TE/Prabhupada 0981 - పూర్వం ప్రతి బ్రాహ్మణుడు ఆయుర్వేదము మరియు జ్యోతిర్-వేదము నేర్చుకోనేవారు

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on SB 1.2.6 -- New Vrindaban, September 5, 1972


పూర్వం ప్రతి బ్రాహ్మణుడు ఈ రెండు శాస్త్రాలను నేర్చుకోనే వారు, ఆయుర్వేదము & జ్యోతిర్-వేదము బహిర్-అర్థ ( SB 7.5.31) బహిర్ అంటే బాహ్య అని అర్థం, అర్థ అంటే ఆసక్తి. కాబట్టి ఆనందం యొక్క అంతిమ లక్ష్యం విష్ణువు అని తెలియని వారు, వారు ఈ బాహ్య ప్రపంచంలో సర్దుబాటు చేసుకొనుట ద్వారా... ఎందుకంటే మనకు బాహ్యం మరియు అంతర్గతం ఉంది బాహ్యంగా మనం ఈ శరీరము. అంతర్గతంగా మనము ఆత్మ. ప్రతి ఒక్కరు నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని అర్థము చేసుకోగలరు. ఈ శరీరముచే నేను కప్పబడి ఉన్నాను నేను ఈ శరీరo నుండి వెళ్ళిపోయిన వెంటనే, శరీరానికి అర్థంలేదు. ఇది ఒక చాలా ముఖ్యమైన ఆత్మ శరీరం అయి ఉండవచ్చు, ఒక గొప్ప శాస్త్రవేత్త యొక్క శరీరం కావచ్చు, కానీ శరీరము శాస్త్రవేత్త కాదు, ఆత్మ శాస్త్రవేత్త. శరీరం ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు నేను ఏదో పట్టుకోవాలని అనుకుంటున్నాను, అప్పుడు నా చేయి ద్వారా జరుగుతుంది. అందువలన సంస్కృతములో, శరీరం యొక్క ఈ వివిధ భాగాలు, అవయవాలు, వాటిని karaṇa అని పిలుస్తారు. karaṇa అంటే అర్థం, karaṇa అనగా కర్మ, పని చేయడము, వాటి ద్వారా, మనము పని చేస్తాము, కరణ్. కాబట్టి, na te viduḥ svārtha-gatiṁ hi viṣṇum ( SB 7.5.31) ఈ శరీర భావన వలన మనం ఇప్పుడు భ్రాంతి చెందినాము. ఇది కూడా శ్రీమద్-భాగవతములో వివరించబడినది, yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke ( SB 10.84.13) ātma-buddhiḥ kuṇape, kuṇape అంటే సంచి. ఇది ఎముకలు, కండరములు, చర్మము, రక్తం యొక్క సంచి. వాస్తవానికి మనము ఈ శరీరాన్ని కోసినప్పుడు, మనకు ఏమి కనిపిస్తాయి? ఎముక, చర్మం, రక్తం, ప్రేగులు, రక్తం, చీము, అంత కంటే ఏమీ ఉండవు

కాబట్టి kuṇape tri-dhātuke... ఈ విషయాలు మూడు ధాతువులచే తయారు చేయబడినవి, మూలకాలు, కఫ, పిత్త , వాయు. కఫ మ్యూకస్, పిత్త భైల్ గాలి. ఈ విషయాలు తయారీ చేయబడుతున్నవి. ఈ విషయాలు జరుగుతున్నాయి. తిన్న తరువాత, ఈ మూడు విషయాలు తయారవుతున్నాయి, అవి సర్దుబాటులో ఉంటే, సమాంతరముగా ఉంటే, అప్పుడు శరీరం ఆరోగ్యకరముగా ఉంటుంది, అవి హెచ్చు తగ్గులతో చాలా తేడాతో ఉంటే, అప్పుడు వ్యాధి ఉంది. అందువల్ల, ఆయుర్వేదముల ప్రకారం - ఇది కూడా వేదము... ఆయ్యూర్ అంటే జీవిత కాలము, మరియు వేదముల అంటే జ్ఞానం. దీనిని ఆయుర్వేదము అని అంటారు. కాబట్టి ఈ వేదముల జ్ఞానం ప్రకారము జీవితకాలం చాలా సరళమైనది. వాటికి రోగలక్షణ ప్రయోగశాల, క్లినిక్, ఏ అవసరం లేదు. వారు కేవలం ఈ మూడు అంశాలను అధ్యయనం చేయడానికి, కఫ, పిత్త, వాయు అవసరము వారు, వారి శాస్త్రము, నాడి ని అనుభూతి చెందటము ద్వారా ఉంది. మీకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు, నాడి ఆడుతుంది, టిక్,టిక్,టిక్,టిక్ ఈ విధముగా. వారికి శాస్త్రము తెలుసు: నాడి ఆడటము అనుభూతి చెందడము వలన వారు అర్థం చేసుకోగలరు ఈ మూలకాల యొక్క స్థానమేమిటో, కఫ, పిత్త, వాయు. ఆ స్థానము ద్వారా, కూటమి, వారు... ఆయుర్వేదములో, శాస్త్ర వేదంలో, లక్షణాలు, ఉన్నాయి,... ఈ సిరలు ఈ విధముగా కదులుతున్నాయి, గుండె ఈ విధముగా పని చేస్తుంది, ఈ విధముగా ఆడుతుంది అప్పుడు పరిస్థితి ఇది. ఈ విషయము ఇది అని అర్థం చేసుకున్న వెంటనే, వారు లక్షణాలను సరి చూచుకుంటారు. వారు రోగి నుండి విచారణ చేస్తారు, "మీరు ఇలా భావిస్తున్నారా? మీరు ఇలా భావిస్తున్నారా?" ఆయన చెప్పినట్లయితే, "అవును," అది నిర్ధారించబడింది. లోపలి విషయాలు, నాడి ఎలా ఆడుతుంది, లక్షణాలు నిర్ధారించబడ్డాయి, అప్పుడు ఔషధం సిద్ధంగా ఉంటుంది. వెంటనే ఔషధం తీసుకోండి. చాలా సులభం.

మునుపు ప్రతి బ్రాహ్మణుడు ఈ రెండు శాస్త్రాలను నేర్చుకునే వాడు, ఆయుర్వేదము మరియు జ్యోతిర్-వేదము. జ్యోతిర్-వేదము అంటే ఖగోళశాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం కాదు. ఎందుకంటే ఇతరులు, బ్రాహ్మణుడి కంటే తక్కువ తెలివైన వారు, తక్కువ స్థాయిలో ఉన్న వారు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వారికి ఆరోగ్యం మరియు భవిష్యత్తు కోసం బ్రాహ్మణులు అవసరం. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి చాలా ఉత్సాహముగా ఉంటారు, తరువాత ఏమి జరుగుతుందో అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యము గురించి ఆలోచిస్తారు. కాబట్టి బ్రాహ్మణులు, వారు ఆరోగ్యము మరియు భవిష్యత్తు గురించి సలహా ఇస్తారు, కాబట్టి అది వారి వృత్తి మరియు ప్రజలు వారికి తినే వస్తువులు, వస్త్రం ఇస్తారు అందువల్ల బయట పని చేయవలసిన అవసరము వారికి లేదు. ఏమైనా ఇది సుదీర్ఘ కథ. కాబట్టి ఈ శరీరము మూడు మూలకాల సంచి, yasyātmā-buddhiḥ kuṇape tri-dhātuke ( SB 10.84.13)