TE/Prabhupada 0065 - కృష్ణ చైతన్యములో శిక్షణ ఇస్తే (ఇచ్చి ఉంటే), ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు

From Vanipedia
Jump to: navigation, search

కృష్ణ చేతన్యములో శిక్షణ ఇచ్చి ఉంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు
- Prabhupāda 0065


Arrival Lecture -- Gainesville, July 29, 1971

మహిళ అతిథి: కృష్ణ చైతన్య ఉద్యమంలో రోజంతా హరే కృష్ణ మంత్రాన్ని జపము చేసేవారు కాకుండా, పరోక్షముగా కృష్ణుడికి సేవ చేసే వారి పరిస్థితి ఏమిటి?

ప్రభుపాద: పద్ధతి ఏమిటంటే మీరు చెట్టు యొక్క వేరుకి నీరు పోయాలి. ఆ నీరు ఆకులకు, శాఖలు, కొమ్మలకి పంపిణీ చేయబడుతుంది మరియు అవి తాజావిగా ఉంటాయి. కానీ మీరు ఆకులకు మాత్రమే నీరు పోస్తే అప్పుడు ఆకులు పాడైపోతాయి, మరియు చెట్టు చనిపోతుంది. మీరు మీ పొట్టలోకి ఆహారం ఇస్తే, అప్పుడు శక్తి ప్రతిచోటా మీ వెంట్రుకలకు, మీ వేలుకు మీ గోర్లకు పంపిణీ చేయబడుతుంది. మీరు చేతిలోకి అదే ఆహారం తీసుకొని కడుపుకు ఇవ్వకపోతే అది నిష్ఫలమవుతుంది కాబట్టి ఈ అన్ని మానవతా సేవలు కృష్ణ చైతన్యము లేకపోవుటవలన వృధా అవుతుయి వారు మానవ సమాజంలో, సేవ చేయుటకు ఎన్నోవిధాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ వారి ప్రతి ప్రయత్నము నిరాశ కలిగిస్తుంది ఎందుకంటే కృష్ణ చైతన్యము లేనందున, . కృష్ణ చేతన్యములో శిక్షణ ఇచ్చి ఉంటే, అప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎవరైనా సహకారించిన ,ఎవరైనా విన్న, ఎవరైనా చేరిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. మాది ఒక సహజ విధానము. మీరు దేవుని ప్రేమిస్తారు. నిజముగా దేవుని ప్రేమిస్తే,సహజంగా మీరు అందరిని ప్రేమిస్తారు. మీరు జంతువులను కుడా ప్రేమిస్తారు. కేవలం కృష్ణ చేతనము కలిగిన వ్యక్తి, దేవుని ప్రేమిoచటము వలన అతను జంతువులను కుడా ప్రేమిస్తాడు. అతను పక్షులను, జంతువులను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కానీ మానవతా ప్రేమ అని పిలవబడే వారు ఒక మనిషితో ప్రేమ లో ఉoటారు. కానీ జంతువులను చంపుతారు. ఎందుకు వారు జంతువులను ప్రేమించరు లేరు? ఎందుకంటే వారి ప్రేమ అసంపూర్ణమైనది. కానీ కృష్ణ చేతన్య వ్యక్తి ఒక జంతువును ఎప్పుడూ చంపడు లేదా జంతువును ఇబ్బంది పెట్టాడు. ఇది విశ్వవ్యాప్తమైన ప్రేమ. మీరు కేవలం మీ సోదరుడు లేదా మీ సోదరిని ప్రేమిస్తే, అది విశ్వవ్యాప్తమైన ప్రేమ కాదు. సార్వత్రిక ప్రేమ అంటే మీరు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. సార్వత్రిక ప్రేమ కృష్ణ చైతన్యమువలన అభివృద్ధి చెందుతుంది. ఏ ఇతర మార్గాల ద్వారా కాదు

మహిళ అతిథి: నాకు తెలుసు కొంతమంది మీ భక్తులు భౌతిక ప్రపంచము యొక్క తల్లిదండ్రుల నుండి విడిపోయారు. అది వారికి శోకం ఇచ్చింది ఎందుకంటే వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు ఇప్పుడు మీరు వారికీ ఏమి చెప్పి ఈ పరిస్థితి ఎలా సరిదిద్దుతారు?

