TE/Prabhupada 0061 - ఈ శరీరం చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము వున్న ఒక సంచి



Northeastern University Lecture -- Boston, April 30, 1969

నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మనము కృష్ణ చైతన్య ఉద్యమమును విస్తరిస్తున్నాము ఈ ఉద్యమం యొక్క ఒక గొప్ప అవసరం వున్నది ప్రపంచవ్యాప్తంగా. ఈ పద్ధతి చాలా సులభం. అది లాభము మొదట, ఆధ్యాత్మిక స్థాయి అంటే తెలుసుకుందాము మన జీవన పరిస్థితుల పరంగా, మనము వివిధ స్థాయిలలో ఉన్నాము. కాబట్టి మనము మొదట ఆధ్యాత్మిక స్థాయిలో వుండాలి తరువాత ఆధ్యాత్మిక ధ్యానం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉంది. భగవద్గీత మూడవ అధ్యాయంలో, మీరు జీవితంలో వివిధ స్థితిగతులు ఉన్నాయని తెలుసుకుంటారు. మొదటి ఇంద్రియాని పరాణ్యాహుర్... ( BG 3.42) ఉంది. సంస్కృతంలో ఇంద్రియాని. మొదట శరీర భావన గురించి తెలుసుకుందాము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరు, శరీర భావనలో ఉన్నారు నేను భారతీయుడిని అని అనుకుంటున్నాను మీరు అమెరికన్లు అని భావిస్తున్నారు. ఎవరో భావిస్తున్నారు "నేను రష్యన్ని" ఎవరో ఆలోచన, "నేను మరొకరిని." కాబట్టి అందరూ భావిస్తున్నారు: "నేను ఈ శరీరం అని" ఇది ఒక విధమైన ఆలోచనా విధానము ఈ స్థితిని ఇంద్రియ స్థితి అంటారు మనము శరీర భావనలో వుంటే మనము ఆనందానికి అర్థం ఇంద్రియ తృప్తి అని అనుకుంటున్నాను. అంతే. ఆనందము అంటే అర్థం ఇంద్రియ తృప్తి ఎందుకంటే శరీరము అంటే ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాణి పరాణ్యాహుర ఇంద్రియేభ్యః పరం మనః ( BG 3.42) దేవాదిదేవుడు కృష్ణుడు చెప్తారు భౌతిక భావనలో లేదా శరీర భావనలో, మన ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఇది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఈ భౌతిక ప్రపంచం సృష్టించినప్పటి నుండి. నేను ఈ శరీరమును అనేది ఒక్క వ్యాధి శ్రీమద్-భాగవతము చెప్తుంది యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే స్వధీః కలాత్రాదిషు భౌమ ఇజ్యధీః ( SB 10.84.13) నేను ఈ శరీరంను, ఎవరైతే శరీర భావనలో వుంటారో, వారు నేను ఈ శరీరమును యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతు. ఆత్మ బుద్ధిః అంటే. ఆత్మ చర్మం ఎముకలు సంచిలో వున్నది అనే భావన. ఈ శరీరం అనే ఒక సంచి, చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము, చాలా మంచి విషయాలు వున్నవి. మీరు చూడండి? కానీ మనము అనుకుంటున్నాము: "నేను ఎముకలు, చర్మం, మలం, మూత్రం యొక్క ఈ సంచి గురించి ఆలోచిస్తున్నాము ఇది మన అందము. ఇది మన సంపద.

అనేక మంచి కథలు ఉన్నాయి అయితే, మనకు సమయం చాలా తక్కువగా వున్నది. అయినప్పటికీ, నేను ఒక చిన్న కథ, చెప్తాను ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అమ్మాయి అంగీకరించదు, కానీ ఆతను స్థిరంగా ప్రయత్నిస్తున్నాడు భారతదేశంలో అమ్మాయిలు, వారి పవిత్రతను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు అమ్మాయి అంగీకరించదు. ఆమె చెప్తుంది, "సరే నేను అంగీకరిస్తున్నాను. మీరు ఒక వారం తర్వాత రండి". ఆయనని ఫలానా రోజు రమ్మంటుంది. అబ్బాయి చాలా సంతోషంగా అంగీకరించారు అమ్మాయి ఏడు రోజులు విరోచనాల మందులు వాడినది ఆమె పగలు రాత్రి, ఆమె వాంతులు, మలమును విసర్జిస్తుంది. ఒక మంచి కుండలో ఈ వాంతి మలమును ఆమె జాగ్రత్తగా ఉంచుతుంది. అనుకున్న సమయం వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు, ఆమె తలుపు బయట కూర్చున్నది. అతడు ప్రశ్నిస్తాడు, "అమ్మాయి ఎక్కడ ఉంది?" ఆమె చెప్పింది: "నేనే ఆ అమ్మాయిని." ...లేదు, మీరు ఆమె కాదు. మీరు ఆ అమ్మాయి కాదు. మీరు చాలా అందవిహీనముగా ఉన్నారు. ఆమె అందమైనది మీరు ఆ అమ్మాయి కాదు. లేదు, నేను అదే బాలికను, నా అందమును నా నుండి వేరు చేసి మరొక కుండలో వుంచాను" అది ఏమిటి? ఆమె చూపించెను: ఆ అందం ఏమిటంటే, ఈ మలము వాంతి. అందములోని పదార్థములు ఇవి నిజానికి, కొంత మంది చాలా బలముగా లేదా చాలా అందముగా ఉండవచ్చు - కొందరు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు, మలమునకు వెళ్ళితే ప్రతిదీ వెంటనే మారుతుంది.

కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే శ్రీమద్-భాగవతములో చెప్పిన విధముగా, ఈ భౌతిక శరీరభావన ఆశావాదము కాదు. యస్యాత్మ బుద్ధిః కుణాపే త్రిధాతుకే ( SB 10.84.13)