TE/Prabhupada 0669 - మనసును కేంద్రీకరిండము ద్వారా అంటే కృష్ణుని పై మీ మనస్సును ఉంచడం

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969


భక్తుడు: శ్లోకం పదిహేడు: " ఎవరు తన అలవాట్లయినా తినటం, నిద్రించటం, పని మరియు వినోదం లో నియంత్రణ కలిగి ఉంటారో యోగ పద్ధతిని అభ్యసించుట ద్వారా అని భౌతిక బాధలను తగ్గించగలరు ( BG 6.17) "

ప్రభుపాద: అవును, మీరు కేవలం... యోగ తరగతి అని పిలువబడే వాటికి వెళ్లాల్సిన ప్రశ్న లేదు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో, మీ కొవ్వును తగ్గించి ఉంచడానికి ఐదు రూపాయలు లేదా ఐదు డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం సాధన చేయండి. ఈ అభ్యాసం: మీకు ఎంత అవసరమో అది తినండి, మీకు ఎంత అవసరమో అంత నిద్రించండి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఏ అదనపు సహాయం అవసరం లేదు. కేవలం దీన్ని సాధన చేయడం ద్వారా మీరు అన్నింటినీ సరిగ్గా కలిగి ఉంటారు. కొనసాగించు.

భక్తుడు: శ్లోకము సంఖ్య పద్దెనిమిది: " యోగి , యోగ సాధన ద్వారా, తన మానసిక కార్యక్రమాలను క్రమశిక్షణలో ఉంచుతూ దివ్యత్వంలో స్థిరంగా ఉంటాడు, అన్ని భౌతిక కోరికలకు దూరంగా, అతడు యోగ సాధించినట్లు చెబుతారు.( BG 6.18) "

ప్రభుపాద: అవును. మనస్సును సమతుల్యంలో ఉంచడానికి. అది యోగ పరిపూర్ణము. మనస్సును ఉంచడానికి.... మీరు ఎలా చేయగలరు? ఒకవేళ నువ్వు... భౌతిక క్షేత్రంలో మీరు మీ మనసును సమతుల్యతతో ఉంచలేరు. అది సాధ్యం కాదు. ఉదాహరణకు ఈ భగవద్గీతను తీసుకోండి. మీరు రోజూ నాలుగు సార్లు చదివినట్లయితే మీరు అలసిపోరు. కానీ ఇతర పుస్తకాన్ని తీసుకొని ఒక గంట చదివిన తర్వాత అలసిపోతారు. ఈ కీర్తన , హరే కృష్ణ. మీరు మొత్తం పగలు మరియు రాత్రి కీర్తన చేసినప్పటికీ, మరియు నృత్యము, మీరు ఎప్పటికీ అలసిపోరు. కానీ మరి ఏదైనా పేరును తీసుకోండి. కేవలం అరగంట తర్వాత అలసిపోతారు ఇది ఇబ్బంది. మీరు చూడండి? అందువల్ల మనసును కేంద్రీకరిండము ద్వారా అంటే కృష్ణుని పై మీ మనస్సును ఉంచడం, అప్పుడు అంతా పూర్తి అవుతుంది అయ్యాయి.అన్ని యోగాలు మీరు పరిపూర్ణ యోగి. మీరు ఏమీ చెయ్యక్కరలేదు. కేవలం మీ మనస్సును కేంద్రికరీంచండి స వై మనః కృష్ణ-పదారవిందయోర్ వచాంసి వైకుంఠ ( SB 9.4.18) మీరు మాట్లాడితే, మీరు కృష్ణుడి గురించి మాట్లాడండి.మీరు ఆహారం తీసుకుంటే, కృష్ణుడి ప్రసాదం తీసుకోండి. మీరు ఆలోచిస్తే, కృష్ణుడి గురించి ఆలోచించండి. మీరు పని చేసినట్లయితే, కృష్ణుడి కొరకు పని చేయండి. ఈ విధంగా, ఈ యోగ సాధన పరిపూర్ణంగా ఉంటుంది. లేకపోతే కాదు. అది యోగ యొక్క పరిపూర్ణము. అన్ని భౌతిక కోరికలు లేకుండా. మీరు కేవలం కృష్ణుడిని కోరుకుంటే, భౌతిక కోరికకు అవకాశం ఎక్కడ వుంది? పూర్తయింది, అన్ని భౌతిక కోరికలు పూర్తయ్యాయి. మీరు దానికోసం కృత్రిమంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఓ‌, నేను ఏ చక్కని అమ్మాయిని చూడను. నేను నా కళ్ళను మూసుకుంటాను. అది మీరు చేయలేరు. కానీ మీరు మీ మనస్సును కృష్ణ చైతన్యములో స్థిరపరచుకుంటే మీరు చాలా మంది అందమైన బాలికలతో నృత్యం చేస్తున్నారు. అది సరే, సోదరి సోదరుని వలె అప్పుడు ఎటువంటి ప్రశ్న లేదు. ఇది ఆచరణాత్మకం- యోగ యొక్క పరిపూర్ణత. కృత్రిమంగా మీరు చేయలేరు. కేవలం కృష్ణ చైతన్యములో అంతా పరిపూర్ణత ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతా పరిపూర్ణము. ఎందుకంటే అది ఆధ్యాత్మిక స్థితి. ఆధ్యాత్మిక స్థితి అనేది శాశ్వతమైనది, ఆనందకరమైనది జ్ఞానంతో నిండి ఉంది. అందువల్ల ఏ అనుమానాలు లేవు. అవును, కొనసాగించండి.