TE/Prabhupada 0667 - ఈ శరీరము కారణముగా మొత్తము తప్పుడు చైతన్యము వచ్చింది



Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

భక్తులు: కీర్తి అంతా శ్రీ గౌరాంగాకు.

భక్తుడు: పదహారవ శ్లోకము: "ఒక యోగి అయ్యే అవకాశము లేదు, ఓ అర్జునా, ఒకవేళ ఎవరైనా చాలా ఎక్కువగా తిన్నా లేదా చాలా తక్కువగా తిన్నా, చాలా సేపు నిద్రపోయినా లేదా తగినంత నిద్ర పోకపోయిన ( BG 6.16)"

ప్రభుపాద: అవును. ఇది చాలా బాగుంది. ఏదీ నిషేధించబడలేదు ఎందుకంటే ఏమైనప్పటికీ యోగా పద్ధతిని మీరు ఈ శరీరముతో అమలు చేయాలి. చెడ్డబేరం యొక్క ఉత్తమ ప్రయోజనము కోసం. మీరు చూడoడి? ఈ భౌతిక శరీరం అన్ని దుఃఖాలకు మూలం. నిజానికి ఆత్మకు కలవరము లేదు. ఉదాహరణకు జీవి యొక్క సాధారణ స్థితి ఆరోగ్యముగా జీవిoచుట. వ్యాధి కొoత కాలుష్యం, సంక్రమణం ద్వారా జరుగుతుంది. వ్యాధి మన జీవితము కాదు. అదే విధముగా భౌతిక జీవితము యొక్క ప్రస్తుత స్థితి ఆత్మ యొక్క ఒక వ్యాధి పరిస్థితి. ఆ వ్యాధి ఏమిటి? వ్యాధి ఈ శరీరం. ఎందుకంటే ఈ శరీరం నా కోసము కాదు, ఇది నా శరీరం కాదు. మీ దుస్తుల లాగే. మీరు దుస్తులు కాదు. కాని మనము ఇక్కడ భిన్నంగా దుస్తులు ధరించి ఉన్నాము . కొందరు ఎరుపు రంగు, కొంత మంది తెలుపు రంగు, కొంత మంది పసుపు రంగు. కాని ఆ రంగు, నేను ఈ రంగు కాదు. అదేవిధముగా ఈ శరీరం, నేను తెల్ల మనిషి, నల్ల మనిషి, భారతీయుడిని, అమెరికన్ లేదా ఈ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఇది నా పరిస్థితి కాదు. ఇది అoతా వ్యాధి స్థితి. వ్యాధి పరిస్థితి. మీరు వ్యాధి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు.

అది యోగ పద్ధతి. మళ్ళీ దేవాదిదేవునితో కలపడానికి. ఎందుకంటే నేను ఆయనలో భాగము. అదే ఉదాహరణ. ఎట్లగైతేనే వేలు కత్తిరించబడి అది నేలపై పడుతుంది, దానికి విలువ లేదు. నా వేలు, అది కత్తిరించబడినప్పుడు, అది నేల మీద పడి ఉన్నప్పుడు, దానికి విలువ లేదు. కాని వేలును ఈ శరీరానికి కలిపిన వెంటనే, అది మిలియన్ల ట్రిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉంది. వెలకట్టలేనిది. అదేవిధముగా మనం ఇప్పుడు దేవుడుతో లేదా కృష్ణుడితో ఈ భౌతిక పరిస్థితుల వలన సంబంధము లేకుండా ఉన్నాము. విస్మరించండి, సంబంధము లేకుండా ఉండవద్దు. సంబoధము ఉంది. దేవుడు మన అవసరాలు అన్నిటిని సరఫరా చేస్తున్నాడు, ఒక రాష్ట్ర ఖైదీ ,పౌర శాఖ నుండి సంబంధము లేకుండా ఉన్నట్లు ఆయన నేర విభాగానికి వచ్చారు. వాస్తవమునకు సంబంధము కోల్పోలేదు. ప్రభుత్వం ఇప్పటికీ జాగ్రత్త తీసుకుంటోంది. కాని చట్టబద్ధంగా సంబంధము లేకుండా ఉన్నారు. అదేవిధముగా మనము సంబంధము లేకుండా లేము. మనము సంబంధము లేకుండా ఉండలేము ఎందుకంటే కృష్ణుడు లేకుండా దేనికి ఉనికి లేదు. కాబట్టి నేను ఎలా సంబంధము లేకుండా ఉంటాను? సంబంధము లేకుండా అంటే, కృష్ణుడిని మర్చిపోవటం ద్వారా, కృష్ణ చైతన్యం లో నిమగ్నమవ్వటానికి బదులుగా, నేను చాలా అర్థం లేని చైతన్యములో నిమగ్నమై ఉన్నాను. ఇది సంబంధము లేకుండా అంటే. దేవుడిని లేదా కృష్ణుడికి శాశ్వత సేవకుడు అని నేను ఆలోచిoచే దానికి బదులుగా, నేను నా సమాజమునకు సేవకుడిని, నా దేశం యొక్క సేవకుడిని, నేను నా భర్తకు సేవకురాలిని. అని నేను అలోచిస్తున్నాను నేను నా భార్యకు సేవకుడిని, నేను నా కుక్కకు సేవకుడిని మరియు ఇంకా ఎన్నో.ఇది మతి మరుపు.

