TE/Prabhupada 0672 - అదేవిధముగా, మీరు కృష్ణ చైతన్యములో ఉన్నప్పుడు, మీ పరిపూర్ణత హామీ ఇవ్వబడుతుంది

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969


భక్తుడు: "ఇది భౌతిక సంపర్కము నుండి ఉత్పన్నమయ్యే అన్ని కష్టాల నుండి ఇది వాస్తవ స్వాతంత్రం. ఈ యోగమును పట్టుదలతో ధైర్యము కలిగిన హృదయంతో సాధన చేయాలి.

ఇరవై నాలుగు: చెదరని పట్టుదలతో విశ్వాసముతో ఒకరు యోగ సాధనలో నిమగ్నము అవ్వాలి. ఏ మినహాయింపు లేకుండా, అహంభావముతో ఉత్పన్నమైన అన్ని భౌతిక కోరికలను త్యజించాలి, తద్వారా మనస్సు ద్వారా అన్ని అన్ని ఇంద్రియాలను అన్ని వైపులా నియంత్రించాలి ( BG 6.24) భాష్యము: యోగా అభ్యాసకుడు పట్టుదలతో ఉండాలి , సహనముతో సాధన చేయాలి నియమములు తప్పకుండా. "

ప్రభుపాద: ఇప్పుడు, ఈ పట్టుదలను వాస్తవానికి సాధన చేయవచ్చు, లేదా వాస్తవానికి సాధించవచ్చు, లైంగిక జీవితంలో నిమగ్నము అవ్వని వ్యక్తిచే. ఆయన పట్టుదల బలంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో చెప్పబడింది, "లైంగిక జీవితం లేకుండా," పట్టుదల లేదా నియంత్రిత మైథునజీవితం. మీరు లైంగిక జీవితంలో నిమగ్నము అయితే ఈ పట్టుదల రాదు. స్థిరమైన పట్టుదల, మీరు చూడండి? అందువల్ల లైంగిక జీవితం నియంత్రించబడాలి లేదా వదలి వేయాలి. అది సాధ్యం అయితే, మొత్తంగా - వదలి వేయాలి, లేకపోతే నియంత్రించాలి అప్పుడు మీరు పట్టుదలను పొందుతారు. ఏమైనప్పటికీ ఈ నిర్ణయం శరీర వ్యవహారం. కావున పట్టుదలను ఎలా పొందాలో అనే దానికి ఇవి పద్ధతులు. కొనసాగించు.

భక్తుడు: "చివరికి విజయము పొందగలము అని నమ్మకము కలిగి ఉండాలి గొప్ప సహనముతో ఆయన తన దారిలో కొనసాగాలి, విజయము సాధించడంలో ఏమైనా ఆలస్యం ఉన్నట్లయితే నిరుత్సాహపడ కూడదు. "

ప్రభుపాద: పట్టుదల అంటే, ఓర్పుతో నిరంతరము స్థిరముగా కొనసాగాలి. నేను ఆశించిన ఫలితం పొందక పోతే . "ఈ కృష్ణ చైతన్యము ఏమిటి, నేను వదిలివేస్తాను." కాదు పట్టుదల. ఇది వాస్తవము. ఎందుకనగా కృష్ణుడు ఈ విధముగా చెప్తున్నాడు, ఇది జరుగుతుంది . మంచి ఉదాహరణ ఉంది. ఒక అమ్మాయి భర్తను వివాహం చేసుకున్నది. ఆమె ఒక బిడ్డ కొరకు ఆశ పడుతుంది కాబట్టి ఆమె "ఇప్పుడు నేను పెళ్లి చేస్తున్నాను, నాకు వెంటనే బిడ్డ కావాలి" అని అనుకుంటుంది. ఇది సాధ్యమేనా? కేవలం సహనం కలిగి ఉండాలి. మీరు నమ్మకమైన భార్యగా ఉండండి, నీ భర్తకు సేవ చేయండి, మీ ప్రేమను పెరగనివ్వండి, మీరు భర్త మరియు భార్య కనుక, మీరు పిల్లలను తప్పకుండా పొందుతారు. కానీ అసహనంగా ఉండకండి. అదేవిధముగా, మీరు కృష్ణ చైతన్యములో ఉన్నప్పుడు, మీ పరిపూర్ణత హామీ ఇవ్వబడుతుంది. కానీ మీరు సహనం, పట్టుదల కలిగి ఉండాలి. "నేను అమలు చేయాలి నేను అసహనం కలిగి ఉండకూడదు ." ఆ అసహనము పట్టుదలను కోల్పోవటం వలన. ఎలా పట్టుదలను కోల్పోవడం జరిగినది? అధిక మైథునజీవితం కారణంగా. ఇవి అన్ని పరిణామాలు. కొనసాగించు.

భక్తుడు: "తీవ్రముగా అభ్యాసము చేసే వానికి విజయము పరిపూర్ణముగా ఉంటుంది. భక్తి-యోగం గురించి, రూప గోస్వామి చెప్తారు భక్తి-యోగా పద్ధతిని పూర్తిగా హృదయపూర్వక ఉత్సాహముతో, స్థిరముగా మరియు పట్టుదలతో విజయవంతంగా అమలు చేయవచ్చు, భక్తుల సాంగత్యములో ఇవ్వబడిన విధులు అనుసరించడం ద్వారా సత్వ గుణము యొక్క కార్యక్రమాలలో పూర్తిగా పాల్గొనడం ద్వారా.

ప్రభుపాద: అవును, కొనసాగండి