TE/Prabhupada 0362 - పన్నెండు మంది GBC మనకు ఉన్నట్లు , అదేవిధంగా కృష్ణుడికి పన్నెండు మంది GBC ఉన్నారు

Revision as of 19:16, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.13.15 -- Geneva, June 4, 1974


మీరు వీధిలో నడుస్తున్నట్లయితే, మీరు నడుస్తున్నప్పుడు చీమను చంపినట్లయితే, మీరు శిక్షించబడతారు. ఇది ప్రకృతి చట్టం. మనము అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. ప్రతి కదలికలో శిక్ష ఉంది. ఇప్పుడు, మీరు శాస్త్రములను నమ్మితే, అది వేరే విషయము. మీరు నమ్మకపోతే, మీకు నచ్చినది చేయండి. కానీ శాస్త్రం నుండి ప్రకృతి యొక్క చట్టాలను అర్థం చేసుకోవచ్చు, లేదా దేవుడుని, చాలా కఠినంగా, చాలా కఠినంగా ఉన్నాడు. మాండుకా మునీ యమరాజను శిక్షించారు, "నా బాల్యంలో, ఏ విధమైన జ్ఞానం లేకుండా నేను ఏదో చేసాను, దానికి మీరు నాకు పెద్ద శిక్ష వేసారు. మీరు ఒక బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు అవ్వటానికి అర్హత పొందకపోతే . మీరు శూద్రులు అవ్వుతారు. " అందువల్ల అయిన శూద్రుడు అవ్వాలని శపించబడ్డాడు. అందువల్ల యమరాజు విదురుడిగా జన్మను తీసుకున్నాడు. శూద్ర తల్లి గర్భంలో జన్మించాడు. ఇది విదురుని జన్మ చరిత్ర.

అయిన లేకపోవడంతో, ఆర్యమా, దేవతలలో ఒకడు, అయిన యమరాజా స్థానములో నియంత్రికుడుగా పనిచేశాడు. అందువల్ల, abibhrad aryamā daṇḍam అని అంటారు. కార్యాలయం కొనసాగాలి, మేజిస్ట్రేట్ పదవి ఖాళీగా ఉండకూడదు. ఎవరో ఒక్కరు వచ్చి నిర్వహించాలి. ఆర్యమా నిర్వహించాడు. Yathāvad agha-kāriṣu. Agha-kāriṣu. Agha-kāri means... అఘా అంటే పాపములు, మరియు kāriṣu. kāriṣu అంటే పాపములు చేసే వారు. యథావాత్. Yathāvatఖచ్చితముగా విషయమునకు, అయినను ఎలా శిక్షించాలని . Yathāvad agha-kāriṣu. Yāvad dadhāra śūdratvam. ఎంత కాలము యమరాజు శుద్రునిగా కొనసాగారో, ఆర్యమా అయిన స్థానములో యమరాజాగా భాద్యతలు నిర్వహించాడు. ఇది భాష్యము. (భాష్యమును చదువుతాడు :) "శూద్ర తల్లి యొక్క గర్భంలో జన్మించిన విదురుడు, నిషేధించబడినాడు తన సోదరులు ధృతరాష్ట్రుడు, పాండుతో పాటు రాజ వంశములో ఉండటానికి. అలాంటి జ్ఞానము కలిగిన వారికీ ఉపదేశించటానికి బోధకుడి పదవిని ఎలా పొందాడు ...? సమాధానము ఏమిటంటే, అయిన జన్మ ద్వారా శుద్రుడు అని అంగీకరించినా, అయిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఋషి మైత్రేయుని ఆద్వర్యములో ప్రపంచాన్ని పరిత్యజించాడు కనుక ఆధ్యాత్మిక జ్ఞానంలో సంపూర్ణముగా విద్యావంతుడైనాడు, అయిన ఒక ఆచార్యుని లేదా ఆధ్యాత్మిక గురువు పదవిని చేపట్టడానికి చాలా సమర్థుడు అయినాడు. " విదురుడు ఒక శుద్రుడు, జన్మించినది శుద్రునిగా. అప్పుడు అయిన ఎలా ప్రచారకుడు అయ్యాడు?

