TE/Prabhupada 0410 - మన స్నేహితులు, వారు ఇప్పటికే అనువాదం ప్రారంభించారు

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Cornerstone Laying -- Bombay, January 23, 1975


కురుక్షేత్రము ఇప్పటికీ ధర్మ క్షేత్రము. వేదాలలో ఇది పేర్కొనబడింది, కురుక్షేత్రము ధర్మ-క్షేత్రము. కురుక్షేత్రానికి వెళ్లి మతపరమైన ఆచారాలను నిర్వహించాలి. అందువల్ల ఇది ధర్మ-క్షేత్రమైనది. "ఎందుకు ఈ కురుక్షేత్ర అంటే ఈ శరీరం, ధర్మ క్షేత్ర ఈ శరీరం " అని మనము అర్థం చేసుకోవాలి? ఎందుకు? ఎందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తారు? ఈ తప్పుదోవ పట్టించేది ఆపండి. కురుక్షేత్రం ఇప్పటికీ ఉంది. కురుక్షేత్ర స్టేషన్, రైల్వే స్టేషన్, అక్కడ ఉంది. అందువల్ల భగవద్గీత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ జీవితం విజయవంతం చేసుకోండి, ప్రపంచ వ్యాప్తంగ ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మీరు సంతోషంగా ఉంటారు; ప్రపంచం సంతోషంగా ఉంటుంది. నిజమే, ఇప్పుడు నేను చాల వృద్ధుడిని. నేను ఎనభై సంవత్సరాల వయస్సులో ఉన్నాను. నా జీవితం పూర్తయింది. కానీ నేను కొందరు భాధ్యత కలిగిన భారతీయులను ఇతర దేశాలతో కలపాలని కోరుకుంటున్నాను ... ఇతర దేశాలు, మంచి సహకారం సేవ చేస్తున్నాయి. లేకపోతే, నాకు చాల తక్కువ సమయంలో వ్యాప్తి చేయడం సాధ్యం కాదు, కేవలం ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా ఈ సంప్రదాయాన్ని ప్రచారము చేయడానికి. అందువల్ల నాకు భారతీయుల, ముఖ్యంగా యువకులు, చదువుకున్న వ్యక్తుల సహకారం అవసరం. ముందుకు రండి మాతో ఉండండి. భగవద్గీత అధ్యయనం చేయండి . మనకు తయారీకి ఏమీ లభించలేదు. తయారు చేయడానికి ఏమీ లేదు. మనం ఏమి తయారు చేయగలము? మనమంతా అసంపూర్ణులము అక్కడ ఏదైతే ఉందో, దానిని అధ్యయనం చేద్దాం ఆచరణాత్మకంగా జీవితంలో వర్తింప చేద్దాం , ప్రపంచవ్యాప్తంగ ఈసందేశాన్ని వ్యాప్తి చేద్దాం . ఇదిమనలక్ష్యం.

