TE/Prabhupada 0745 - మనము నమ్మాలి. మీరు విశ్వసించండి లేదా నమ్మకపొండి, కృష్ణుడి మాటలు తప్పుకావు

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.54 -- Vrndavana, April 9, 1976


ఇప్పుడు, మీరు ప్రస్తుతం ప్రపంచం మొత్తంను అధ్యయనం చేస్తే, వారు ఆత్మను నమ్మరు. ఆత్మ మరొక శరీరానికి బదిలీ అవుతుంది అనే దానిని వారు నమ్మరు. గొప్ప, గొప్ప ఆచార్యులు, గొప్ప, గొప్ప జ్ఞానవంతులైన పండితులు, వారు నమ్మరు. అందువల్ల ప్రపంచంలోని ప్రస్తుత ప్రజలందరూ-ఎటువంటి వారో మీరు అర్థం చేసుకోవచ్చు. అందరూ మూర్ఖులు అందరూ మూర్ఖులు. వారు సాధారణ సత్యాన్ని అర్థం చేసుకోలేరు, వారు గొప్ప విద్వాంసులు, గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప రాజకీయ నాయకులు మరియు మొదలైన వారిగా చెప్పుకుంటున్నారు, కానీ వారు అందరూ మూర్ఖులు. అంతే. ఇది సారంశము. కృష్ణుడు చెప్తాడు, dhīras tatra na muhya... ఆత్మను ఈ శరీరము నుండి ఒక దాని నుండి మరొకదానికి వెళ్ళడము, కృష్ణుడు చెప్తాడు, dhīras tatra na muhyati... ఇక్కడ కూడా ఇదే విషయము, prīṇanti hy atha māṁ dhīrāḥ sarva-bhāvena sādhavaḥ. ఆధ్యాత్మిక... మీరు ఆత్మ అంటే ఏమిటో గ్రహించలేకపోతే, ఆధ్యాత్మిక జీవితపు ప్రశ్న మరియు ఆధ్యాత్మిక జీవితపు పురోగతి ఎక్కడ ఉంది? ప్రశ్న లేదు. ఇది ఆధ్యాత్మిక జీవితము యొక్క ఆరంభం, విద్య, "నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను." అహం బ్రహ్మాస్మి. వారు అర్థం చేసుకోగలరు.

మనము నిజాయితీగా కృష్ణ చైతన్య వంతులైతే, మనము కృష్ణుడిని నమ్మితే... మనము నమ్మాలి. మీరు విశ్వసించండి లేదా నమ్మకపొండి, కృష్ణుడి మాటలు తప్పుకావు. అది సత్యము. మీరు మూర్ఖులు కావచ్చు, మీరు నమ్మరు, కానీ ధీరులు అయినవారు, వారు నమ్ముతారు. వాళ్ళు నమ్ముతారు. మీకు కృష్ణుడి మీద ప్రేమ ఉంటే... ప్రేమ లేదు లేదా ప్రేమ యొక్క ప్రశ్నే లేదు. ఇది సత్యము. కాబట్టి ఒకరు అవ్వాలి... జీవితంలో అంతిమ లక్ష్యం ఇది, ఒకరు ధీర అవ్వాలి పిల్లులు కుక్కల వలె కాదు, ఇక్కడ మరియు అక్కడ ఎగరడము. ఇది మానవ జీవితం కాదు. ఇది కుక్క జీవితం.

yasyātmā-buddhiḥ kuṇape tri-dhātuke
sva-dhīḥ kalatrādiṣu bhauma-ijya-dhīḥ
yat-tīrtha-buddhiḥ salile na karhicit
janeṣu abhijñeṣu sa eva go-kharaḥ
(SB 10.84.13)

ఈ తరగతి వ్యక్తులు, యస్యా, ఎవరి జీవితం శారీరక భావన, నేను శరీరం. "నేను ఒక హిందూవు," "నేను ముస్లిం," "నేను బ్రాహ్మణ్," నేను ఇండియన్, "నేను అమెరికన్," "నేను..." మొత్తం ప్రపంచం ఈ పోరాటంలో ఉంది, ఎందుకంటే వారు అందరు వెర్రివారు, ధీర కాదు. ఇది ఆధునిక నాగరికత. Yasyātma-buddhiḥ kuṇape. ఈ ఎముకలు మాంసం మరియు రక్తం యొక్క సంచి వారు, వారు ఈ శరీరమని వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఈ శరీరము అయితే ఈ జీవ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? జీవ శక్తి వెళ్ళిపోయిన వెంటనే, శరీరం నిష్ఫలమై పోతుంది, పదార్ధము యొక్క ముద్ద. కాబట్టి ఈ పదార్ధము యొక్క ముద్ద ఈ భౌతిక జీవితాన్ని ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? కానీ వారు ధీర కాదు. అందరు మూర్ఖులు; వారు అర్థం చేసుకోలేరు. పదం చాలా ముఖ్యం. Dhīras tatra na muhyati. మూర్ఖులు ఎలా అర్థం చేసుకోగలరు? అందువల్ల మన కృష్ణ చైతన్య ఉద్యమము మూర్ఖులకు భోదించడము, అంతే. సాధారణ విషయము. మనము అందరినీ సవాలు చేస్తాం " మీరు మూర్ఖులలో మొదటి వారు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. "ఇది మన సవాలు. ముందుకు రండి మనము చెప్తాము, మనము సవాలు చేస్తాం, "మీరు మూర్ఖులలో మొదటి వారు. మీరు కృష్ణ చైతన్యములో విద్యను తీసుకోండి, మీ జీవితాన్ని సంపూర్ణంగా చేసుకోండి." ఇది కృష్ణ చైతన్యము. ఎవరూ ధీర కాదు.