TE/Prabhupada 0078 - మనము కేవలం శ్రవణము ద్వారా, ఒక దాని తరువాత మరొక కత్తిని అందుకుంటున్నాము



Lecture on SB 1.2.16 -- Los Angeles, August 19, 1972

శుశ్రుషోః శ్రద్ధాధానస్య వాసుదేవ-కథా- రుచిః ముందు శ్లోకములో వివరించబడింది. యద్ అనుధ్యాసినా యుక్తః( SB 1.2.15) ఒకరు ఎప్పుడూ ఆలోచిస్తూ నిమగ్నమై ఉండాలి. ఇది కత్తి. మీరు కృష్ణ చైతన్యము యొక్క కత్తిని పట్టుకుని ఉండాలి అప్పుడు మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఈ ముడి కత్తి ద్వారా కత్తిరించబడుతుంది ఇప్పుడు ఎలా మనము ఈ కత్తిని పొందవచ్చు? ఈ పద్ధతి ఇక్కడ వివరించబడింది. మీరు కేవలం శాస్త్రమును, శ్రవణము చేయడానికి ప్రయత్నించండి. మీరు కత్తిని పొందుతారు. అంతే. వాస్తవానికి ఈ కృష్ణ చైతన్య ఉద్యమము వ్యాప్తి చెందుతోంది. మనము కేవలం శ్రవణము ద్వారా, ఒకటి తరువాత మరొక కత్తిని అందుకుంటున్నాము. నేను న్యూయార్క్ లో ఈ ఉద్యమం ప్రారంభించాను. మీ అందరికీ తెలుసు. నేను నిజానికి ఏ కత్తి కలిగిలేను. కొన్ని మతపరమైన నియమాలలో, వారు ఒక చేతిలో మత గ్రంథములను పట్టుకుని మరొక చేయిలో కత్తిని పట్టుకొని: "మీరు ఈ గ్రంథాలను అంగీకరించాలి; లేకపోతే నేను మీ తలను నరుకుతాను" ఇది మరొక విధమైన ప్రచారము. నేను కూడా కత్తిని కలిగి వున్నాను, కానీ ఆ రకమైన కత్తి కాదు. ఈ కత్తి - ప్రజలు శ్రవణము చేయడానికి అవకాశం ఇస్తుంది. అంతే.వాసుదేవ-కథా- రుచిః. ఆయనకి రుచి రావడముతో రుచి అంటే ఆసక్తి ఇక్కడ కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. నేను వింటాను వెంటనే ఈ కత్తిని పొందుతారు. కత్తి మీ చేతిలో ఉంది.

వాసుదేవ-కథా- రుచిః. కానీ రుచి ఎవరికి వస్తుంది? ఈ రుచి? నేను అనేక సార్లు, వివరించాను, రుచి చక్కెర మిఠాయి వంటిది. అందరికీ తెలుసు ఇది చాలా తియ్యగా ఉంటుంది కానీ మీరు కామెర్లతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఇస్తే, ఆయనకి ఇది చేదుగా ఉంటుంది అందరికీ చక్కెర తీయ్యగా ఉంటుంది అని తెలుసు, కానీ కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి, ఆయనకి తీపి మిఠాయి చేదుగా ఉంటుంది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇది వాస్తవము.

వాసుదేవ కథ, కృష్ణుని కథా రుచి శ్రవణము చేయడానికి, భౌతికంగా అనారోగ్యంతో వున్న వ్యక్తికి ఈ రుచి అర్థము కాదు. ఈ రుచిని పొందడానికి ప్రాథమిక కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఏమిటి? మనము ప్రశంసించాలి. ఇది చాలా బాగుంది. ఆదౌ శ్రద్ధా, శ్రద్ధాధానా. కావున శ్రద్ధ, ప్రశంసించడము ప్రారంభము. తరువాత సాధు సంఘ తరువాత కలవాలి: "సరే, ఈ భక్తులు కృష్ణుడి గురించి పాడుతున్నారు, మాట్లాడుతున్నారు నేను వెళ్ళి, కూర్చుని నేను మరింత వింటాను దీనిని సాధు-సంఘ అంటారు. భక్తులతో సాంగత్యము చేయుట. ఇది రెండవ దశ. మూడవ దశ భజన క్రియ కొందరు చక్కగా సాంగత్యము చేసినప్పుడు, అప్పుడు ఆయన నేను "ఎందుకు శిష్యుడు కాకూడదు" అని అనుకుంటాడు. అప్పుడు మనకు దరకాస్తు ఇస్తాడు. ప్రభుపాదా, మీరు నన్ను దయతో శిష్యునిగా అంగీకరిస్తే ఇది భజన క్రియ యొక్క ప్రారంభము. భజన-క్రియ అంటే భగవంతుని సేవలో నిమగ్నమై ఉండటము. ఇది మూడవ దశ