TE/Prabhupada 0559 - కానీ వారు మూర్ఖముగా ఆలోచిస్తారు. నేను చేసే వాటి అన్నిటికీ నేనే చక్రవర్తిని



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద: ఇది మాయ యొక్క ఆకర్షణ. ఆయన క్రిందకు దిగి రావాలి. ఒక శ్లోకము ఉంది,

ye 'nye 'ravindākṣa vimukta-māninas
tvayy asta-bhāvād aviśuddha-buddhayaḥ
āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ
patanty adho 'nādṛta-yuṣmad-aṅghrayaḥ
(SB 10.2.32)

ఇది ప్రహ్లాద మహారాజు యొక్క ప్రార్థన. ఆయన అన్నాడు, "నా ప్రియమైన ప్రభు, కమలపు కళ్ళు గలవాడా-Aravindākṣa," ye anye. కొందరు మూడవ తరగతి వ్యక్తులు, వారు ఈ భౌతిక జీవితము ముగిసింది అని చాలా గర్వంగా ఉంటారు, ఈ నిర్వాణము లేదా ఈ నిరాకార వ్యక్తులు. "Vimukta-māninaḥ. విముక్త మానినః. - వారు మాయా ప్రభావమును అధిగమించినట్లు వారు కేవలం తప్పుగా ఆలోచిస్తున్నారు. తప్పుగా. విముక్త మానినః . ఉదాహరణకు మీరు తప్పుగా అనుకుంటే నేను ఈ లాస్ ఏంజిల్స్ నగరం యొక్క యజమానిని, ఇది మీ తప్పుడు ఆలోచన కాదా? అదేవిధముగా,ఎవరైనా ఆలోచిస్తే నేను ఇప్పుడు నిర్వాణము పొందాను లేదా నేను భగవంతునిలో విలీనము అయ్యాను" మీరు అలా అనుకోవచ్చు. ఆ మాయ చాలా బలంగా ఉంది. మీరు అటువంటి తప్పుడు గౌరవము వలన చాలా గర్వముగా ఉండవచ్చు. విముక్త మానినః. భాగవతము చెప్తున్నది, tvayy asta-bhāvād aviśuddha-buddhayaḥ ( SB 10.2.32) కానీ మీ కమల పాదముల కొరకు వారు శోధించలేదు కనుక, అందుచే వారి చైతన్యము మలినాలతో ఉంది, 'నేను ఏదో ఒకటి.' అని ఆలోచిస్తూ" Aviśuddha-buddhayaḥ. "వారి బుద్ధి, చైతన్యము పవిత్రము కాలేదు." అందువలన āruhya kṛcchreṇa. "వారు చాలా తీవ్రముగా అభ్యాసం చేస్తారు." ఉదాహరణకు బౌద్ధులు లాగానే, వారు చాలా బాగా వచ్చారు... ఇప్పుడు, అభ్యాసం చేయని వారు, అది విభిన్నమైన విషయము. కానీ నియమాలు మరియు నిబంధనలు, భగవంతుడు బుద్ధుడు స్వయంగా, ఆయన చూపించాడు. ఆయన తన ప్రతిదీ వదిలి కేవలం ధ్యానం లో నిమగ్నమై ఉన్నారు. ఎవరు చేస్తున్నారు దానిని? ఎవరూ ఆ పని చేయటము లేదు. శంకరాచార్య యొక్క మొట్టమొదటి షరతు ఏమిటంటే, "మీరు మొదట సన్యాసమును తీసుకోండి, తరువాత మీరు నారాయణగా మారతామని మాట్లాడండి." ఎవరు సన్యాసమును తీసుకుంటున్నారు? కాబట్టి వారు కేవలం తప్పుగా ఆలోచిస్తున్నారు. వాస్తవమునకు, వారి బుద్ధి మలినాలతో ఉంది, చైతన్యము అపవిత్రం. అందువల్ల అటువంటి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఫలితము, āruhya kṛcchreṇa param, వారు చాలా ఎత్తుకు వెళ్ళినప్పటికీ, ఉదాహరణకు 25,000 మైళ్ళు లేదా మిలియన్ల మైళ్ళు పైకి, చంద్ర లోకము ఎక్కడ ఉంది, అక్కడ ఎటువంటి ఆశ్రయము పొంద లేదు. వారు మళ్లీ మీ మాస్కో నగరానికి తిరిగి వచ్చారు, అంతే. లేదా న్యూయార్క్ నగరమునకు, అంతే. ఇవి ఉదాహరణలు. వారు ఎత్తయిన ప్రదేశములో ఉన్నప్పుడు, వారు ఛాయాచిత్రం తీసుకుంటారు. ఓ, ఈ లోకము ఇలా ఉంది, ఈ భూమిపై లోకము ఆకుపచ్చగా లేదా చాలా చిన్నదిగా ఉన్నది. నేను పగలు మరియు రాత్రి చుట్టూ తిరుగుతున్నాను. ఒక గంటలో మూడు సార్లు పగలు మరియు రాత్రిని చూస్తున్నాను." అది సరే, చాలా బాగుంది. దయచేసి మళ్లీ క్రిందకు రండి. (నవ్వుతూ) అంతే. మాయ చాలా బలంగా ఉంది, ఆమె చెప్తుంది, "అవును, చాలా బాగుంది, మీరు చాలా ఉన్నత స్థానమునకు వచ్చారు మీ శాస్త్రీయ జ్ఞానములో, కానీ దయచేసి క్రిందకు రండి. ఇక్కడకు రండి. లేకపోతే మీరు అట్లాంటిక్ మహా సముద్రంలో ఉంచబడతారు." అంతే. అయినప్పటికీ వారు ఇంకా గర్వముగా ఉంటారు, ", మనము పురోగతి పొందుతున్నాము వచ్చే పది సంవత్సరాలలో, టికెట్ కొనుగోలు చేయవచ్చు లేదా మీరు చంద్రుని భూమి పై దిగవచ్చు. " రష్యాలో వారు భూమిని విక్రయించారు, వారు "మాస్కో సముద్రం ఉంది" అని వారు ప్రచారం చేశారు. మనము ఆ సముద్రంలో మన జెండాను నాటాము... " కాబట్టి ఇవి ప్రచారము చేస్తున్నారు. ఆధ్యాత్మిక ఆకాశం గురించి ఏమి మాట్లాడుతాము. వారు సమీప గ్రహానికి కూడా వెళ్ళలేరు. ఆధ్యాత్మిక ఆకాశం వైకుంఠ లోకమునకు వెళ్లడానికి వాస్తవమునకు మీరు తీవ్రముగా ఉంటే, అప్పుడు ఈ సులభమైన పద్ధతి, హరే కృష్ణని తీసుకోండి. అంతే.

