TE/Prabhupada 0687 - మనస్సును ఏదో శూన్యముపై కేంద్రీకరించుట. ఇది చాలా కష్టమైన పని

Revision as of 23:46, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969


భక్తులు: కీర్తి అంతా శ్రీల ప్రభుపాదల వారికి.

భక్తుడు: ముప్పై ఐదవ శ్లోకము: "భగవంతుడు చెప్పారు: ఓ శక్తివంతమైన చేతులు కలిగిన కుంతీ కుమారుడా, నిస్సందేహముగా చంచలమైన మనస్సును నియంత్రించడము చాలా కష్టము, కానీ నిరంతర అభ్యాసం మరియు వైరాగ్యము ద్వారా సాధ్యమవుతుంది ( BG 6.35) "

ప్రభుపాద: అవును. ఇప్పుడు, కృష్ణుడు చెప్తున్నాడు "అవును." కృష్ణుడు అది కష్టం కాదని చెప్పలేదు. కృష్ణుడు ఇలా అంటాడు, "అవును, అది కష్టం." కానీ నిరంతర అభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. ఈ స్థిరమైన అభ్యాసం కృష్ణుడిని గుర్తుచేసే దానిలో ఏదో ఒకదానిలో నిమగ్నం అవ్వటము ఏదో ఒకటి చేయండి, ... కాబట్టి మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కీర్తన మాత్రమే కాకుండా, ఆలయ కార్యక్రమాలు, ప్రసాదం కార్యక్రమాలు, ప్రచురణ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి, కృష్ణుడు కేంద్ర బిందువు. అందువలన కృష్ణుడి కోసము టైప్ చేసే వ్యక్తి, ఆయన యోగ పద్ధతిలో ఉన్నాడు. కృష్ణుడి కోసం వంట చేస్తున్న వ్యక్తి, ఆయన యోగ పద్ధతిలో ఉన్నాడు. వీధిలో కీర్తన చేస్తూ, మన సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్న వ్యక్తి, ఆయన కూడా కృష్ణుడితో ఉన్నాడు. కాబట్టి సాధారణ అలవాట్ల ద్వారా మనము నిమగ్నమైనాము, మన భౌతిక జీవితంలో మనము ఎన్నో విషయాలపై నిమగ్నమై ఉన్నాము. కృష్ణుడితో మన జీవితాన్ని మనం మలచుకుంటే, అప్పుడు ప్రతి కార్యక్రమములో కృష్ణ చైతన్యము ఉంటుంది అందువలన ఈ యోగ పరిపూర్ణము సహజముగా ఉంది. అవును, కొనసాగండి.

భక్తుడు: శ్లోకము ముప్పై ఆరు: "ఎవరి మనస్సు నియంత్రించబడలేదో, ఆత్మ-సాక్షాత్కారము అనేది కష్టమైన పని. కానీ ఎవరి మనసు నియంత్రించబడినదో, ఎవరు సరైన మార్గాల ద్వారా పోరాడుతాడో, విజయానికి హామీ ఇవ్వబడినది. ఇది నా నిర్ణయం ( BG 6.36) . " భాష్యము: "భగవంతుడు ప్రకటించాడు మనస్సును భౌతిక నిమగ్నత నుండి వేరు చేయడానికి సరైన చికిత్సను అంగీకరించని వ్యక్తి ఆత్మ-సాక్షాత్కారములో విజయవంతం కాలేడు. భౌతిక అనందములో మనస్సును నిమగ్నము చేస్తూ యోగ సాధన చేసేందుకు ప్రయత్నిస్తున్నవారు అది అగ్నిని మండించటానికి ప్రయత్నిస్తూ నీటిని పోయటము వలె ఉంటుంది. అదేవిధముగా మానసిక నియంత్రణ లేని యోగాభ్యాసం వలన సమయం వృధా అవుతుంది. "

