TE/Prabhupada 0429 - కృష్ణుడు భగవంతుని పేరు. కృష్ణుడు అంటే అందరికీ ఆకర్షణీయమైనవాడు, అంతా మంచి వాడు

Revision as of 19:27, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972


మన ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే మొత్తం నాగరికత వెళ్తోంది, ప్రతి ఒక్కరూ శరీరము అనే తప్పుడు అభిప్రాయముతో ఉన్నారు. ఇది సత్యము కాదు. అందువలన, ఈ కృష్ణ కీర్తన, ఈ హరే కృష్ణ ఉద్యమం, ఇది ఒక ప్రత్యేక ప్రభావమును కలిగి ఉంది. ఇది... హరే కృష్ణ ఉద్యమం సాధారణ ధ్వని కంపనం అని అనుకోవద్దు. ఇది ఆధ్యాత్మిక ఉద్యమము. దీనిని మహా -మంత్రం అని పిలుస్తారు. మహా -మంత్రం. ఉదాహరణకు... పామును వశీకరించుకునే వారు మీ దేశంలో ఉన్నారో లేదో నాకు తెలియదు. భారతదేశంలో ఇప్పటికీ, చాలా మంది పాములను లొంగదీసుకునే వారు ఉన్నారు, క్షమించండి. కాబట్టి వారు ఏదో మంత్రాలను చదువుతారు, ఒక మనిషిని, పాము కరిచిన వారిని, అతనిని చైతన్యానికి తీసుకు రావచ్చు. భారత దేశము నుండి ఎవరైనా ఉంటే, వారికి తెలుసు. ఇప్పటికీ. ముఖ్యంగా నేను పంజాబ్ లో చూశాను, అనేక మంది పాము మంత్రగాళ్ళు ఉన్నారు, వారికి మంత్రాలు ఎలా చదవాలో తెలుసు. కాబట్టి అది భౌతికంగా సాధ్యమైతే చనిపోయిన వ్యక్తిని... వాస్తవానికి, ఒక మనిషిని పాము కరిస్తే ఆయన చనిపోడు. ఆయన చైతన్యము కోల్పోతాడు. ఆయన చనిపోడు. కానీ మంత్రమును చదవడము ద్వారా, ఆయన తన చైతన్యములోకి వస్తాడు. అందువల్ల, భారతదేశం లో పద్ధతి ఉంది, ఒక మనిషిని ఒక పాము కరిస్తే ఆయనను తగల పెట్టరు, లేదా ఆయనను మృతదేహముగా తీసుకోరు. ఆయనను ఒక పడవలో తీసుకు వెళ్ళి నీటికి వదిలివేస్తారు. ఆయనకు అవకాశం ఉంటే ఆయన తిరిగి చైతన్యములోకి రావచ్చు. అదేవిధముగా, మనము ప్రస్తుత సమయములో మన అజ్ఞానము వలన, మనము నిద్రిస్తున్నాం. మనము నిద్రిస్తున్నాం. అందువలన, మనల్ను మేల్కొపడానికి, ఈ మంత్రం, మహా-మంత్రం అవసరం. మేల్కొపుటకు. Ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) ఉదాహరణకు ఈ అబ్బాయిల వలె, నాతో పాటు ఉన్న ఈ యూరోపియన్ అబ్బాయిలు అమ్మాయిలు... నేను దాదాపు మూడు, నాలుగు వేలమంది శిష్యులను ఈ విధముగా కలిగి ఉన్నాను. వారు హరే కృష్ణని కీర్తన చేస్తున్నారు. వారు పిచ్చిగా చేయడము లేదు. వారు పూర్తిగా నమ్మారు. మీరు వారితో మాట్లాడినట్లయితే, వారు తత్వముపై చాలా చక్కగా మాట్లాడతారు. ప్రతిదీ అర్థము అయ్యేటట్లుగా, ఒక తెలివి ఉన్న మనిషి. కాబట్టి వారు ఎలా చేస్తున్నారు? నాలుగు సంవత్సరాల క్రితం, వారికి కృష్ణుడి నామము అంటే ఏమిటో తెలియదు. బహుశా వారు ఆంగ్ల నిఘంటువులో కృష్ణుడు అనే పేరును చూసి ఉండవచ్చు, హిందూ భగవంతుడు అని పేర్కొన్నట్లుగా. కానీ వాస్తవానికి, అది వాస్తవం కాదు. కృష్ణుడు భగవంతుని పేరు. కృష్ణుడు అంటే అందరికీ ఆకర్షణీయమైనవాడు, అంతా మంచి వాడు. అంతా ఆకర్షణీయము అంటే అర్థం ఆయన మంచి వాడు అయి ఉండాలి; లేకపోతే, ఆయన ఎలా ఆకర్షణీయంగా ఉంటాడు? చెడ్డవాడు,ఎవరైనా చెడ్డవాడు, అతడు ఆకర్షణీయముగా ఉండలేడు. అందువల్ల కృష్ణుడు, ఈ పదము, అంటే అర్థం, అన్నిటికీ ఆకర్షణీయమైన వాడు. ఆయన అన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు, అన్ని సంపదలను పొందాడు, అందువలన ఆయన ఆకర్షణీయంగా ఉంటాడు. ఇది సరైన వర్ణన, లేదా భగవంతుని యొక్క సరైన వివరణ. భగవంతునికి ఏదైనా నామము ఉంటే, ముఖ్యంగా, ఇది ప్రతిదానిలో పరిపూర్ణముగా ఉంటే, ఆ పదం కృష్ణుడు అవుతుంది. ఇది ఒక సంస్కృత పదం, కానీ అది సూచిస్తుంది... కృష్ణుడు అంటే భగవంతుడు అని శాస్త్రములో చెప్పబడింది, īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). ఈశ్వరః అనగా నియంత్రికుడు, పరమః, అంటే మహోన్నతమైన వాడు. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). ఇది వేద సాహిత్యం యొక్క ఉపదేశము. కాబట్టి మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక మతపరమైన వర్గ ఉద్యమం కాదు. ఇది శాస్త్రీయ తాత్విక ఉద్యమం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ పద్ధతి చాలా సులభం. పద్ధతి ఈ కీర్తన చేయడము ద్వారా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మనము ఇంద్ర జాలకులము కాదు, కానీ మేము మా విద్యార్ధులను అడుగుతాము కేవలం మీరు ఈ ఆధ్యాత్మిక మంత్రమును కీర్తన చేయండి, ఆయన హృదయము లోపల ఉన్న అన్ని మురికి విషయాల నుండి క్రమంగా పవిత్రుడు అవుతాడు. ఇది మన పద్ధతి. చైతన్య మహాప్రభు వివరించారు, ఆయన మనకు సూచన ఇచ్చాడు, ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12)

