TE/Prabhupada 0605 - వాసుదేవుడిని ప్రేమించండి అప్పుడు భౌతిక శరీరముతో సంబంధమునకు ఇంక ఏ అవకాశము లేదు



Lecture on SB 5.5.6 -- Vrndavana, October 28, 1976


కానీ అంతిమ లక్ష్యం వాసుదేవుడు. Prītir na yāvan mayi vāsudeve. ఇది అంతిమ లక్ష్యం. మీరు ఈ దశకు రావాలి, vāsudeva sarvam iti,, పూర్తిగా, ధృడముగా నమ్మాలి " వాసుదేవుడు నా జీవితము, వాసుదేవుడు ప్రతిదీ." కృష్ణుడు నా జీవితం. వృందావనము వాతావరణంలో ముఖ్యంగా గోపికల దగ్గర అత్యధిక పరిపూర్ణత కనిపిస్తుంది. వృందావనములో ఉన్న ప్రతి ఒక్కరు, చెట్లు, మొక్కలు అయినప్పటికీ, ఇసుక రేణువులు కూడా, ప్రతి ఒక్కరూ కృష్ణుడికి ఆకర్షించబడ్డారు. ఇది వృందావనం. కాబట్టి అకస్మాత్తుగా మనము వృందావనము మీద ఆసక్తి ఉన్న జీవన స్థాయిని పొందలేము, కాని అయినప్పటికీ, మనం ఎక్కడ ఉన్నా, మనము ఈ భక్తి-యోగ సాధన చేస్తే, మనము ప్రచారము చేస్తుంటే... ఇది విజయవంతమవ్వుతుంది. ప్రజలు తీసుకుంటున్నారు. మ్లేచ్ఛులు మరియు యవనులు అని పిలవబడే వారు కూడా వాసుదేవుడిని తీసుకుంటున్నారు. కృష్ణుడికి పట్ల వారి ప్రేమ పెరుగుతోంది. అది సహజమైనది. ఇది చైతన్య-చరితామృతంలో చెప్పబడినది, nitya siddha kṛṣṇa bhakti. Nitya siddha. ఉదాహరణకు నేను , లేదా మీరు, మనము శాశ్వతము. Nityo śāśvato 'yam na hanyate hanyamāne śarīre ( BG 2.20) శరీరము నాశనం ఆవడము ద్వారా మనము నాశనం చేయబడము. మనము మిగిలి ఉంటాము, కొనసాగుతాము. అదేవిధముగా, కృష్ణుడికి మన భక్తి కొనసాగుతుంది. ఇది కేవలం కప్పబడింది Avidyayātmāny upādhiyamāne. అవిద్య. ఇది అవిద్య. కృష్ణుడిని మనము మర్చిపోయాము, అది అవిద్య. కృష్ణుడిని మన జీవిత పరమార్ధముగా తీసుకుంటే వెంటనే, అది విద్య. నువ్వు చేయగలవు. ఎవరైనా చాలా సులభంగా చేయవచ్చు. అందుచేత కృష్ణుడు sarva dharmān parityajya mam ekam śaraṇaṁ ( BG 18.66) ఎందుకు? ఏదైనా ఇతర మత పద్ధతి అని పిలవబడేది దానిని అవిద్య అంటారు - అజ్ఞానంలో మిమ్మల్ని ఉంచుతుంది. అక్కడ కాంతి లేదు. వేదముల ఉత్తర్వు ఏమిటంటే, "అజ్ఞానం యొక్క చీకటిలో మిమ్మల్ని ఉంచుకోకండి." Tamasi mā jyoti gamaḥ.

