TE/Prabhupada 0488 - కలహం ఎక్కడ ఉంది మీరు భగవంతున్ని ప్రేమిస్తే, అప్పుడుమీరు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు

Revision as of 19:37, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 18, 1968


ప్రభుపాద: అవును.

ఉపేంద్ర: ప్రభుపాద, కొన్ని సందర్భాలలో వ్యత్యాసాలు ఉండవచ్చు, భగవత్ ప్రేమ అంటే ఏమిటి అనే దాని మద్యలో క్రైస్తవ మరియు ముస్లింలకు , మస్లింల మరియు బౌద్ధల, బౌద్ధల మరియు హిందువుల మద్యలో. భగవంతుని ప్రేమ విషయంలో వారు తగాదాలుపడవచ్చు.

ప్రభుపాద:అటువంటి తగాదాలు, ఎవరైతే భగవంతుని ప్రేమలో లేరో, వారు తప్పక తగాదా పడతారు. అది ... ఎందుకంటే వారు పిల్లులు కుక్కల వంటివారు. మీరు పిల్లులు కుక్కల మధ్య శాంతియుత స్థితిని ఆశించలేరు. వారు కలహిస్తారు. వారు ఏవరైనప్పటికీ, వారు కలహిస్తున్నంతవరకు, వారు పరిపూర్ణ దశలో లేరు అని అర్థం. కలహం అనే ప్రశ్న ఎక్కడ ఉంది? మీరు భగవంతున్ని ప్రేమిస్తే, అప్పుడు మీరు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు. అది సంకేతం. Samaḥ sarveṣu bhūteṣu mad-bhaktiṁ labhate parām ( BG 18.54) సమానత్వ స్థాయిని సాధించిన తరువాత, అప్పుడు మీరు భగవత్ ప్రేమగల రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. దానికి ముందు, మీరు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. న్యాయ కళాశాలలో ప్రవేశించడానికి ముందు మీరు పట్టభద్రులు అయివుండాలి, అదేవిధముగ, భక్తియుక్త సేవ యొక్క రాజ్యం లోకి ప్రవేశించే ముందు, అందరు జీవులూ ఒకే స్థితిలో ఉన్నారని మీరు గుర్తించాలి. అదే సాక్షాత్కారము. అప్పుడు "ఇది తక్కువ", "ఇది ఎక్కువ" అని మీరు వ్యత్యాసాలు చూడలేరు. లేదు. Paṇḍitāḥ sama-darśinaḥ ( BG 5.18) ఒక వ్యక్తి సంపూర్ణంగా జ్ఞానవంతుడైనప్పుడు, అతను ఏ వ్యత్యాసాన్నీ చేయడు, అతను మానవుడు, అది ఆవు, అది కుక్క అని వ్యత్యాసం చూపడు. అతను జీవాత్మ వివిధ దుస్తులలో కప్పబడి వున్నట్లు దర్శిస్తాడు. అంతే. ఇది ఆయన దృష్టి, సార్వత్రిక సమానత్వ దృష్టి. మీరు కుక్కకు జీవం లేదని చెప్పలేరు, ఆవు జీవం కలిగిలేదని చెప్పలేరు. జీవం లేదని మీరు ఎలా చెప్పగలరు? మీకు జ్ఞానం కొరవడటమే అందుకు కారణం. జీవం యొక్క లక్షణం ఏమిటి? మీరు జీవం యొక్క లక్షణాన్ని మానవునిలో, చీమలో కూడా చూడగలరు. ఎలా మీరు చిన్న జంతువులకు, తక్కువ స్థాయి జంతువులకు జీవం లేదని చెప్పగలరు? అది మీ అజ్ఞానం. చెట్లు, మొక్కలు, అవి కూడ జీవాన్ని కలిగివున్నాయి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అవసరం. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం ఆధారంగా గల భగవత్ప్రేమ వాస్తవమైన భగవత్ప్రేమ. లేకపోతే అది మూఢనమ్మకం. దురాభిమానులు, వారు కలహించవచ్చు. అది భగవత్ప్రేమ కాదు. ఆ దశకు చేరడం చాలా కష్టమే,అయినా కానీ అందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలి. అదే కృష్ణచైతన్యము. మేమందరమూ విద్యార్థులము. మేము ప్రయత్నిస్తున్నాము. అయితే ఇందులో వివిధ స్థాయిలు కూడా ఉన్నాయి. ఒక విద్యా సంస్థలో పదవ తరగతి, ఎనిమిదవ తరగతి, ఐదవ తరగతి, ఆరవ తరగతి ఇలా వున్నట్లు. మరియు యోగతో, ఇది ఒక మెట్లలాగ లేదా లిఫ్ట్ లాగా వుంటుంది. కాబట్టి పరిపూర్ణత్వంలో వివిధ దశలు ఉన్నాయి. అత్యున్నతమైన పరిపూర్ణత్వం అంటే కృష్ణుడి గురించి నిరంతరం ఆలోచించడం.అదే ... yoginām api sarveṣāṁ mad-gatenāntarātmanā śraddhāvān bhajate... ( BG 6.47) అత్యున్నత పరిపూర్ణత్వం కృష్ణుడు.రాధాకృష్ణుల గురించి ఎల్లప్పుడూ ఆలోచించడం. అది అత్యున్నత పరిపూర్ణ దశ. ఆవ్యక్తికి వేరే కర్తవ్యం వుండదు: కేవలం కృష్ణుడి గురించి ఆలోచించడమే.