TE/Prabhupada 0286 - అవి మీకు కృష్ణుడికి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ యొక్క అపసవ్యమైన ప్రతిబింబములు



Lecture -- Seattle, September 30, 1968


కావునా ఇబ్బంది లేదు.వాస్తావానికి కృష్ణుడిని ఎలా ప్రేమిoచాలో నేర్చుకోవాలి. కావునా దిశ ఉంది పద్ధతి ఉంది, వీలైనంతవరకూ మేము మీకు సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాము. మిమ్మల్ని ఆహ్వానించడానికి వీధుల్లో పట్టణంలో మా అబ్బాయిలను పంపిస్తున్నాం. మీరు ఈ అవకాశాన్నిదయతో చేపట్టితే, మీ జీవితం విజయవంతమవుతుంది. Premā pum-artho mahān. ఎందుకంటే ఈ మానవ జీవన విధానం దేవుడి పట్ల ప్రేమను పెంపొందించడానికి ఉద్దేశించబడింది. అన్ని ఇతర జీవితాల్లో, మనము ప్రేమించాము, మనము ప్రేమించాము. మనము మన పిల్లలను ప్రేమించాము, మనం మన భార్యను ప్రేమించాము, మన పక్షి జీవితంలో మన గూళ్ళను ప్రేమించాము, మృగ జీవితంలో ప్రేమ ఉంది. పిల్లలను ప్రేమిoచడానికి పక్షి లేదా మృగాలకు బోధిoచవలసిన అవసరoలేదు. ఏ అవసరం లేదు, ఎందుకంటే ఇది సహజమైనది. మీ ఇంటిని ప్రేమించడము, మీ దేశమును ప్రేమించడము, మీ భర్తను ప్రేమించడము, మీ బిడ్డలను ప్రేమిస్తూ, మీ భార్యను ప్రేమిస్తూ, ఈ విధముగా వెళ్ళుతు ఉంటే, ఈ ప్రేమ, ఏదిఏమైనప్పటికీ వారు అందరు జంతు సామ్రాజ్యం లో ఉన్నారు. కానీ అలాంటి ప్రేమ మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీకు విసుగు వస్తుంది ఎందుకంటే ఈ శరీరం తాత్కాలికం అందువల్ల ఈ ప్రేమ వ్యవహారాలు అన్ని తాత్కాలికమైనవి, అవి పవిత్రమైనవి కావు. అవి నీకు కృష్ణుడికి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ యొక్క అపసవ్యమైన ప్రతిబింబములు. మీరు వాస్తవమునకు శాంతిని కోరుకుoటే, మీరు వాస్తవమునకు సంతృప్తిని కోరుకుoటే, మీరు గందరగోళంగా ఉండకూడదనుకుంటే, కృష్ణుడిని ప్రేమిoచటానికి ప్రయత్నిoచండి. ఇది సాదా కార్యక్రమము. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. కృష్ణ చైతన్యము ప్రజలను తప్పుదారి పట్టించడానికి కాదు ప్రజలను మోసము చేయడానికి కాదు. ఇది చాలా ప్రామాణిక ఉద్యమం. వేద సాహిత్యం, భగవద్గీత, శ్రీమద్-భాగావతం, వేదాంత-సూత్రా, పురాణములు, అనేక మంది, చాలా గొప్ప గొప్ప సాధువులు ఈ మార్గమును స్వీకరించారు. స్పష్టమైన ఉదాహరణ చైతన్య మహాప్రభు. మీరు అయిన చిత్రాన్ని చూడండి, అయిన నృత్యము చేసే భావనలో ఉన్నారు. మీరు ఈ కళను నేర్చుకోవాలి, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. మీరు కృత్రిమ ఊహాత్మక పద్ధతులను సాధన చేయవలసిన అవసరము లేదు. మీ మెదడు ఇబ్బంది పెట్ట వలసిన అవసరము లేదు ... ఇతరులను ప్రేమించాలనే స్వభావం మీకు ఉంది. అది సహజమైన, సహజమైనది. కేవలము మనం ప్రేమను సరిఅయిన చోట పెట్టడము లేదు. అందువల్ల మనము నిరుత్సాహపడుతున్నాము. విసుగు. గందరగోళం. మీరు గందరగోళంగా ఉండకూడదనుకుంటే, మీరు నిరాశ చెందకూడదనుకుంటే, కృష్ణుడిని ప్రేమిoచడానికి ప్రయత్నిoచoడి, మీరు ప్రశాంతతలో పురోభివృద్ధి చెందుతున్నారని, సంతోషంగా ఉన్నారని మీరు మీకుగా తెలుసుకుంటారు, మీకు కావలసిన ప్రతి దానిలో.

ధన్యవాదాలు.