నేడు చాల పవిత్ర దినం. గొప్ప ఇబ్బందితో మనము ఇప్పుడు మంజూరు పొందాము. ఇప్పుడు ఈ ప్రయత్నంతో సహకరించండి, వీలైనంత వరకు మీ prāṇair arthair dhiyā vācā, నాలుగు విషయలు: మీ జీవితం ద్వార, మీ మాటల ద్వార, డబ్బు ద్వార ... ప్రాణైర్ అర్త్రైర్ yyā vācā śreya-ācaraṇaṁ sadā. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం. నీవు ఏదైతే కలిగి వున్నావో... నేను పేదవాడను, నేను ఈ ఉద్యమనికి సహాయం చేయలేను. లేదు. మీరు వచ్చారు అంటే ... మీరు మీ జీవితం ఇచ్చారు. మీరు మీ జీవితాన్ని అంకితం చేస్తే, అది అన్నిటికన్నా పరిపూర్ణమైనది. మీరు మీ జీవితాన్ని అంకితం చేయలేకపోతే, కొంత డబ్బు ఇవ్వండి. కానీ మీరు చేయగలిగితే ..., పేదవారైనచో, మీరు డబ్బు ఇవ్వలేరు, అప్పుడు మీరు కొంత బుద్ధిను ఇస్తారు మీరు వివేకి అయితే, అప్పుడు మీ ఉపదేశాలు ఇవ్వండి. ఏ విధంగానైనా, మీరు ఈ ఉద్యమానికి సహయపడగలరు సంక్షేమ కార్యక్రమాలను చేయగలరు, భారతదేశం వెలుపల, భారతదేశం కోసం. ఇది నా అభ్యర్థన. నేను మిమ్మల్ని ఆహ్వనించు చున్నాను. నేడు ఏకాదశి. మనమందరం ఉపవాసం చేస్తున్నాం. కొంత ప్రసాదం ఇవ్వబడుతుంది. వాస్తవానికి ప్రసాదం ముఖ్యం కాదు; ఇది మనము చేయడానికి తీసుకున్న ముఖ్యమైన పని , దేవుని చైతన్య ఉద్యమం వ్యాప్తి ఎలా. లేకపోతే, మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. సామాన్య భౌతికచైతన్యము, గృహ క్షేత్ర.. Ato gṛha-kṣetra-sutāpta-vittair janasya moho 'yam ahaṁ mameti ( SB 5.5.8). ఈ భౌతిక నాగరికత అంటే సెక్స్ కోరిక. స్త్రీ పురుషుని కోసం వెతుకును; పురుషుడు స్త్రీ కోసం వెతుకును . పుయస్ష స్ట్రియ మిథుని-భవం ఎట్య టైయర్ మిథః. వారు ఐక్యంగా ఉన్న వెంటనే, వారికి గృహం, అపార్ట్ మెంట్ అవసరం; గృహ క్షేత్ర, భూమి; Gṛha-kṣetra-suta, పిల్లలు, స్నేహితులు, డబ్బు; మోహో, భ్రాంతి, ahaṁ mameti ( SB 5.5.8) ఇది నేను, ఇది నాది. ఇది భౌతిక నాగరికత. కానీ మానవ జీవితం ఇందుకోసం కాదు. నయయి దెయో దేహ-భజనహ్ న్ర్రులోక్ కస్తథన్ కమన్ అర్హట్ వయిన్-భుజౌ యే ( SB 5.5.1) మీరు అధ్యయనం చేయండి. మనము ఇప్పుడు కావలసిన గ్రంథాలు కలిగి ఉన్నాము మా పుస్తకాలను చదవడానికి ఎటువంటి కష్టమూ లేదు. మనము ఇంగ్లీష్ అనువాదంలో ఇచ్చాము. అందరికీ ఏ వ్యక్తికైనా ఇంగ్లీష్ తెలుసు. మనము గుజరాతీ భాషలో, హిందీలో, అన్ని ఇతర భాషలలో ఇస్తాము. మన స్నేహితులు, వారు ఇప్పటికే అనువాదం ప్రారంభించారు. జ్ఞానం యొక్క కొరత ఉండదు. దయచేసి ఇక్కడికి రండి, కనీసం వారానికి ఒకసారైనా కూర్చొని, ఈ పుస్తకాలను అధ్యయనం చేయండి, జీవితం యొక్క తత్వము అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి, దీనిని ప్రపంచవ్యాప్తం చేయండి. ఇది భరతవర్ష యొక్క లక్ష్యం.

Bhārata-bhūmite manuṣya-janma haila yāra
janma sārthaka kari' kara para-upakāra
( CC Adi 9.41)

ఇది ఇతరులకు సంక్షేమాన్ని చేయటానికి ఉన్న పరోపకార ఉద్యమం, పిల్లులు కుక్కల వలె కాదు, కేవలం డబ్బు తెచ్చుకొని ఇంద్రియానందం పొందడం ఇది మానవ జీవితం కాదు. మానవ జీవితం పరోపకారం కోసం. ప్రజలు అజ్ఞానంలో ఉంటారు, దేవుని యొక్క జ్ఞానం లేకుండా జీవితం గురించి ఎటువంటి అవగాహన లేకుండా వారు కేవలం పిల్లులు, కుక్కలు, పందులు వలె పని చేస్తారు. వారిని విద్యావంతులను చేయాలి. అలాంటి విద్య పొందడానికి మానవ జీవితం ఒక అవకాశం. మానవ సమాజాన్ని విద్యావంతులను చేసి, మానవుడిగా ఉండటానికి తన జీవితాన్ని విజయవంతం చేసేందుకు ఇది కేంద్రంగా ఉంది. చాల ధన్యవాదాలు. హరే కృష్ణ.