TE/Prabhupada 0558 - మన పరిస్థితి తటస్తముగా ఉంది. ఏ సమయంలోనైనా, మనము పతనము అవ్వచ్చు



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద: అవును. లేదా మొదట, ఆయన యొక్క. అవును.

భక్తుడు: మీరు భగవంతుని పొందిన తర్వాత, కృష్ణుడి దగ్గరకు తిరిగి వెళ్ళినప్పుడు, మీరు పతనము అవ్వరు. కానీ వాస్తవానికి అక్కడ నుండి మనము వచ్చామని కూడా చెప్పబడింది. మనము అక్కడ నుండి వచ్చినట్లయితే, అక్కడే మనము ఇప్పటికే ఉండి ఉంటే మనము ఎలా పతనము అయ్యాము?

ప్రభుపాద: అవును. ఉదాహరణకు బ్రహ్మ మరియు శివుని వలె వారు కూడా కొన్నిసార్లు మాయచే బాధించ బడతారు. కాబట్టి మా, నేను చెప్పేది ఏమిటంటే, పతనము అయ్యే అవకాశము ఎల్లప్పుడూ ఉంది, అవకాశము. మనము భగవంతునిలో భాగం కనుక మనము ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాము కనుక, మనము పతితులైనట్లు అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఎప్పుడు పతితులైనారు అని మీ చరిత్రను మీరు గుర్తించలేరు. అసాధ్యం. కానీ మన పరిస్థితి తటస్తముగా ఉంది. ఏ సమయంలోనైనా, మనము పతనము అవ్వచ్చు. ఆ ధోరణి ఉంది. అందువలన మనం తటస్తము అని అంటారు. కానీ ఒకటి ... ఉదాహరణకు అర్థం చేసుకోవడం చాలా సులభం. అందరూ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అవునా కాదా? ఇప్పుడు మీరు వ్యాధిగ్రస్తులైతే, మీరు వ్యాధికి ఎప్పుడు గురైనారు అనే చరిత్రను కనుగొన వలసిన అవసరం లేదు. మీరు వ్యాధిగ్రస్తులైతే, మీరు చికిత్సను చేయించుకుంటారు, అంతే. అదేవిధముగా, మన భౌతిక బద్ధ జీవితములో ఉన్నాము. మీరు దానిని నయం చేయడం కోసము ప్రారంభించండి, మీకు నయమయిన వెంటనే, మళ్ళీ పతనము అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. కానీ పతనము అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ వ్యాధి వస్తుంది. మీరు ఒకసారి నయమైపోయినది కనుక, మళ్ళీ రోగం వచ్చే అవకాశం లేదు అని కాదు. అవకాశం ఉంది. అందువలన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును.

భక్తి: భగవద్గీతలో 41 వ పేజీలో బ్రహ్మ రెండవ ఆధ్యాత్మిక గురువు అని చెప్ప బడినది. ఆధ్యాత్మిక గురువులు అందరు ఎల్లప్పుడు నివసిస్తారు అని భావించాను; కానీ బ్రహ్మ ఎల్లప్పుడు జీవించడు.

ప్రభుపాద: అవును. మనము ఎల్లప్పుడు జీవిస్తాము. శరీరం యొక్క మార్పు ద్వారా మనము మరణించము. మీరు ఎల్లప్పుడు జీవిస్తారు, నేను ఎప్పటికీ జీవిస్తాను. మరణం అంటే మనం ఈ శరీరాన్ని మార్చుకుంటాము, అంతే. ఉదాహరణకు మీరు మీ దుస్తులు మార్చినట్లుగా. మీరు మీ దుస్తులు మార్చుకున్నప్పుడు, మీరు చనిపోయారని అర్థం కాదు. అదేవిధముగా ఈ శరీరం యొక్క మార్పు నిజానికి మరణం కాదు. లేదా వేరొక శరీరంలో కనిపిస్తే నిజానికి జన్మ అని అర్థం కాదు. జీవికి జన్మ మరియు మరణము లేదు, కానీ మన భౌతిక పరిస్థితిలో శరీరం యొక్క మార్పు జరుగుతోంది. దానిని జన్మ మరియు మరణముగా తీసుకుంటారు. వాస్తవమునకు జన్మ మరియు మరణం లేదు. అవును?