అతిధి: నేను నాస్తికత్వంపై ఆసక్తి కలిగి ఉన్నాను.

ప్రభుపాద: (వినకుండా లేదా అతిధిని గమనించకుండా) ఇది భగవంతుడు చైతన్య బహుమతి. Namo mahā-vadānyāya.. అందువల్ల రూప గోస్వామి చెప్తాడు, "మీరు దానములు చేసే వారందరిలో కంటే మీరు గొప్పవారు ఎందుకంటే మీరు గొప్ప వరాన్ని ఇస్తున్నారు. "Kṛṣṇa-prema-pradāya te ( CC Madhya 19.53) మీరు కృష్ణుడి ప్రేమను ఇస్తున్నారు, ఇది నన్ను కృష్ణుడి రాజ్యమునకు తీసుకు వెళ్తుంది. ఇది మానవ సమాజానికి గొప్ప బహుమానం. కానీ బుద్ధిహీనులు వారు అర్థం చేసుకోలేరు. నేను ఏమి చెయ్యగలను? Daivī hy eṣā guṇamayī ( BG 7.14) మాయా చాలా బలంగా ఉంది. మనము చెప్పితే "ఇక్కడ ఒక చిన్న పుస్తకము, ఇతర గ్రహాలకి సులభ ప్రయాణం" అని, వారు దానిని తీసుకోరు. వారు స్పుత్నిక్ల ద్వారా ఇతర లోకములకు ఎలా వెళ్ళాలో ప్రణాళిక చేస్తారు, ఇది అసాధ్యం. మీరు ఎక్కడికీ వెళ్లలేరు. ఇది మన బద్ధ జీవితము. బద్ధ జీవితము అంటే మీరు ఇక్కడే తప్పకుండా ఉండవలెను. మీరు ఇక్కడే తప్పకుండా ఉండవలెను ఎవరు ఇతర లోకమునకు వెళ్ళడానికి మీకు అనుమతి ఇస్తున్నారు? మీ దేశమునకు వచ్చేందుకు, శాశ్వత వీసా తీసుకోవటానికి, నేను చాలా పోరాడవలసి వచ్చింది, మీరు చంద్ర లోకము వెళ్తున్నారు? ఏ వీసా లేదా? వారు మీరు ప్రవేశించడానికి మాత్రమే అనుమతిస్తారా? ఇది చాలా సులభమైనదా? కానీ వారు మూర్ఖముగా ఆలోచిస్తారు. సరళముగా చెప్పితే "నేను చేసే వాటి అన్నిటికీ నేనే చక్రవర్తిని." అంతే. ఈ లోకము రాజు, అన్ని ఇతర లోకములు అవి అన్నీ సేవకులుగా ఉన్నాయి. అవి మన ఇంద్రియాలను సంతృప్తి పరచుతాయి. ఇది మూర్ఖత్వం. సరే. హరే కృష్ణ జపము చేయండి.