TE/Prabhupada 0716 - మనము తప్పని సరిగా జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి కృష్ణుడు అంటే ఏమిటి

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on CC Madhya-lila 8.128 -- Bhuvanesvara, January 24, 1977


ప్రధాన విషయము ఏమిటంటే ఒకరు తప్పక కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. ఇతర రోజు కొంత మంది అడిగారు, "కృష్ణ అంటే అర్థం ఏమిటి?" కృష్ణుడు అంటే సర్వాకర్షణీయుడు. భగవంతుడు అందరికీ ఆకర్షణీయంగా ఉండకపోతే, ఆయన ఎలా భగవంతుడు అవుతాడు? కాబట్టి వృందావన జీవితం అంటే కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి అని చూపించడానికి తనంతట తాను అవతరిస్తాడు. కాబట్టి చిత్రం, వృందావన జీవితం, అది గ్రామ జీవితం. అక్కడ గ్రామస్తులు, పంటలను సాగు చేసేవారు, ఆవులు, దూడలు ఉన్నాయి-అది వృందావనము. న్యూయార్క్, లండన్ వలె ఇది పెద్ద నగరం కాదు; ఇది గ్రామము, కేంద్ర బిందువు కృష్ణుడు. ఇది వృందావన జీవితం. అక్కడ గోపికలుంటారు, వారు గ్రామ బాలికలు, మరియు గోప బాలురుంటారు, వారు కూడా గ్రామ బాలురు. నంద మహారాజా, గ్రామపెద్ద, వ్యవసాయదారుడు. అదేవిధముగా, వృద్ధులు, వృద్ధ గోపికలు, తల్లి యశోద మరియు ఆమె ఇతర స్నేహితులు-అందరూ కృష్ణుడిచే ఆకర్షింపబడతారు. ఇది వృందావన జీవితం. వారు కృష్ణుడు అంటే ఏమిటి అని కూడా ఎరుగరు. వారికి తెలియదు, వారు వేదాలు, పురాణములను, వేదాంతలను చదవడం ద్వారా కృష్ణుడిని అర్థం చేసుకోవచ్చు అని. కానీ కృష్ణుడి పట్ల వారికి సహజ ప్రేమ ఉన్నది.

కావున ఈ స్వాభావిక ఆకర్షణ ఉంటుంది... ప్రస్తుత క్షణంలో మనకు కృష్ణుడి కొరకు సహజ ఆకర్షణ లేదు; అందుచేత మనము తప్పనిసరిగా జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి కృష్ణుడు అంటే ఏమిటి. అది కృష్ణ తత్వవేత్త. కృష్ణుడు ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి ఉండకపోతే, ఎందుకు కృష్ణుడిచే ఆకర్షించబడాలి? ఆకర్షణ... సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో, మనము ధనవంతునికి లేదా శక్తివంతమైన వ్యక్తికి ఆకర్షించబడతాము. పురుషుడు లేదా స్త్రీ. మన ప్రధాన మంత్రి వలె, ఆమె స్త్రీ, కానీ ఆమె శక్తివంతమైనది కనుక, మనము ఆకర్షించబడ్డాము; మనము ఆమె గురించి మాట్లాడుతున్నాము. అందువల్ల పరాశరమునిచే ఆకర్షణియమైన అంశాలు చర్చించబడ్డాయి. భగ. భగ అంటే సంపద. కావున ఈ సంపదలు... ఒకరు చాలా ధనవంతుడైనప్పుడు, ఆయన సంపన్నమైనప్పుడు . ఒకరు చాలా శక్తివంతముగా ఉంటాడు, ఆయన ఆకర్షణీయంగా ఉంటాడు. ఒకరు చాలా ప్రభావవంతమైనప్పుడు, ఒకరు చాలా అందంగా ఉన్నప్పుడు , చాలా గొప్ప జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ... ఈ విధముగా, ఆకర్షణ ఉంటుంది. కాబట్టి పరిశీలనతో కృష్ణుడి జీవితాన్ని మనము అధ్యయనము చేస్తే, మీరు కనుగొంటారు ప్రపంచ చరిత్రలో, కృష్ణుడి కంటే ధనవంతుడు లేడు, కృష్ణుడి కన్నా శక్తివంతమైన వ్యక్తి లేడు, కృష్ణుడి కంటే అందమైన వ్యక్తి లేడు, మరింత జ్ఞానము, తత్వము కలిగిన వ్యక్తి, కృష్ణుడు కంటే ఎవరూ లేరు. మీరు చేసినట్లయితే మీరు ప్రతిదీ కనుగొంటారు. ఆరు ఐశ్వర్యాలు పూర్తిగా కృష్ణుడిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి; అందువలన ఆయన భగవాన్. భగ అనగా సంపద వాన్ అంటే అర్థం కలిగిన వ్యక్తి. ఇది కృష్ణుడి యొక్క అర్థం, ఆయన అన్ని ఆకర్షణలను కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన అన్ని ఆరు సంపదలను ఐశ్వర్యాలను కలిగి ఉంటాడు. ఇది కృష్ణుడి వర్ణన. కాబట్టి మనము ఎవరినైనా మరియు అందరినీ భగవాన్ గా అంగీకరించకూడదు. ఆయన ఆరు ఐశ్వర్యాలను సంపదలను కలిగి ఉన్నాడో లేదో పరీక్షించాలి