కారణం ఏమిటంటే... "శ్రీ చైతన్య మహాప్రభు ప్రకారం, ఆధ్యాత్మిక జ్ఞానం లేదా భగవంతుని విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానము ఉన్న వారు ఎవరైనా, అయిన ఒక బ్రహ్మాణుడు లేదా శుద్రుడు, గృహస్థుడు లేదా సన్యాసి అయినా, ఒక ఆధ్యాత్మిక గురువు అవ్వటానికి అర్హత పొందుతాడు. " అయిన శుద్రునిగా జన్మించాడు కనుక, అయిన ప్రచారము చేయలేడని కాదు, అయిన ఆచార్యుడు లేదా ఆధ్యాత్మిక గురువు పదవిని తీసుకోలేడు. అది చైతన్య మహా ప్రభు తత్వము కాదు. చైతన్య మహాప్రభు తత్వమునకు బాహ్య శరీరంతో ఈ శరీరాముతో ఏమీ సంభందము లేదు. చైతన్య మహా ప్రభు తత్వము ఆత్మతో సంబంధం కలిగి ఉంది. ఈ ఉద్యమము ఆత్మను ఉన్నత స్థానమునకు తీసుకు వెళ్ళుతుంది, అధోగతి కాకుండా ఆత్మను రక్షిస్తుంది. అందు వలన ప్రజలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారు. శరీర భావనలో, అదే కార్యక్రమాలు కర్మ అవ్వుతాయి. ఆధ్యాత్మిక జీవితంలో, అదే కర్మ భక్తి అవుతుంది. అదే కర్మ భక్తిగా ఉంటుంది. భక్తి అంటే చురుకుగా లేక పోవటము కాదు. భక్తి అoటే చురుకుగా ఉండటము. Yat karoṣi yaj juhoṣi yad aśnāsi yat tapasyasi kuruṣva tad mad-arpaṇam ( BG 9.27) ఇది భక్తి, భక్తి-యోగా. కృష్ణుడు ప్రతి ఒక్కరికీ చెబుతాడు, మీరు మీ కర్మను వదిలివేయలేకపోతే, అది సరే. కానీ మీ కర్మ ఫలితం, నాకు ఇవ్వండి. అప్పుడు అది భక్తి అవ్వుతుంది. "

విదురుడు యమరాజా. అయిన సాధారణ యమరాజు మాత్రమే కాదు, కానీ అయిన గొప్ప ప్రామాణికులలో ఒక్కరు. శాస్త్రంలో పన్నెండు మంది ప్రామాణికులు పేర్కొన్నబడ్డారు. వారిలో ఒకరు యమరాజా. Balir vaiyāsakir vayam. ఇది శ్రీమద్-భాగావతం లో చెప్పబడింది. కృష్ణుడి GBCలో యమరాజా ఒకరు. అవును. పన్నెండు మంది GBC మనకు ఉన్నట్లు , అదేవిధంగా కృష్ణుడికి పన్నెండు మంది GBC ఉన్నారు.

svayambhūr nāradaḥ śambhuḥ
kumāraḥ kapilo manuḥ
prahlādo janako bhīṣmo
balir vaiyāsakir vayam
(SB 6.3.20)

ఆ పన్నెండుమంది వ్యక్తులు కృష్ణ చైతన్యమును ప్రచారము చేయడానికి అధికారము కలిగి ఉన్నారు. మనము అనుసరించవల్సి ఉంటుంది. Mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మనము ఈ GBC ని సృష్టించాము. వారు చాలా బాధ్యతగల వ్యక్తులుగా ఉండాలి. లేకపోతే, వారు శిక్షించబడతారు. వారు ఒక శుద్రుడు అవ్వటానికి శిక్షించబడతారు. యమరాజు ఒక GBC అయినప్పటికీ, అయిన చిన్న తప్పు చేసాడు. అయిన ఒక శుద్రుడు అవ్వాలని శిక్షించబడ్డాడు. GBC అయిన వారు, వారు ISKCON యొక్క కార్య నిర్వహణను చాలా చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. లేకపోతే వారు శిక్షించబడతారు. పదవి చాలా పెద్దది, అదేవిధంగా, శిక్ష కూడా చాలా పెద్దది. ఇదే కష్టం. ఈ విదురుని ఉదాహరణ నుండి మీరు చూడవచ్చు. అయిన వెంటనే శిక్షించబడ్డాడు. అయిన చిన్న తప్పు చేసాడు. ఎందుకంటే ఋషులు, మునులు, వారు శాపం ఇస్తారు.