TE/Prabhupada 0520 - మనము కీర్తన చేస్తున్నాము, వింటున్నాము, నృత్యము చేస్తున్నాము,ఆనందిస్తున్నాము. ఎందుకు



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


ఇది కూడా కృష్ణుడి ధామము, ఎందుకంటే ప్రతిదీ భగవంతునికి చెందుతుంది, కృష్ణునికి. ఎవరు యజమాని కాదు. ఈ వాదన, " ఈ భూమి, అమెరికా, మాకు చెందుతోంది, యునైటెడ్ స్టేట్స్," ఇది తప్పుడు వాదన. ఇది మీకు చెందినది కాదు, ఎవరికీ కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, నాలుగు వందల సంవత్సరాల క్రితం, ఇది భారతీయులకు చెందినది, రెడ్ ఇండియన్స్, ఏదో ఒక దారిలో, మీరు ఇప్పుడు ఆక్రమించారు. ఇతరులు ఇక్కడకు వచ్చి ఆక్రమించారని ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇదంతా తప్పుడు వాదన. వాస్తవానికి, ప్రతి ఒక్కటీ కృష్ణుడికి చెందుతుంది. కృష్ణుడు చెప్తారు సర్వ-లోక-మహేశ్వరమః ( BG 5.29) నేను అన్ని లోకముల యొక్క మహోన్నతమైన యజమాని, నియంత్రకుడను. కాబట్టి అన్నీ ఆయనకే చెందుతాయి. కానీ కృష్ణుడు అన్నీ తనకు చెందుతాయని చెప్పాడు. కాబట్టి అన్నీ ఆయన ధామము, ఆయన స్థానము, ఆయన నివాసం. కాబట్టి ఇక్కడ మనము ఎందుకు మార్చాలి? కానీ ఆయన అంటారు యద్ గత్వా న నివర్తంతే తద్ ధామ పరమం ( BG 15.6) పరమం అంటే మహోన్నతమైన. ఈ ధామములో కూడా, అవి కృష్ణుడి ధామము, కృష్ణుడి గ్రహములు, కానీ ఇక్కడ ఇది పరమ, మహోన్నతమైనవి కాదు. సమస్యలు ఉన్నాయి. ఈ జననము, మరణము, వ్యాధి, వృద్ధాప్యము వలె. కానీ మీరు కృష్ణుడి స్వంత నివాసమునకు తిరిగి వెళితే, గోలోక వృందావనము, చింతామణి- ధామము (BS. 5.29), అప్పుడు మీకు శాశ్వత జీవితం, ఆనందకరమైన జీవితం, జ్ఞానముతో నిండినది లభిస్తుంది.

అది ఎలా సాధించవచ్చు? ఇక్కడ ఇది ప్రారంభమైనది.... కృష్ణుడు చెప్తారు, మయ్ ఆసక్త-మనాః కేవలము మీరు కృష్ణుడితో మీ అనుబంధాన్ని పెంచుకోండి. కేవలం ఈ పద్ధతి. ఈ, ఇవన్నీ, మనము కీర్తన చేస్తున్నాము, మనము వింటున్నాము, మనము నృత్యము చేస్తున్నాము, మనము ఆనందిస్తున్నాము. ఎందుకు? అన్ని మూర్ఖపు విషయాల నుండి మన జీవితాన్ని విడదీయాలి, కృష్ణునితో అనుబంధము ఏర్పర్చుకోవాలి. ఇది పద్ధతి. ఇది కృష్ణ చైతన్యము. మీరు మీ మనస్సును ఏదో ఒక దానిపై అనుబంధము కలిగి ఉండాలి. కానీ మీరు మీ మనస్సులో ఏదో మూర్ఖపు వాటిపై అనుబంధము కలిగి ఉంటే అదే జరుగుతుంది, జన్మ-మృత్యు-జరా-వ్యాధి ( BG 13.9) జన్మ, మృత్యు,ముసలితనము, వ్యాధి. మీరు బాధపడాలి. మీరు బాధపడాలి. మీ సైన్స్, మీ భౌతిక సైన్స్, లేదా ఏమి లేదు.... కాదు. ఈ బాధలకు ఎవరూ పరిష్కారం చేయలేరు. మీకు నిజమైన పరిష్కారం కావాలనుకుంటే, శాశ్వత పరిష్కారం, శాశ్వత జీవితం, అప్పుడు మీరు కృష్ణుని పట్ల అనుబంధము పెంచుకోండి. సరళ పద్ధతి. మయ్యాసక్త-మనాః పార్థ యోగం యుంజన్. అది యోగ యొక్క సంపూర్ణ రూపం. అన్ని ఇతర యోగాలు, ఈ కృష్ణ చైతన్యము యొక్క స్థితికి రావడానికి సహాయపడవచ్చు, మీరు కృష్ణ చైతన్యము యొక్క స్థితికి రాకపోతే, అప్పుడు ఇబ్బందులు అన్నీ పనికి రాని శ్రమ. అది సాధ్యం కాదు. మీరు నెమ్మది అయిన యోగ పద్ధతిని తీసుకుంటే, ఈ యుగములో సాధ్యం కాదు. ఈ యుగములోనే కాదు, ఐదు వేల సంవత్సరాల క్రింద కూడా. ఇది సాధ్యం కాదు. మీరు మీ కసరత్తు పనులు చేయవచ్చు, కానీ ఇది ఎప్పటికీ విజయవంతం కావు. ఈ యోగ పద్ధతి, కృష్ణుడిచే ఆఖరి అధ్యాయంలో ధృవీకరింపబడినట్లుగా.... ఇది ఏడవ అధ్యాయం. ఆరవ అధ్యాయంలో కూడా, ఆయన ఇదే చెప్పారు, యోగినాం అపి సర్వేషాం : (B G 6.47) ఎవరి మనసైతే ఎల్లప్పుడూ కృష్ణునిపై అనుబంధము కలిగి ఉంటుందో‌‌, అతడు ఉత్తమ శ్రేణి యోగి. కాబట్టి ఇది కృష్ణ చైతన్యము.