ప్రభుపాద: చక్కగా, కృష్ణ చైతన్యంలో వున్నా ఒక వ్యక్తి, తన తల్లిదండ్రులకు, కుటుంబమునకు, దేశమునకు, సమాజానికి ఉత్తమ సేవ అందిస్తాడు. కృష్ణ చైతన్యము లేకుండా, మీ తల్లిదండ్రులకు ఏమి సేవ చేస్తారు? సాధారణంగా, వారు వేరుగా వుంటారు. కానీ, ప్రహ్లాదుడు మహారాజా ఒక గొప్ప భక్తుడు మరియు అతని తండ్రి ఒక గొప్ప ఆభక్తుడు. ఎంతగాఅంటే ఆతని తండ్రిని నరసింహస్వామిచే సంహరించ బడ్డాడు. కానీ ప్రహ్లాద మహారాజుని కొన్ని వరములు కోరామని దేవుడు ఆదేశించిన్నప్పుడు, అతను చెప్పెను "నేను ఒక వ్యాపారవేత్తను కాదు, కొన్ని సేవలు మీకు చేసి , తిరిగి మీ దగ్గర నుండి సేవలు తీసుకొనుటకు.. నన్ను దయచేసి క్షమించుము. నరసింహస్వామి చాలా సంతృప్తి చెంది: ఇతడు ఒక స్వచ్ఛమైన భక్తుడు. కానీ అదే స్వచ్ఛమైన భక్తుడు దేవుడిని కోరాడు. "ఓ దేవా, నా తండ్రి నాస్తికుడు, మరియు అతను చాల నేరాలు చేసాడు, కాబట్టి నేను నా తండ్రికి . విముక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను. నరసింహస్వామి పలికెను మీ తండ్రి నీవు భక్తుడు అవ్వటము వలన ఎప్పుడో విముక్తుడు అయినాడు. అతను ఎన్ని అపరాదములు చేసినను, నీవు అతని కుమారుడు అవటము వలన విముక్తి పొందినాడు మీ తండ్రి మాత్రమే కాదు, మీ తండ్రికి తండ్రి, ఏడు తరాలవారు అందరు విముక్తులు అయ్యారు. ఒక వైష్ణవడు కుటుంబంలో జన్మిస్తే, అతని తండ్రిని మాత్రమే కాదు, అతని తండ్రిని, ఆతని తండ్రి తండ్రిని, ఆతని తండ్రి తండ్రిని ఏడూ తరాలవారిని ఆ విధముగా విముక్తి కలుగ చేస్తారు. కాబట్టి కృష్ణ చైతన్యవంతులము అవుట మీ కుటుంబానికి ఉత్తమ సేవ. వాస్తవానికి, నా విద్యార్థులు ఒకరు కార్తికేయ, అతని తల్లికి సమాజం అంటే చాలా ఇష్టం. అతడు తన తల్లిని చూడాలి అనుకున్నప్పుడు అతని తల్లి కూర్చో. నేను నృత్య పార్టికి వెళుతున్న, అనేది. వారి సంబంధం అది. అయినప్పటికీ ఇ బాలుడు కృష్ణ చైతన్యములో ఉండటము వలన అతను తన తల్లి దగ్గర, అనేక సార్లు కృష్ణుడి గురించి మాట్లాడాడు. మరణసమయంలో, తల్లి తన కుమారుడిని అడిగింది: మీ కృష్ణుడు ఎక్కడ. ఇదిగో అతను ఇక్కడ ఉన్నాడు? వెంటనే ఆమె మరణించింది. అంటే మరణం సమయంలో ఆమె కృష్ణుడిని గుర్తుచేసుకున్నది కనుక వెంటనే ఆమె విముక్తి పొందినది భగవద్గీతలో చెప్పబడినది yaṁ yaṁ vāpi smaran loke tyajaty ante kalevaram (BG 8.6). మరణం సమయంలో, మనము కృష్ణుడిని గుర్తుంచుకుంటే, అప్పుడు జీవితం విజయవంతమవుతుంది. కాబట్టి ఈ తల్లి, కుమారుడు కృష్ణ చైతన్యము కలిగి ఉండుట వలన నిజానికి ఆమెకు కృష్ణ చైతన్యము లేకుండా ఆమె విముక్తి పొందినది. కాబట్టి ఈ ప్రయోజనం ఉంది.