TE/Prabhupada 0477 - మేము కొత్తగా ఎటువంటి మత వర్గమును గానీ లేదా తత్వ బోధనలను గానీ తయారుచేయలేదు



Lecture -- Seattle, October 7, 1968


కాబట్టి మా ఈ కృష్ణచైతన్య ఉద్యమం, అర్థం చేసుకోవడం లేదా అమలు చేయడం అంత కష్టం ఏమీ కాదు. కేవలం మనము దీన్ని పాటిoచడానికి అంగీకరించాలి. అంతే. ఆ అంగీకరణ మీ చేతుల్లో ఉంది. మీరు కావలనుకుంటే, దాన్ని అంగీకరించవచ్చు. ఎందుకంటే ఏదైనా స్వీకరించడానికి లేదా తిరస్కరించడనికి మీకు స్వల్పమైన స్వతంత్ర్యం ఇవ్వబడింది. ఆ స్వతంత్ర్యం మీరు పొందివున్నారు. మరియు ఏదైనా ఒక మంచి విషయాన్ని తిరస్కరించడం ద్వారా, మనము బాధ లో ఉంటాము, మరియు ఏదైనా ఒక మంచి విషయాన్ని అంగీకరించడం ద్వారా, మనము సంతోషంగా ఉంటాము. కాబట్టి ఈ అంగీకారం, తిరస్కరణ మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మన ముందు వుంచబడింది, కృష్ణచైతన్యము, గొప్ప ప్రామాణికుల ద్వారా, భగవంతుడు కృష్ణుడి ద్వారా, చైతన్య మహప్రభు ద్వారా, మరియు మేము వినయపూర్వకమైన సేవకులము మాత్రమే. మేము కేవలం వితరణ చేస్తున్నాము. మేము కొత్తగా ఎటువంటి మత వర్గమును గానీ లేదా తత్వ బోధనలను గానీ తయారుచేయలేదు. ఇది చాలా,చాలా ప్రాచీన పద్ధతి, కృష్ణచైతన్యము. సామన్య ప్రజలచే ఆమోదించబడే రీతిలో, ప్రచారము చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఉన్న మీ అందరికీ, మరియు ఇక్కడ లేనివారికీ కూడా మా విన్నపం ఏమంటే, మీరు ఈ కృష్ణచైతన్య ఉద్యమమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిoచండి, మరియు మీరు వెంటనే అర్థం చేసుకోలేకుంటే, మీరు దయచేసి మా సాంగత్యాన్ని తీసుకోండి, ప్రశ్నలను వేయండి , అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము మీమ్మల్ని గుడ్డిగా అంగీకరించమని చెప్పటంలేదు. ప్రశ్నలను వేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి,మా సాహిత్యాన్ని చదవండి, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. మీరు దానిని తీసుకొని వెళ్తారు. దానిని మీరు తీసుకుంటే, మీరు సంతోషంగా ఉంటారు. ఇతర పద్ధతులల్లో ... ఎలాగంటే రాజకీయ మతాచరం వలె. ఇది జాతీయంగా అంగీకరించకపోతే ... ప్రతి దేశంలో చాలా రాజకీయ పక్షములు ఉన్నాయి. పార్టీ రాజకీయాల్లో ముందంజలో పాల్గొనడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. దేశం మొత్తం ఆయన తత్వాన్ని,ఆయన పార్టీని అంగీకరిస్తేతప్ప ఆ నాయకుడు విజయాన్ని సాధించలేడు. కాని కృష్ణచైతన్యము ఎంత మధురమైనదంటే దానికి ఆ అవసరం లేదు. ఒక సమాజం లేదా ఒక దేశం లేదా ఒక కుటుంబం లేదా ఏదో ఒక సమూహం అంగీకరించాలి, అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. అలా కాదు వ్యక్తిగతంగా, మీరు అంగీకరిస్తే. మీ కుటుంబం ఆమోదించకపోయినా, మీ సంఘం అంగీకరించకపోయినా, మీ దేశం అంగీకరించకపోయినా,దానితో సంబంధం లేదు. మీరు సంతోషంగా ఉంటారు. కాని మీ కుటుంబం అంగీకరించితే, మీ సమాజము అంగీకరిస్తే, మీ దేశం అంగీకరిస్తే ..., మీరు మరింత సంతోషంగా ఉంటారు. కాబట్టి, ఇది సంపూర్ణంగా, స్వతంత్రమైనది, కాబట్టి ఏవరైనా ఒక వ్యక్తి (వారు) కృష్ణచైతన్యాన్ని తీసుకున్న వెంటనే సంతోషంగా ఉంటాడు. కాబట్టి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము తరగతులు నిర్వహిస్తున్నాము, మేము వివిధ నగరల్లో వివిధ శాఖలు పొందివున్నాము, మా పుస్తకాలు వున్నాయి,మా పత్రికలు వున్నాయి, మరియు మేము మా ఉదయకాలపు మరియు సాయంత్రం తరగతుల ద్వారా మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. కాబట్టి మీకు నా వినయపూర్వకమైన అభ్యర్ధన ఏమంటే కేవలం మీరు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. Caitanyer dayā kathā karaha vicāra. మీరు అర్థం చేసుకునే నిర్ణయం తీసుకోవడానికి మీ ముందు వుంచాము. మీ నిర్ణయం కోసం మేము మీ ముందు ఈ కృష్ణచైతన్యాన్ని వుంచాము. మరియు మీరు పరిశీలనాత్మకంగా చూడండి, మరియు అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి, అప్పుడు మీరు, "ఓ,అది చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా బాగుంది."అని అనుభూతి చెందుతారు. ఇదే మా అభ్యర్థన. చాలా ధన్యవాదాలు.