ప్రభుపాద: నేను ధ్యానం కొరకు కూర్చుని ఉన్నాను కనుక. అయితే, ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సులో విష్ణువు పై దృష్టి పెడితే, అది చాలా మంచిది. కానీ చాలా యోగ సంఘాలు ఉన్నాయి, వారు ఏదో శూన్యము పై , వారు ఏదో రంగుపై వారి మనస్సును, దృష్టి కేంద్రీకరించమని వారి విద్యార్ధులకు భోదిస్తారు. సరిగ్గా విష్ణువు రూపం మీద కాదు. మీరు చూడండి. కాబట్టి ఇది చాలా కష్టమైన పని. ఇది కూడా భగవద్గీతలో వివరించబడింది... Kleśo 'dhikataras teṣām avyaktāsakta-cetasām ( BG 12.5) నిరాకారము, లేదా శూన్యము మీద తన మనస్సును, దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి, ఇది చాలా కష్టము మరియు సమస్యాత్మకమైనది. కనీసం ఈ గుడిలో - ఈ విద్యార్ధులు కృష్ణుడిపై తన మనస్సును, దృష్టిని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క మనస్సును శూన్యము మీద కేంద్రీకరించడము, అది చాలా కష్టము. సహజంగా నా మనస్సు స్థిరముగా ఉండదు. ఏదో శూన్యమును కనుగొనే బదులు, నా మనసు వేరొక దానిపై నిమగ్నము చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనస్సు నిమగ్నమై ఉండాలి. కృష్నుడిపై నిమగ్నమై ఉండకపోతే, అది మాయలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి మీరు అలా చేయలేకపోతే, ఈ ధ్యానం చేయడము, కూర్చునే భంగిమ అని పిలువబడేవి కేవలం సమయాన్ని వ్యర్థం చేయడము. కొనసాగించు.

భక్తుడు: "అలాంటి ఒక యోగాభ్యాసం భౌతికముగా కార్యసాధకునికి లాభదాయకంగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాక్షాత్కారమునకు సంబంధించినంత వరకు పనికిరానిది."

ప్రభుపాద: అవును. భౌతికముగా లాభదాయకమైనది. అలాంటి యోగా తరగతిని తెరిస్తే నేను ఐదు డాలర్లు వసూలు చేస్తాను కూర్చోవడానికి. డబ్బు మీ దేశంలో చాలా కష్టము కాదు, మీరు వస్తారు. కానీ కేవలం నేను కొన్ని కూర్చుండే భంగిమలు లేదా ముక్కు నొక్కుకోవడం మరియు ఇది మరియు అది ఇస్తాను, కానీ మీరు వాస్తవమైనది సాధించలేకపోతే, నేను చెప్పేది, యోగాభ్యాసం ఫలితము, మీరు మీ సమయం డబ్బు వృధా చేసుకున్నారు మరియు నేను మిమ్మల్ని మోసం చేశాను. అంతే. అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. విష్ణువు రూపం మీద తన మనసును నిత్యం స్థిరంగా, నియంత్రించి ఉంచవలెను, దానిని సమాధి అని పిలుస్తారు. కాబట్టి అదే విషయము వేరే పద్ధతిలో జరుగుతుంది, ఈ యుగమునకు తగినది. ఇది కృష్ణ చైతన్యము. కొనసాగించు.

భక్తుడు: "అందువల్ల మనస్సును నియంత్రించాలి, నిరంతరం నిమగ్నము చేయడము ద్వారా."

ప్రభుపాద: అవును. భక్తుడు: కృష్ణ చైతన్యముతో నిమగ్నమైతే తప్ప, ఆయన మనసును క్రమంగా నియంత్రించలేడు. ఒక కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి సులభంగా యోగాభ్యాస ఫలితాన్ని సాధిస్తాడు, ప్రత్యేక ప్రయత్నం లేకుండా, కానీ యోగాభ్యాసకుడు కృష్ణ చైతన్యము లేకుండానే సంపూర్ణ విజయము సాధించలేడు. "

ప్రభుపాద: తరువాత? కొనసాగించు