ఆ జ్యోతి అంటే కృష్ణుడిని ప్రేమిస్తారని అర్థం. కృష్ణుడి ప్రేమ వ్యవహారాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి. అది జ్యోతి, jyotirmāyā dhāma, ఆత్మ ప్రకాశవంతముగా ఉండుట. Yasya prabhā prabhavato jagad-aṇḍa-koti (Bs. 5.40). అక్కడ చీకటి లేదు. ఉదాహరణకు సూర్యుడిలో చీకటి అనే ప్రశ్నే లేదు. ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. మనము జ్యోతి అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సూర్య గ్రహములో చీకటి లేదని మనం చూడవచ్చు. అది అంతా మెరుస్తూ ప్రకాశవంతముగా ఉంది అదేవిధముగా, ఆధ్యాత్మిక ప్రపంచంలో అజ్ఞానం లేదు. ప్రతి ఒక్కరూ శుద్ధ సత్వ. సత్వ-గుణము మాత్రమే కాక, శుద్ధ సత్వ కూడా. Sattvaṁ viśuddhaṁ vāsudeva-śabditaḥ. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, మూడు గుణాలు, సత్వ గుణము, రజో-గుణము, తమో-గుణము ఉన్నాయి. కాబట్టి ఈ గుణాలల్లో ఏదీ పవిత్రమైనది కాదు. మిశ్రమం ఉంది. మిశ్రమం ఉండటం వలన, అందువలన మనము చాలా రకాలను చూస్తాము. కాని మనము సత్వ గుణము యొక్క స్థితికి రావలసి ఉంది. ఆ పద్ధతి శ్రవణము. ఇది ఉత్తమ పద్ధతి. Śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) మీరు నిత్యము శ్రీమద్-భాగవతం వింటూ ఉంటే ... అందువలన మనము నొక్కి చెబుతున్నాము: "ఎల్లప్పుడూ వినండి, ఎల్లప్పుడూ చదవండి, ఎల్లప్పుడూ వినండి." Nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) Nitya. మీరు నిరంతరము చేయగలిగితే, ఇరవై నాలుగు గంటలు, మీరు శ్రవణము మరియు కీర్తన చేస్తే శ్రవణము అంటే ఎవరైనా కీర్తన చేస్తారు లేదా మీరు కీర్తన చేయండి లేదా శ్రవణము చేయoడి, లేదా మీ సహచరుడు ఎవరైనా కీర్తన చేస్తే, మీరు వినవచ్చు. లేదా ఆయన వింటాడు, మీరు కీర్తన చేయవచ్చు. ఈ పద్ధతి కొనసాగాలి. ఇది śrāvaṇaṁ kīrtanaṁ viṣṇoḥ. Viṣṇoḥ ( SB 7.5.23) అది భాగవతము. ఏ ఇతర అర్థంలేని మాటలు కాదు, పుకారులు కాదు కేవలం శ్రవణము మరియు కీర్తన చేయండి. అప్పుడు śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇa. మీరు తీవ్రముగా శ్రవణము మరియు కీర్తన చేస్తే అవును, ఈ జీవితము నేను వాసుదేవుడు మీద నా ప్రేమను పెంచుకోవడానికి మాత్రమే నిమగ్నము చేస్తాను - మీరు ధృడముగా నిశ్చయించుకుంటే, అది చేయవచ్చు. ఇబ్బంది లేదు. మీరు ఇలా చేసిన వెంటనే, మీరు వాసుదేవుడి మీద మీ ప్రేమను పూర్తిగా పెంచుకుంటారు, అప్పుడు భౌతిక శరీరముతో సంబంధమునకు ఇంక ఏ అవకాశము లేదు.

janma karma ca divyam
me yo janati tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti...
(BG 4.9)

అదే విషయము.