ఇది ఎలా జరిగింది? ఈ శరీరము కారణంగా. మొత్తం విషయము. ఈ శరీరము కారణముగా మొత్తము తప్పుడు చైతన్యము వచ్చింది. నేను అమెరికాలో జన్మించాను కనుక నేను అమెరికన్ అని ఆలోచిస్తున్నాను. నేను అమెరికన్ అని ఆలోచిస్తున్నాను కనుక, అమెరికన్ ప్రభుత్వం అడుగుతుంది, అవును, మీరు వచ్చి యుద్ధము చేయండి. మీ జీవితం ఇవ్వండి. డ్రాఫ్ట్ బోర్డు. ఎందుకు? ఈ శరీరం వలన. కాబట్టి తెలివైన వ్యక్తి తెలుసుకోవాలి ఈ శరీరం కారణంగా నేను నా జీవితంలో అన్ని దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ భౌతిక శరీరం యొక్క ఈ ఖైదును జన్మ జన్మలకు కొనసాగేటట్లు మనము వ్యవహరించకూడదు అమెరికన్ శరీరం, ఇండియన్ శరీరం, కుక్క యొక్క శరీరం, పంది యొక్క శరీరం, చాలా ఎక్కువ ఉన్నాయి 84,00,000 శరీరములు. దానిని యోగ అంటారు. ఈ శరీరం యొక్క ఈ కాలుష్యం నుండి ఎలా బయట పడాలి. కాని నేను ఈ శరీరాన్ని కాదు అని అర్థం చేసుకోవడం మొదటి సూచన. ఇది భగవద్గీత ఉపదేశము యొక్క ప్రాథమిక సూత్రం. Aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase ( BG 2.11) నా ప్రియమైన అర్జునా, నీవు బాగా మాట్లాడుతున్నావు, చాలా ఉన్నతమైన జ్ఞానము కలిగిన వ్యక్తి వలె కానీ నీవు శారీరిక భావన పై మాట్లాడుతున్నావు, అన్ని అర్థం లేనివి. " నేను వీని యొక్క తండ్రిని, వారు నా బంధువులు, వారు నా ఇది, వారు నా ఇది, ఎలా నేను చంపవచ్చు, నేను ఎలా చేయవచ్చు, నా వల్ల కాదు ... మొత్తం వాతావరణం, శరీరచైతన్యము. అందుచేత కృష్ణుడు, అర్జునుడు ఆయనను గురువుగా అంగీకరించిన తర్వాత, ఆయన ఆధ్యాత్మిక గురువుగా, ఆయన వెంటనే తన శిష్యుడిని కోప్పడుతున్నాడు, ఒక గురువు శిష్యుడిని కోప్పడుతున్నట్లు: నీవు అర్థం లేని వాడివి. నీవు ఎన్నో విషయాలు తెలిసిన వాడి వలె, నీవు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. కాని నీ స్థానము ఈ శరీరము.

