TE/Prabhupada 0561 - దేవతలు అంటే దాదాపు భగవంతుడు అని అర్థం. వారికి అన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. చంద్రునిపై ప్రజలు ఉన్నారని మీరు చెబుతున్నారా?

ప్రభుపాద: అవును, విలేఖరి: ఉన్నారు. వారు దేవతలా?

ప్రభుపాద: అవును.

విలేఖరి: వారు దేవతలు. మీకు ఇది ఎలా తెలుసు?

ప్రభుపాద: మా శాస్త్రము ద్వారా, వైదిక సాహిత్యం ద్వారా.

విలేఖరి: ఏ సాహిత్యము నుండి?

ప్రభుపాద: వైదిక సాహిత్యము.

విలేఖరి: దాన్ని మీరు ఎలా ఉచ్చరిస్తారు?

ప్రభుపాద: v-e-d-i-c.

విలేఖరి: ఓ,వేదిక్. మీరు నన్ను క్షమించాలి.

ప్రభుపాద: అవును.

విలేఖరి: మీరు నన్ను క్షమించాలి ఒకవేళ నేను, నేను అడగాలి....

ప్రభుపాద: అది సరే, అది కాదు....

విలేఖరి: నేను మీ పట్ల అపరాధము చేయాలని అనుకోవడం లేదు.

ప్రభుపాద: కొన్నిసార్లు నేను మీ యాసను అనుసరించలేను.

విలేఖరి: నాకు తెలుసు.

ప్రభుపాద: అది దేశము యొక్క తేడా. అది పట్టింపు లేదు. అవును.

విలేఖరి: ఆ సాహిత్యము నుండి, వైదిక సాహిత్యము నుండి, అది చెప్పబడింది, చంద్రనిపై ప్రజలు ఉన్నారు.

ప్రభుపాద: ఓ అవును.

విలేఖరి: కానీ వారు దేవతలు.

ప్రభుపాద: దేవతలు అంటే మనుషుల కన్నా బాగా అభివృద్ధి చెందిన వారు. అందువల్ల.... వారు కూడా మనలాంటి జీవులు, కానీ వారి జీవిత కాలము, వారి జీవన ప్రమాణాలు, వారి నాగరికత, ఆధ్యాత్మిక జ్ఞానం, చాలా అభివృద్ధి చెందింది అందువల్లే వారు దేవతలుగా పిలువబడ్డారు. దాదాపు భగవంతుడు. వారు చాలా అభివృద్ధి చెంది ఉన్నారు.దేవతలు అంటే దాదాపు భగవంతుడు అని అర్థం. వారికి అన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి, వారు వాతావరణ వ్యవహారాలను నియంత్రిస్తారు. వారిలో కొందరు వర్షాకాలాన్ని నియంత్రిస్తారు, వారిలో కొందరు వేడిని నియంత్రిస్తారు. మీకు ఇక్కడ నియంత్రకుడు వున్నట్లుగా, ఒక శాఖకు శాఖాధికారి, శాఖకు అధికారి, అదే విధముగా మీరు ఎందుకు ఆలోచించరు ఈ విశ్వ సాక్షాత్కారం, దాని వెనుక ఒక గొప్ప మెదడు ఉంది వివిధ అధికారులు ఉన్నారు మరియు నిర్వహణ ఉంది. ప్రజలు దీనిని అంగీకరించరు. ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటి? ఇటువంటి మంచి విషయాలు, ఇటువంటి అద్భుతమైన విషయాలు సహజంగా జరుగుతున్నాయి, ఏ నియంత్రణా లేకుండా? మీరు చూడండి?

విలేఖరి: సరే, నాకు తెలుసు అది ఒక ప్రశ్న, నేను ఊహిస్తున్నాను, ఒకరు తమను తాము ఎల్లప్పుడూ అడుగుతుంటారు. ఇది తనను తాను కనుగొను మనిషి అన్వేషణలో భాగం.

ప్రభుపాద: కానీ మీరు ఒక స్ఫుట్నిక్ ను గాలిలో తెలేటట్లు ప్రయత్నిస్తున్నారు, వారికి విచక్షణ వుండాలి. చాలా శాస్త్రీయ మెదళ్ళు పని చేస్తున్నాయి. మరియు లోకములు అనబడే మిలియన్ల అద్భుత స్ఫుట్నిక్ లు, అవి గాలిలో తేలుతున్నాయి, దాని వెనుక ఎటువంటి మెదడు లేదు. ఇది ఏమిటి? ఇది చాలా మంచి తర్కమా?

విలేఖరి: నాకు తెలియదు. నేను దాని గురించి ఆలోచించాలి.

ప్రభుపాద: మీరు తెలుసుకోవాలి. ఇది ఎలా వీలు అవుతుంది దాని వెనుక చాలా గొప్ప మెదడు ఉండాలి. వారు పని చేస్తున్నారు.

విలేఖరి: మీరు అంటున్నారా చంద్రుడు, కాబట్టి చెప్పాలంటే....? నేను ఏమి చెప్పాలి? నివాసము ఉండే ప్రదేశము ఈ దేవతలు ఎక్కడ నివసిస్తారో?

ప్రభుపాద: లేదు, అదే స్థాయిలో అనేక లోకములు ఉన్నాయి. అనేక లోకములు ఉన్నాయి. చంద్రుడు వారిలో ఒకటి.

విలేఖరి: ఈ దైవతలలో ఎవరైనా భూమిని సందర్శించారా లేక.....

ప్రభుపాద: పూర్వము చేసేవారు ఎందుకంటే ఆ కాలంలో జనులు వారిని చూచుటకు అర్హత కలిగి ఉండేవారు. మీరు చూడండి?

విలేఖరి: మీరు గతంలో అని చెప్పినప్పుడు, మీ ఉద్దేశ్యం వేలాది సంవత్సరాల క్రితమా లేక...

ప్రభుపాద: లేదు. కనీసం అయిదు వేల సంవత్సరాల క్రితం చివరిసారిగా ఏమైనా, మనం చేస్తాం....

విలేఖరి: కనీసం అయిదు వేల సంవత్సరాల క్రితం చివరిసారిగా ఏమైనా, మనం చేస్తాం.... వారు మానవరూపంలో ఉన్నారా?

ప్రభుపాద: అవును. మాకు తెలిసిన సమాచారం వరకు, కొన్నిసార్లు గొప్ప యజ్ఞాలు చేసినారు, ఇతర లోకముల నుండి దేవతలు, వారు ఆహ్వానించబడ్డారు, వారు వచ్చేవారు.

విలేఖరి: ఎక్కడ....? ఎక్కడ......? ఇది.... మీ ప్రకటన యొక్క ప్రామాణికత వైదిక సాహిత్యములో ఉన్నదా?

ప్రభుపాద: అవును.

విలేఖరి: అలాగా. అలాగా.

ప్రభుపాద: ఇది నేను తయారు చేయలేదు.

విలేఖరి: ఓ, నాకు తెలుసు! కాదు! నేను సూచించుట లేదు. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ.....