగవద్గీత యధాతధమును చదవండి. మీకు పరిపూర్ణ జ్ఞానం, దేవుడి శాస్త్రం వస్తుంది. మానవునికి ఇది ఏకైక అధ్యయనం.


అందువల్ల కృష్ణుడికి సేవ చేయడాము అనే మీ అభిలాష మాత్రమే పరిపూర్ణము. ఆ ఆసక్తిని పెంచుకోoడి. ఆత్రుత అంటే, మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, అ ఆత్రుత పెరుగుతుంది మీ ప్రేమతో పాటు: నేను కృష్ణుడిని ఎలా సేవిస్తాను? మీరు స్వచ్ఛంద సేవకులు కనుక , ఎవరూ బలవంతము చేయరు. అంటే మీరు కృష్ణుడిని ప్రేమిస్తే తప్ప, ఆ ఆత్రుత ఎలా పెరుగుతుంది? కృష్ణుడిని ప్రేమించటానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రారంభములో ఈ śravaṇaṁ kīrtanam ఉంది. ఈ శ్రవణం, శ్రవణము, కీర్తన మరియు జపము చేయడము. మీరు హరే కృష్ణ మంత్రాన్ని వింటున్నారు, మీరు భగవద్గీత వింటున్నారు, మీరు కృష్ణుడి గురించి శ్రీమద్-భాగావతం వింటున్నారు, కీర్తన, జపము చేస్తున్నారు. ఇది ప్రారంభం. అప్పుడు, సహజంగా,


śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ
smaraṇaṁ pāda-sevanam
arcanaṁ vandanaṁ dāsyaṁ
sakhyam ātma-nivedanam
(SB 7.5.23)


ఈ తొమ్మిది విభిన్న రకాలైన కృష్ణుడి సేవలు మీకు జ్ఞానోదయము చేస్తాయి, మీమల్ని కృష్ణ చైతన్యములో ఉన్నత స్థానమునకు తీసుకు వెళ్ళుతాయి , మీ జీవితం విజయవంతము అవ్వుతుoది. ఏమైన ఇతర ప్రశ్నలు ఉన్నాయా? అర్థం చేసుకోండి. ప్రశ్నలు ఉన్నాయా? ఇ విషయమును మనము బలవంతంగా నెట్టడం లేదు. మీకు మేధస్సు వున్నది. కృష్ణుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు. మీ మేధస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ నివారించేందుకు ప్రయత్నించకoడి. దాన్ని అర్థం చేసుకోవడానికి మీ ప్రశ్నలు వేయండి. నివారించేందుకు ప్రశ్నలు వేయకoడి రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మీకు సహాయం చేయవు. మీరు కృష్ణుడి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లయితే, కృష్ణుడు మీకు తప్పించుకోవటానికి సహాయం చేస్తాడు, మీరు కృష్ణుడిని పట్టుకోవాలని కోరుకుంటే, మీరు ఎలా పట్టుకోగలరనే దానికి కృష్ణుడు మీకు సహాయం చేస్తాడు. రెండు విషయాలు జరుగుతున్నాయి. మీరు ఎ దారిని కోరుకుoటే, మీరు దానిని అంగీకరించవచ్చు. Ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham ( BG 4.11) కృష్ణుడు వ్యక్తి వైఖరి ప్రకారము సహాయము చేస్తాడు. ... అయితే ... చాలామంది తత్వవేత్తలవలె, వారు కృష్ణుడిని మరచిపోవాలనుకుంటారు. మీరు డాక్టర్ రాధాకృష్ణన్ పుస్తకంలో చూసినట్లు అయితే, తొమ్మిదవ అధ్యాయంలో కృష్ణుడు ఇలా అన్నాడు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) అనువాదం సరిగ్గానే ఉంది, కానీ అయిన ఇలా వ్యాఖ్యానించాడు, "మీరు ఆశ్రయము అవ్వవలెసినది కృష్ణుడికి కాదు." చూడండి. ఈ పుస్తకాన్ని వ్రాసే అయిన మొత్తం పద్ధతి, వ్యక్తులను తప్పుదోవ పట్టించడమే. ఎవరైనా కృష్ణుడిని మరచిపోవాలని కోరుకుంటే, కృష్ణుడు అతనికి అలాంటి తెలివితేటలు ఇస్తాడు, అయిన ఎప్పుడూ కృష్ణుడిని అర్థం చేసుకోలేడు. కృష్ణుడిని ఎవరైనా ప్రేమిoచాలనుకుoటే, కృష్ణుడిని అర్ధం చేసుకోవడానికి, అయిన పూర్తి తెలివి తేటలు ఇస్తాడు. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కృష్ణుడు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నాది. కానీ మీరు కృష్ణుడిని మర్చిపోతే, అప్పుడు మీరు మాయకు సేవ చేయాలి, మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, అప్పుడు మాయ మిమ్మల్ని వదిలిపెడుతుంది.