కాబట్టి ప్రపంచమంతా, వారు విద్యలో అత్యంత పురోభివృద్ధి చెందినట్లు కనబడుతున్నారు - శాస్త్రం, తత్వము, ఇది, అది, రాజకీయాలు, చాలా విషయాలు. కాని, వారి స్థితి ఈ శరీరము. కేవలం ఒక ఉదాహరణ, ఒక రాబందు. ఒక రాబందు చాలా ఎత్తుకి ఎగురుతుంది. ఏడు మైళ్ళు, ఎనిమిది మైళ్ళు పైకి. అద్భుతము, మీరు అలా చేయలేరు. అది అద్భుతమైన కళ్ళను కూడా కలిగి ఉంది. చిన్న కళ్ళు ఉన్నాయి, రాబందుకు, అది చాలా శక్తివంతమైనది అది చూడగలదు ఏడు మైళ్ళ దూరం నుండి మృతదేహము ఉన్న ప్రదేశమును. అందువలన అది మంచి అర్హతను కలిగి ఉంది. అది చాలా ఎత్తుకు ఎగరగలదు, అది ఒక సుదూర ప్రదేశం నుండి చూడగలదు. కాని అది దేని కోసము చూస్తుంది? ఒక మృతదేహం కోసము, అంతే. ఆయన పరిపూర్ణత ఒక మృతదేహాన్ని, చనిపోయిన శరీరమును కనుగొని, తినడము, అంతే. అదేవిధముగా, మనము చాలా ఉన్నత విద్యను పొందవచ్చు, కాని మన లక్ష్యం ఏమిటి, మనము ఏమి చూస్తున్నాము? ఇంద్రియాలను ఆస్వాదించడము ఎలా, ఈ శరీరమును, అంతే. మరియు ప్రకటనలు చేయడము? "ఆయన ఏడు వందల మైళ్ల వరకు స్పుట్నిక్తో వెళ్లాడు." అని కాని మీరు ఏమి చేస్తారు? మీ వృత్తి ఏమిటి? ఇంద్రియ తృప్తి, అంతే. అది జంతువు. కాబట్టి ప్రజలు వారు ఆలోచించడము లేదు ఈ శరీర భావనలో ఎలా చిక్కుకున్నారని

అందువలన మనము మొదట మన బాధాకరమైన పరిస్థితిని తెలుసుకోవాలి భౌతికము జీవితము ఈ శరీరము కారణముగా ఉంది. అదే సమయంలో ఈ శరీరము శాశ్వతము కాదు. నేను ఈ శరీరముతో ప్రతిదీ గుర్తిస్తున్నాను అని అనుకుందాము. కుటుంబము, సమాజము, దేశము, దీనితో, దానితో, ఎన్నో విషయాలు . కాని ఎంతకాలం? ఇది శాశ్వతము కాదు. Asann. Asann అంటే అది ఉనికిలో ఉండదు. Asann api kleśada āsa dehaḥ ( SB 5.5.4) కేవలం సమస్యాత్మకమైనది. శాశ్వతము కాదు మరియు కేవలం ఇబ్బంది ఇబ్బందులు ఇస్తుంది. ఇది బుద్ధి. ఎలా ఈ శరీరము నుంచి బయట పడాలి. ప్రజలు వస్తారు, "నేను శాంతిగా లేను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా మనస్సు శాంతిగా లేదు." అని చెప్పుతారు కాని ఔషధం అందించినప్పుడు, అతడు అంగీకరించడు. మీరు చూడoడి? ఆయనకు ఆయన అర్థం చేసుకున్న ఏదో రుచికరమైనది కావాలి. అంతే. చాలామంది మన దగ్గరకు వస్తారు, "స్వామిజీ,ఓహ్ , ఇది నా పరిస్థితి." మనము ఔషధం ఇచ్చిన వెంటనే, ఆయన అంగీకరించడు. ఆయనకు ఆమోదయోగ్యంగా ఉన్న ఔషధాము కావాలని కోరుకుంటాడు కాబట్టి మనము ఎలా అందించగలము? అప్పుడు మీరు వైద్యుని దగ్గరకు ఎందుకు వెళ్తారు? మీరు మీ స్వంత చికిత్స చేసుకోవచ్చు కదా? మీరు చూడండి