మీరు కృష్ణుడిని అర్థం చేసుకోకపోతే, మీరు కృష్ణుడి మీద మీ సహజ ప్రేమను పెంచుకోకపోతే, అప్పుడు na mucyate deha-yogena tāvat. అవకాశం లేదు. వారికి అవకాశం లేదు. మీరు చాలా గొప్ప ధనవంతుల కుటుంబములో తరువాత జన్మ తీసుకోవచ్చు, ఒక బ్రాహ్మణుల కుటుంబములో, yogo-bhraṣṭaḥ,, కాని అది కూడా విడుదల కాదు. మళ్ళీ మీరు పతనము అవ్వచ్చు. మనము చూస్తున్నట్లుగా చాలా మంది ఉన్నారు ... ఉదాహరణకు మీరు అమెరికన్ల లాగానే, మీరు ధనవంతుల కుటుంబములో, ధనము కలిగిన దేశములో జన్మించారు, కాని పతనమవుతున్నారు. హిప్పీలు అయ్యారు. పతనమవుతున్నారు. కాబట్టి అవకాశం ఉంది. ఇది హామీ ఇవ్వబడలేదు. ఎందుకంటే నేను గొప్ప కుటుంబం లేదా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను కనుక, అది నాకు హామీగా ఉంది. హామీ లేదు. ఈ మాయ చాలా బలంగా ఉంది, అది మిమ్మల్ని లాగటానికి మాత్రమే ప్రయత్నిస్తుంది - మిమ్మల్ని పతనము చేస్తుంది, నిన్ను పతనము చేస్తుంది. చాలా ప్రభావాలు కలవు. కాబట్టి మనము కొన్నిసార్లు చుస్తాము ఈ అమెరికన్లు, వారు అదృష్టవంతులుగా ఉన్నారు వారు పేదరికం లేని దేశంలో జన్మించారు, అక్కడ కొరత లేదు. కాని అయినప్పటికీ, నాయకులు దుష్టులు అవటము వలన, వారు ఏర్పాటు చేశారు మాంసం తినడం, అక్రమ మైథున సుఖము, మత్తు, మరియు జూదం ఆడటము. ప్రకటనలు. నగ్నమైన స్త్రీలతో ప్రకటనలు ఇవ్వడము , ఏమంటారు అంటే,ఆవు మాంసమును తీనేవారు మరియు మద్యము ప్రచారము చేస్తారు. ఇది జరుగుతోంది. సిగరెట్ల గురించి ప్రకటనలు చేయడము, వారిని మళ్ళీ పతనము చేయడానికి. నరకానికి వెళ్ళటానికి. Punar mūṣika bhava. వారికి తెలియదు వారిని పతనము చేస్తుంది ఎంతటి ప్రమాదకరమైన నాగరికతో వారికి తెలియదు. కాబట్టి కొన్నిసార్లు వృద్ధులలో కొంత వివేకము ఉన్నవారు, వారు నా దగ్గరకు వస్తారు, వారు నాకు వారి కృతజ్ఞతలు తెలుపుతారు: స్వామీజీ, మీరు మా దేశంలోకి రావడము మా యొక్క గొప్ప అదృష్టము. వారు అంగీకరిస్తున్నారు. అవును, అది సత్యము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఒక గొప్ప అదృష్టము ఉన్న ఉద్యమం. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, ఇది వాస్తవం.

కాబట్టి తీసుకున్న వారు, చాలా తీవ్రముగా తీసుకోండి. కృష్ణుడి పట్ల మీ ప్రేమను పెంచుకోండి. Prītir na yāvan mayi vāsudeve na mucyate deha yogena... వారికి వాస్తవ జీవిత సమస్య ఏమిటో తెలియదు. జీవితం యొక్క వాస్తవమైన సమస్య దేహ-యోగ, ఈ విదేశీ శరీరము. మనము ఒక సమయమున అంగీకరిస్తున్నాము, bhūtvā bhūtvā pralīyate ( BG 8.19) ఒక రకమైన శరీరాన్ని అంగీకరిస్తున్నాము. అందువల్ల వారు ఈ మూర్ఖులు, యూరప్ మరియు అమెరికాలో ఉన్న నాయకులు, వారు జన్మ లేదని నిర్ధారించారు. అంతే. ఎందుకంటే వారు మరణించిన తర్వాత జన్మ ఉంటుందని అంగీకరిస్తే, వారికి అది భయంకరముగా ఉంటుంది. కాబట్టి వారు తిరస్కరించారు: "లేదు, జన్మ లేదు." గొప్ప గొప్ప వారు అని పిలవబడే ప్రొఫెసర్లు, జ్ఞానము కలిగిన పండితులు, వారు మూర్ఖంగా మాట్లాడతారు: స్వామీజీ, ఈ శరీరం పూర్తయిన తర్వాత, ప్రతిదీ ముగుస్తుంది. అది వారి నిర్ధారణ. శరీరం పొరపాటున వస్తుంది, kim anyat kāma-haitukam. Asatyam apratiṣṭhaṁ te jagad āhur anīśvaram ( BG 16.8)

కాబట్టి, ఈ రకమైన నాగరికత చాలా ప్రమాదకరము. చాలా చాలా ప్రమాదకరమైనది. కాబట్టి కనీసము కృష్ణ చైతన్యమునకు వచ్చిన వారు, వారు ఉండాలి ఈ ప్రమాదకరమైన నాగరికత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు బాధపడుతున్నారు. కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకోండి మరియు సంతోషముగా మరియు సంపూర్ణముగా ఉండండి.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద. (ముగింపు)