TE/Prabhupada 0481 - కృష్ణుడు సర్వాకర్షకుడు. కృష్ణుడు సుందరంగా వుంటాడు

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture -- Seattle, October 18, 1968


కాబట్టి ఈ వాదన, ఎరుపు రక్తకణాలు నిలిపివేయబడ్డాయి; అందువలన జీవం నిలిచిపోయింది - లేదు. ఇలాంటి చాలా వాద ప్రతివాదాలు ఉన్నాయి. వాస్తవమునకు,మేము ప్రతిపాదించేది సత్యము, ఎందుకంటే మేము శాస్త్రములు,సాధువులు, ఆధ్యాత్మిక గురువు యొక్క వాక్కులచే బలపరచబడి మాట్లాడుతున్నాము. ఇది అవగహన చేసుకునే విధానం. మీరు మీ చిన్ని బుర్ర, అపరిపూర్ణ ఇంద్రియాలతో విషయాన్ని అర్థం చేసుకోలేరు. మానవులు, వారు ఎప్పుడూ అపరిపూర్ణులే. ఉదాహరణకు, ఒక పిల్లవాడు సూర్యుడిని చూస్తున్నాడు, మరియు ఒక శాస్త్రవేత్త సూర్యున్ని చూస్తున్నాడు. సహజంగానే, పిల్లలు,సూర్యుని పట్ల వారి జ్ఞానం అపరిపూర్ణమైనది. అదే పిల్లవాడు,అతను ఒక శాస్త్రవేత్త నుండి విషయాన్ని తెలుసుకున్నపుడు, సూర్యుడు చాలా గొప్పవాడు అని గ్రహిస్తాడు. అందువల్ల మన ఇంద్రియాల ద్వారా పొందే ప్రత్యక్షానుభవంతో కూడిన జ్ఞానం ఎల్లప్పుడూ అపరిపూర్ణమైనది. జీవితం యొక్క ప్రతి దశలో మీరు ప్రామాణిక త్వాన్ని అంగీకరించాలి. అదేవిధముగా, మీరు భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే, అప్పుడు మీరు ఈ భగవద్గీత ఆశ్రయం తీసుకోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయం లేదు. మీరు "దేవుడు ఈ విధముగా ఉండవచ్చు, దేవుడు అలాంటివాడు" అని కల్పనలు చేయకూడదు. దేవుడు లేడు, "దేవుడు నిర్జీవుడు,""దేవుడు నిర్జీవుడు కాదు." ఇది కల్పన. కృష్ణుడు చెపుతాడు,

mayy āsakta-manāḥ pārtha
yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ
yathā jñāsyasi tac chṛṇu
(BG 7.1)

మీరు దేవాదిదేవుడు, శ్రీకృష్ణుడు స్వయంగా మాట్లాడుతున్నట్లు విశ్వసించినట్లయితే, అర్జునుడు విశ్వశించినట్లుగా, అప్పుడు మీరు భగవంతుడంటే ఎవరో అర్థం చేసుకోవచ్చు. లేకపోతే అది సాధ్యం కాదు. Asaṁśayam.

కాబట్టి పద్ధతి ఏమిటంటే, మొట్టమొదటి పద్ధతి, mayy āsakta-manāḥ. మీరు మీ మనసును నిరంతరం కృష్ణుడి మీద నిలపాలి. అదే యోగపద్ధతి,దానినే మేము కృష్ణచైతన్యము అని ప్రచారము చేస్తున్నాము. కృష్ణచైతన్యము ... మీరు నిరంతరం మిమ్మల్ని కలుపుకుంటే, విద్యుచ్చక్తి నిలయంలో వుంచుకున్నట్లయితే, విద్యుత్ శక్తి యొక్క ఎడతెగని సరఫరా ఉంటుంది. అదేవిధముగా, మీరు మీ మనస్సును కృష్ణుని మీద నిరంతరం నిలిపివుంచినట్లయితే, అది చాలా కష్టంతో కూడిన విషయం ఏమీ కాదు. కృష్ణుడు సర్వాకర్షకుడు. కృష్ణుడు సుందరంగా వుంటాడు. కృష్ణుడు చాలా లీలలను ప్రదర్శించాడు. మన వైదికసాహిత్యం మొత్తం కృష్ణుని వివిధ లీలలతో నిండి ఉంది. ఈ భగవద్గీత కృష్ణుడి కార్యక్రమాలతో నిండి ఉంది. కేవలం భగవంతుడు గొప్ప అని అర్థం చేసుకోవడం, అది తటస్థ స్థితికి చెందిన అవగాహన. మీరు ఉన్నత స్థితికి చేరుతూ భగవంతుడు ఎంత గొప్ప అనేది అవగాహన చేసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో, అది అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, ఎందుకంటే మన ఇంద్రియలను ఎల్లప్పుడూ అసమగ్రమైనవి. కాని సాధ్యమైనంతవరకు మీరు భగవంతుని లీలల గురించి శ్రవణం చేయాలి, భగవంతుని ఉన్నత స్థితి గురించి,మరియు మీరు దాని గురించి ఆలోచించవచ్చు, మీరు మీ నిర్ణయాన్ని వ్యక్తపరచవచ్చు. మీరు మీ వాదనను వినిపించవచ్చు. అప్పుడు మీరు ఏ సందేహం లేకుండా భగవంతున్ని అర్థం చేసుకోగలుగుతారు. మొట్టమొదటి ప్రారంభం, mayy āsakta-manāḥ. చివరి అధ్యాయంలో కృష్ణుడు ఇలా వివరించాడు, కృష్ణుడి ఆలోచనలో నిరంతరం మునిగివున్న వ్యక్తి, అతను ఉత్తమ తరగతికి చెందిన యోగి, ఉత్తమ తరగతి యోగి. మీ దేశంలో యోగ పద్ధతి చాలా ప్రజాదరణ పొందింది, కాని మీకు ఉత్తమ తరగతి యోగి ఎవరో తెలియదు. భగవద్గీతలో ఉత్తమ తరగతి యోగి గురించి (ఉంది): yoginām api sarveṣāṁ mad-gatenāntarātmanā ( BG 6.47) అనేక, అనేక వేల యోగులలో, యోగి లేదా భక్తి-యోగి తనలో,తన హృదయము లోపల, కృష్ణుడి దివ్య రూపాన్ని దర్శిస్తూవుంటాడో, ఆయన ఉత్తమ తరగతి యోగి, ఆయన ఉత్తముడు. కాబట్టి మీరు ఆ ఉత్తమ తరగతి యోగ పద్ధతిని కొనసాగించాలి, మరియు అది ఇక్కడ వివరించబడినది, mayy āsakta-manāḥ: ఆసక్తి కలిగి.