TE/Prabhupada 0753 - ఈ గొప్ప, గొప్ప వ్యక్తులు, వారికి ఒక కొన్ని పుస్తకములను ఇచ్చి చదవమనండి



Room Conversation -- May 4, 1976, Honolulu


కాబట్టి ఈ గొప్ప, గొప్ప వ్యక్తులు, వారికి ఒక కొన్ని పుస్తకములను ఇచ్చి చదవమనండి. ఇది వారికి ఏ వ్యయం కాదు, కానీ వారి విశ్రాంతి సమయమున వారు కొన్ని పంక్తులు చదువితే. వారు అందరూ తెలివైన వ్యక్తులు-- వారికి ఆలోచనలు వస్తాయి, ఈ కృష్ణ చైతన్యము ఏమిటి. కాబట్టి తండ్రి ప్రభావం ద్వారా, మన పుస్తకాలను ఈ గొప్ప వ్యక్తులకు పరిచయం చేయడానికి ప్రయత్నించండి. ఇది కాదు.... వారు వాటిని లైబ్రరీలో ఉంచవచ్చు, విరామ సమయంలో, వారు కేవలం ఆ పంక్తి పై చూపు ఉంచితే, ఓ, అది గొప్ప అవుతుంది...

ధృష్టద్యుమ్న: వారి పిల్లలు కూడా చదువుతారు.

ప్రభుపాద: వారి కుమారులు కూడా చదువుతారు.

ధృష్టద్యుమ్న: ఇప్పటికే నా తండ్రి తన ప్రయాణంలో గమనించారు తన స్నేహితులు కొందరు, వారి కుమారులు కూడా ఇప్పుడు మన ఉద్యమంలో చేరారు.

ప్రభుపాద: యద్ యద్ ఆచరతి శ్రేష్ఠః, లోకస్ తద్ అనువర్తతే ( BG 3.21) ప్రపంచంలోని ఈ గొప్ప వ్యక్తులు, వారు తీసుకుంటే, ఓ, అవును. కృష్ణచైతన్య ఉద్యమం వాస్తవమైనది, అప్పుడు సహజంగా దాన్ని ఇతరులు అనుసరిస్తారు. కాబట్టి ప్రపంచంలోని గొప్ప వ్యక్తిని సంప్రదించడానికి ఇక్కడ ఒక మంచి అవకాశం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకుందాం. మీరు... మీరు ఇద్దరూ తెలివైనవారు. చాలా జాగ్రత్తగా వారితో వ్యవహరించండి. వారు అర్థం చేసుకుంటారు, "ఓ, ఈ వ్యక్తులు చాలా నిజాయితీ కలిగిన వారు, మరియు చాలా జ్ఞానము ఇంకా భగవద్భక్తి కలిగినవారు". అది మన ఉద్యమాన్ని విజయవంతం చేస్తుంది.