TE/Prabhupada 0263 - మీరు ఈ ఫార్ములాను చాలా చక్కగా తీసుకున్నట్లయితే, అప్పుడు మీరు ప్రచారము చేస్తుంటారు



Lecture -- Seattle, September 27, 1968

ప్రభుపాద: అవును.

మధుద్విస: ప్రభుపాద, చైతన్య మహాప్రభు స్వర్ణయుగము అయిన కలి యుగము గురించి ఖచితముగా ఏమిని అంచనా వేశారు, హరే కృష్ణ మంత్రాన్ని ప్రజలు కీర్తన చేస్తున్నప్పుడు?

ప్రభుపాద: అవును. ప్రజలు ... మనము ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారము చేస్తూన్నట్లుగానే. మీ దేశంలో ఇటువంటి ప్రచారము లేదు. ఐరోపా, జర్మనీ, లండన్లలో మా శిష్యులను మేము పంపాము - మీరు కూడా వ్యాప్తి చెస్తున్నారు. ఈ విధంగా, ఇది కేవలం, మనము,మన ప్రచారమును 1966 నుండి ఆచరణాత్మకంగా. మనము 1966 లో సంఘంను నమోదు చేసుకున్నాము ఇది '68. క్రమంగా మనము వ్యాప్తి చేస్తున్నాము. అయితే, నేను వృద్ధుడను. నేను మరణించవచ్చు. మీరు ఈ ఫార్ములాను చాలా చక్కగా తీసుకున్నట్లయితే, అప్పుడు మీరు ప్రచారము చేస్తుంటారు., ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. చాలా సులభమైన విషయము. కేవలం మనము కొద్దిగా మేధస్సు కలిగి ఉండాలి. అంతే. తెలివైన మనిషి ఎవరైనా అభినందిస్తారు. ఎవరైనా మోసం చేయాబడలని కోరుకుంటే, అప్పుడు అయిన ఎలా రక్షించబడతాడు, ఒకవేళ ఇష్టపూర్వకంగా మోసం చేయ బడాలని కోరుకుంటే? అప్పుడు అయినని ఒప్పించటము కొంచము కష్టము. కానీ విశాల-హృదయము గలవారు, వారు ఈ మంచి ఉద్యమమును, కృష్ణ చైతన్యమును అంగీకరిస్తారు. అవును.

జయ-గోపాల: కృష్ణుడి సేవలో మనము న్యునా శక్తిని, అంతర్గత శక్తిని వినియోగించిన్నప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది, అది అవ్వదా?

ప్రభుపాద: కాదు. మీరు మీ శక్తిని వినియోగించినప్పుడు, అది ఎంత మాత్రము బౌతికము కాదు; ఇది ఆధ్యాత్మికం. రాగి తీగ విద్యుత్తో కలిసి ఉన్నప్పుడు, ఆది ఎంత మాత్రము రాగి కాదు; ఆది విద్యుత్. కృష్ణుడికి సేవ అంటే మీరు పూర్తిగా కృష్ణుడి సేవలో ఉన్నట్లయితే వెంటనే, మీరు కృష్ణుడికి భిన్నంగా లేరు. ఇది భగవద్గీతలో చెప్పబడింది: māṁ ca 'vyabhicāreṇā bhakti-yogena yaḥ sevate. ఈ పదమే, సెవాతే. Sa guṇān samatītyaitān brahma-bhūyāya kalpate ( BG 14.26) నా సేవలో ఎవరైనా తీవ్రంగా పాల్గొoటే వెంటనే అయిన భౌతిక లక్షణాలకు అధిగమిస్తాడు అయిన బ్రాహ్మణ స్థితిపై ఉంటాడు. " Brahma-bhūyāya kalpate. మీరు కృష్ణుడి సేవలో మీ శక్తిని వినియోగించినప్పుడు, మీ భౌతిక శక్తి ఉందని మీరు అనుకోవద్దు. కాదు కేవలము ఈ పండ్లు వలె . ఈ పండ్లు, ఒకరు అనుకోవచ్చు, "ఈ ప్రసాదము ఏమిటి? ఈ పండు కొనుగోలు చేయబడింది, మనము ఇంట్లో కూడా పండు తిoటాము, ఇది ప్రసాదము? " కాదు ఎందుకంటే ఇది కృష్ణుడికి అర్పించబడినది, అది బౌతికము కాదు. ఫలితం? మీరు కృష్ణ ప్రసాద్ని తినిoడి, మీరు కృష్ణ చైతన్యములో ఎలా అభివృద్ధి చేoదుతున్నారో చూడండి. వైద్యుడు మీకు ఏదైనా ఔషధం ఇచ్చినట్లయితే మీకు అది నయము అయితే అది ఔషధం యొక్క ప్రభావం. మరో ఉదాహరణ ఎమిటoటే, బౌతిక విషయములు ఎలా ఆధ్యాత్మికమవుతాయి. చాలా మంచి ఉదాహరణ. మీరు పెద్ద మొత్తంలో పాలు తీసుకుoటే. మీ కడుపులో కొoత వికారముగా ఉంటుంది. మీరు వైద్యుడి దగ్గరకు వెళ్ళితే. కనీసం, వేదముల పద్ధతి ప్రకారం ..., మీకు పాలను పులియబెట్టి చిక్కటి పెరుగువంటి ఆహార పదార్థం ఇస్తారు. ఇది పాలతో చేసిన పదార్ధము. కొద్దిగా ఔషధముతో ఆ పెరుగు నయం చేస్తుంది. ఇప్పుడు మీ వ్యాధి పాల వల్ల సంభవిoచింది అది పాలతోనే నయమవుతుంది. ఎందుకు? ఇది వైద్యుడిచే ఇవ్వబడినది కనుక అదేవిధంగా, ప్రతిదీ ... ఉన్నత అర్థంలో బౌతిక విషయములు ఉండవు; ఇది కేవలం భ్రాంతి మాత్రమే. ఈ ఉదయం నేను సూర్యుడు పొగమంచు యొక్క ఉదాహరణ ఇవ్వడం జరిగినది. పొగమంచు ఉంది; సూర్యుడిని చూడలేము. మూర్ఖుడు ఇలా అంటాడు "సూర్యుడు లేడు, ఇది కేవలం పొగమంచు." కానీ తెలివైన వ్యక్తి "సూర్యుడు ఉన్నాడు, కానీ పొగమంచు మన కళ్ళను కప్పినది, మనము సూర్యుడును చూడలేము." అదేవిధంగా, వాస్తవానికి ,ప్రతిదీ కృష్ణుడి యొక్క శక్తి, ఏదీ బౌతికము కాదు. కేవలం మనము యజమాని అనే ఈ మనస్తత్వం, అది తప్పు, భ్రమ. అది కృష్ణుడితో మన సంబంధాన్ని కప్పుతుంది. మీరు క్రమంగా అర్థం చేసుకుంటారు. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). మీరు సేవ వైఖరిలో పురోగతి సాధించినప్పుడు, ప్రతిదీ స్పష్టముగా అర్ధమవుతుంది, మీ శక్తి ఎలా ఆధ్యాత్మికం అయింది.