మధుద్విస: ప్రభుపాద, బుద్ధుడిని ఆరాధించే వ్యక్తికి, ఆయన వెళ్ళడానికి ఒక లోకము ఉందా? లేదా ఏమైనా ...

ప్రభుపాద: హు?

మధుద్విస: బుద్ధుడిని పూజించిన వ్యక్తికి,

ప్రభుపాద: అవును?

మధుద్విస: భక్తి-గణన లో (?), వారు చెప్తారు, లేదా ఏదో విధముగా, భగవంతుడు బుద్ధునికి చేసిన కొంత భక్తి యుక్త సేవ, ఆయనకి భగవంతుడు బుద్ధుని నిర్దేశము లో ఉన్న లోకమునకు వెళ్ళడానికి ఉందా...

ప్రభుపాద: అవును. ఒక తటస్థ దశ ఉంది. ఇది లోకము కాదు. అది ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం మధ్య తటస్తముగా ఉంది కానీ మళ్ళీ ఒకరు క్రిందకు రావాలి. ఒకరు ఆధ్యాత్మిక ఆకాశం లోకి ప్రవేశించి , ఏదైనా ఆధ్యాత్మిక లోకములో తన స్థానమును తీసుకుంటే తప్ప... ఉదాహరణకు మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా. మీరు ఏదైనా లోకమునకు వెళ్ళితే తప్ప, మీరు మళ్ళీ క్రిందకు రావాలి. మీరు ఆకాశంలో అన్ని రోజులు ఎగురుతూ ఉండలేరు. అది సాధ్యం కాదు. అది తటస్థ దశ. ఇతర లోకము లో, లేదా ఈ లోకము లో, ఎగరటము. ఎంతకాలం మీరు ఎగురుతారు? మీరు ఏదైనా ఆశ్రయం తీసుకోవాలి. కానీ మీకు ఉన్నత లోకములలో లేదా ఉన్నత పరిస్థితిలో ఎటువంటి ఆశ్రయం లేకపోతే, అప్పుడు మీరు క్రిందికి రావాలి. ... అదే ఉదాహరణ తిరిగి చెప్ప వచ్చు. మీరు బాహ్య ప్రదేశంలోకి వెళితే అనుకుందాం... ఉదాహరణకు స్పుత్నిక్ వ్యక్తుల వలె, వారు కొంతకాలం వెళతారు. ప్రజలు "ఓ, ఆయన ఏక్కడకు వెళ్ళినాడు, చాలా ఎత్తైన, చాలా ఎత్తైన చోటుకు." కానీ ఆయన ఎక్కడకి వెళ్ళలేదు. ఆయన మళ్ళీ క్రింద వస్తున్నాడు. ఇది తప్పుగా చప్పట్లు కొట్టడము, "ఓ, అతడు చాలా ఎత్తుకు వెళ్ళాడు , చాలా ఎత్తుకు." అంత ఎత్తుకు వెళ్ళడము వలన ఉపయోగం ఏమిటి? మీరు తదుపరి క్షణంలో క్రిందకు వస్తున్నారు మీరు మరొక లోకము లోకి ప్రవేశించడానికి మీ దగ్గర ఎటువంటి శక్తి లేదు కనుక . కావున మీ యంత్రం, ఈ స్పుత్నిక్ లేదా ఈ విమానాలు, మీకు ఏమి సహాయం చేస్తాయి? మీరు మళ్ళీ రావాలి. కాకపోతే, మీరు ఎక్కడో అట్లాంటిక్ మహాసముద్రం లేదా పసిఫిక్ మహాసముద్రంలో పడిపోతారు, ఎవరో వెళ్లి మిమ్మల్ని తీసుకు వస్తారు. మీరు చూడండి? ఇది మీ పరిస్థితి. కాబట్టి శూన్యము అంటే ఆకాశంలో ఎగిరి గర్వముగా ఉండటము, నేను చాలా ఎత్తుకు వచ్చాను, నేను చాలా ఎత్తుకు వచ్చాను, చాలా ఎత్తుకు వచ్చాను. (నవ్వుతూ) ఆ మూర్ఖుపు వ్యక్తికి అతడు ఆ ఎత్తైన స్థితిలో ఎంతసేపు ఉండగలడో అతనికి తెలియదు. మీరు చూడండి? ఆయన క్రిందకు వస్తాడు