TE/Prabhupada 0638 - అది మొదటి తరగతి యోగి, ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు



Lecture on BG 2.30 -- London, August 31, 1973


అందుకే ఆయన ప్రతి దానిలోనూ కృష్ణుని మాత్రమే చూస్తాడు Premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti (Bs. 5.38). Sadaiva. వారు కొన్నిసార్లు "మీరు భగవంతుణ్ణి చూశారా?" అని అడుగుతారు వాస్తవానికి భక్తులు అయిన వారు, ఉన్నతమైన భక్తులు, వారు కేవలం కృష్ణుడిని చూస్తారు, మరొక దానిని కాదు Premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu (Bs. 5.38). Sadaiva అంటే ఎల్లప్పుడూ Hṛdayeṣu vilokayanti. Yaṁ śyāmasundaram acintya-guṇa-svarūpaṁ govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. కాబట్టి ఇది... కృష్ణ చైతన్యములో మీరు ఉన్నత స్థానమునకు ఎంత ఎదిగితే అంత , మీరు కేవలం కృష్ణుడిని చూస్తారు మీరు కృష్ణుని ఎల్లప్పుడూ చూడాడానికి సాధన చేస్తే, sadā tad-bhāva-bhāvitaḥ... Yaṁ yaṁ vāpi smaran loke tyajaty ante kalevaram ( BG 8.6) Yad yad bhāvam. మీరు ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటే... అది కూడా కృష్ణుడి ఉపదేశము. Manmanā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) "ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి." అది మొదటి తరగతి యోగి, ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు Yoginām api sarveṣāṁ, mad-gatenāntar-ātmanā, bhajate yo māṁ, sa me yuktatamo mataḥ ( BG 6.47) ఆయన మొదటి తరగతి యోగి. మరియు భక్తుడు. మనము ఇప్పటికే... లేకపోతే, ఎందుకు ఆయన కృష్ణుడి గురించి ఆలోచించాలి? Man-manā bhava mad-bhakto mad-yājī. ఒకటి, భక్తులు మాత్రమే కృష్ణుడి గురించి ఆలోచించగలరు. Man-manā bhava mad-bhakto mad-yājī. మీరు నా భక్తుడు కనుక మీ కర్తవ్యము ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించడం. ఇది చాలా కష్టమైన పనా? మీరు కృష్ణుడిని ఈ దేవాలయంలో చూస్తున్నారు. కృష్ణుని ఎంత ఎక్కువుగా మీరు చూస్తే, కృష్ణా కృష్ణా కృష్ణా, ఇరవై నాలుగు గంటలు కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉంటే మీరు ఎప్పుడూ కృష్ణుడిని చూడడానికి సాధన చేస్తారు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. మీరు ఒక క్షణం కూడా కృష్ణుడిని మర్చిపోలేరు.అది ఉపదేశము. Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) ఈ నాలుగు విషయాలు. ఆలయంలో అర్చా మూర్తి ఉన్నప్పుడు, మీరు చూస్తారు మీరు మనస్సులో గుర్తుంచుకుంటారు కృష్ణుని మీద ప్రేమను మీరు అభివృద్ధి చేసుకున్నట్లయితే , ఆలయం బయట ఉన్న కూడా మీ హృదయంలో కృష్ణుని చూడవచ్చు. లేకపోతే, అధికారికముగా , మీరు ఆలయానికి వచ్చి మరియు వెనువెంటనే... ఆందోళన, నన్ను మరచిపోనివ్వండి. అది మరొక విషయము కానీ మొత్తం పద్ధతి కృష్ణుని మీద ప్రేమను అభివృద్ధి చేసుకోవడానికి ఉద్దేశించబడింది. Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) Bhaktir adhokṣaje. ఇది మొదటి తరగతి ధర్మ పద్ధతి. ఇది మొదటి-తరగతి ధర్మ పద్ధతి. ఈ కృష్ణ చైతన్యము మొదటి తరగతి, అత్యుత్తమ ధర్మ పద్ధతి. ఎందుకు? కృష్ణుడిని , భగవంతుడిని గురించి ఎల్లప్పుడూ ఆలోచించడమును ప్రజలకు నేర్పుతుంది ప్రేమించడము. ఆలోచించడం మాత్రమే కాదు. మనము ఎవరినైనా ప్రేమించక పోతే వారి గురించి ఆలోచించలేము మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే, మీరు ఆయన గురించి ఎల్లప్పుడూ ఆలోచించవచ్చు. ఉదాహరణకు ప్రేమికుడు మరియు ప్రేమించబడిన వారి వలె. ఒక అబ్బాయి, మరొక అమ్మాయి. వారు ప్రేమలో ఉన్నారు. కాబట్టి వారిద్దరూ , వారి ఇద్దరూ గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు మనం తిరిగి ఎప్పుడు కలుసుకుంటాము, మళ్లీ మనం కలిసేది ఎప్పుడు? అదేవిధముగా,man-manā bhava mad-bhaktaḥ. మీరు కృష్ణుని భక్తునిగా మారండి, మీరు కృష్ణుని గురించి ఆలోచించ వచ్చు మీరు కృష్ణుని మీద ప్రేమను అభివృద్ధి చేసుకుంటే కనుక. Premāñjana-cchurita-bhakti-vilocanena (Bs. 5.38). భక్తితో, మీరు కృష్ణుని పట్ల మీ ప్రేమను అభివృద్ధి చేసుకోవచ్చు. అది అవసరం.