TE/Prabhupada 0311 - మనము కొత్త వెలుగును ఇస్తున్నాము, ఆ ధ్యానం విఫలమవుతుంది. మీరు దీనిని తీసుకోండి



Lecture -- Seattle, October 2, 1968


పిల్లవాడు: బుద్ధుడు ఇక్కడ ఉన్నప్పుడు, అయిన కూర్చుని ధ్యానం చేసాడా?

ప్రభుపాద: అవును.

పిల్లవాడు: సరే, నేను ఈ యుగములో ధ్యానం చేయలేరు అని నేను అనుకున్నాను,

కానీ దేవుడి కుమారుడు భగవంతుడు బుద్ధుడు, అయిన ధ్యానం చేశాడు.

ప్రభుపాద: అవును.

పిల్లవాడు: కానీ అది కలి యుగము కాదా?

ప్రభుపాద: అవును.

పిల్లవాడు: ఇది?

ప్రభుపాద: అవును.

పిల్లవాడు: అప్పుడు ఎలా ధ్యానం చేయవచ్చు?

ప్రభుపాద: చాలా మంచి ప్రశ్న. (నవ్వులు) అందువలన మనం బుద్ధుడి కన్నా మంచి వారము. మనకు ధ్యానం సాధ్యం కాదు అని చెప్పుతున్నాము మీరు చూస్తున్నారా? మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? భగవంతుడు బుద్ధడు చెప్పాడు, "ధ్యానం చేయండి," కానీ భగవంతుడు బుద్ధుని అనుచరులు చేయలేక పోయారు. వారు విఫలమయ్యారు. మనము కొత్త వెలుగును ఇస్తున్నాము, ఆ "ధ్యానం విఫలమవుతుంది మీరు దీనిని తీసుకోండి." అది స్పష్టంగ వుందా? అవును. ఎవరైనా మీతో ఏదైనా చెప్పి ఉంటే, మీరు వైఫల్యం చేంది ఉంటే, నేను ఇలా చెప్పుతాను, "మీరు దీనిని చేయవద్దు, దీన్ని తీసుకోండి, ఇది మంచిది." ఉదాహరణకు నీవు చిన్నపిల్ల వాడివి, నీవు ధ్యానం చేయలేవు, కానీ నీవు హారే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయగలవు నృత్యం చేయగలవు. భగవంతుడు బుద్ధడుకి తెలుసు వారు ధ్యానం చేయలేరని . నీవు చాలా తెలివైన బాలుడివి. కానీ వారి పిచ్చి పనులను ఆపడానికి, అయిన సరళముగా చెప్పారు, "క్రింద కూర్చోని. ద్యానము చేయండి. అంతే. (నవ్వు) ఒక కొంటె బాలుడి వలె. అయిన అల్లరి చేస్తున్నాడు. అయిన తల్లిదండ్రులు చెప్పుతారు, "నా ప్రియమైన జాన్, నీవు ఇక్కడ కూర్చో." వాడు కూర్చోలేడని వాడికి తెలుసు, కానీ కోంత సమయo వాడు కూర్చుoటాడు. వాడు కుర్చోడని తండ్రికి తెలుసు, కానీ కొంత సమయము వాడు ఈ కొంటె పనులను ఆపుతాడు. అయితే సరే. హరే కృష్ణ కీర్తన చేయండి .