ఈ భౌతిక ప్రపంచంలో మన మొత్తం ఇబ్బందులు అపార్థం చేసుకోవడము వలన. మొదటి అపార్థం ఏమిటంటే "నేను ఈ శరీరం." వాస్తవానికి, మనలో ప్రతి ఒక్కరు, ఈ భావన మీద ఉన్నాము, శరీర భావనలో నిలబడి ఉన్నాము. ప్రాథమిక పునాది పొరపాటున ఉంది కనుక, అందువలన మనము సృష్టిస్తున్నది ఏదైనా మనము అర్థం చేసుకుంటున్నది ఏదైనా, అవి తప్పుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాథమిక స్థితి తప్పుగా ఉంది. కాబట్టి మొదట మనము ఈ శరీరము అనే తప్పుడు భావనను తరిమి వేయాలి " ఇది ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) అని పిలుస్తారు, హృదయమును పవిత్రము చేసుకోవడము. నేను ఆలోచిస్తున్నాను "నేను ఈ శరీరము" అని, కానీ వాస్తవానికి నేను ఇది కాదు. కాబట్టి మనము ఈ తప్పుడు భావనను పవిత్రము చేయాలి, అది చాలా సులభంగా జరుగుతుంది, కేవలం ఈ హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన, జపము చేయడము ద్వారా. ఇది ఆచరణాత్మకమైనది. కాబట్టి మా అభ్యర్థన ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరూ, మీరు దయతో మా ఉపదేశమును హారే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన చేయడానికి తీసుకుంటే. మీరు ఏమీ కోల్పోరు. కానీ లాభం చాలా ఉంది. మేము మీ నుంచి ఏమీ వసూలు చేయడము లేదు. ఇతరులు లాగా, వారు ఏదైనా మంత్రాన్ని ఇచ్చినట్లయితే, వారు వసూలు చేస్తారు. కానీ మేము ఉచితముగా పంపిణీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.పిల్లలు కూడా, వారూ తీసుకోవచ్చు. మన సంఘంలో చాలా మంది పిల్లలున్నారు. వారు కీర్తన మరియు నృత్యము చేస్తారు. దీనికి ఏ విద్య అవసరం లేదు. దీనికి ఏ ధర అవసరం లేదు. కేవలము మీరు కీర్తన చేస్తే... ఎందుకు మీరు ఒక ప్రయోగం చేయకూడదు మరియు చూడండి కీర్తన మరియు జపము చేయడము ద్వారా ? అది మా అభ్యర్థన. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఒకరు అభ్యంతరము చెప్పవచ్చు, "మేము మీ హిందూ ధర్మము యొక్క కృష్ణ నామమును ఎందుకు కీర్తన చేయాలి?" అందువల్ల మనము చెప్పడము లేదు కృష్ణుడు, లేదా భగవంతుడు... భగవంతునికి అనేక పేర్లు ఉన్నాయి. అది మనము ఒప్పుకుంటాము. అది కాదు... భగవంతుడు అపరిమితమైనవాడు. అందువలన, అతను అపరిమితమైన పేర్లను కలిగి ఉండాలి. కానీ ఈ కృష్ణ పదము చాలా ఖచ్ఛితమైనది, ఎందుకంటే ఇది అందరికీ ఆకర్షణీయమైనది. భగవంతుడు గొప్పవాడు అని మీరు చర్చించవచ్చు. పర్వాలేదు. ఆయన ఎంత గొప్పవాడు? అది మరొక అవగాహన. కాబట్టి మీరు అనుకుంటే "కృష్ణుడు హిందూ భగవంతుని పేరు," నేను ఎందుకు కీర్తన చేయాలి? కాబట్టి చైతన్య మహా ప్రభు చెప్పారు, "కాదు" మీ దగ్గర ఒక నామము ఉంటే, మరొక ప్రత్యామ్నాయమైన నామము, అప్పుడు మీరు ఆ నామమును కీర్తన చేయండి మా అభ్యర్ధన ఏమిటంటే మీరు పవిత్ర నామమును భగవంతుని పవిత్ర నామము కీర్తన చేయండి. మీ దగ్గర ఏదైనా భగవంతుని పేరు ఉంటే, మీరు కీర్తన చేయవచ్చు. మీరు పవిత్రము చేయబడతారు. అది మన ప్రచారము