TE/Prabhupada 0655 - మతము యొక్క ప్రయోజనము దేవుడిని అర్థం చేసుకోవటము దేవుడిని ఎలా ప్రేమించాలో తెలుసుకోవడము



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969

భక్తుడు: "ఈ భగవద్గీత కృష్ణ చైతన్యము యొక్క విజ్ఞాన శాస్త్రం. కేవలం ప్రాపంచిక పాండిత్యము ద్వారా ఎవరు కృష్ణ చైతన్య వంతులు కాలేరు."

ప్రభుపాద: అవును. మీరు కొన్ని డిగ్రీలు పొందారు కనుక: M.A., Ph.D., D.A.C., మీరు భగవద్గీతని అర్థం చేసుకుంటారు, అది సాధ్యం కాదు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది అర్థం చేసుకోవడానికి వేరే భావన అవసరం. మీరు అ భావనను తయారు చేసుకోవాలి, మీరు సేవను చేయడము ద్వారా పవిత్రము అవ్వాలి. లేకపోతే, చాలామంది వైద్యులు Ph.D లు వలె గొప్ప విద్వాంసులు కూడా, వారు కృష్ణుడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారు అర్థం చేసుకోరు. ఇది సాధ్యం కాదు. అందువలన కృష్ణుడు స్వయంగా యధాతథముగా వస్తారు. Ajo 'pi sann avyayātmā ( BG 4.6) ఆయన జన్మించక పోయినప్పటికీ, దేవుడు ఎలా ఉన్నాడో మనము తెలుసుకునేందుకు ఆయన వచ్చాడు, మీరు చూడండి? చదవటము కొనసాగించండి.

భక్తుడు: "పవిత్రమైన చైతన్యంతో ఉన్న వ్యక్తి సాంగత్యము తీసుకోవటానికి తగినంత అదృష్టం ఉండాలి. కృష్ణుడి యొక్క కృపతో కృష్ణ చైతన్య వ్యక్తి సాక్షాత్కార జ్ఞానమును కలిగి ఉంటాడు. "

ప్రభుపాద: అవును, కృష్ణుడి కృపతో. విద్యాపరమైన అర్హతతో కాదు. మీరు... మీరు కృష్ణుడి యొక్క దయను పొందాలి, అప్పుడు మనము కృష్ణుడిని అర్థం చేసుకోగలము. అప్పుడు మనము కృష్ణుడిని చూడవచ్చు. అప్పుడు మనము కృష్ణుడితో మాట్లాడవచ్చు, అప్పుడు మనము అన్నింటినీ చేయవచ్చు. ఆయన ఒక వ్యక్తి. ఆయన మహోన్నతమైన వ్యక్తి. అది వేదముల ఉత్తర్వు. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఆయన మహోన్నతమైన వ్యక్తి, లేదా మహోన్నతమైన శాశ్వతము. మనము అందరము శాశ్వతమైనవారము. మనం... ఇప్పుడు మనము ఈ శరీరంలో ఉంచబడ్డాము. మనము జన్మను మరియు మరణమును కలుస్తున్నాము. కాని వాస్తవానికి మనకు జన్మ మరియు మరణం లేదు. మనము శాశ్వతమైన ఆత్మ. నా పని ప్రకారం, నా కోరిక ప్రకారం, నేను ఒక రకమైన శరీరము నుండి, మరొక శరీరమునకు, మరొక శరీరమునకు వెళ్ళుతున్నాను ఇది జరుగుతోంది. వాస్తవమునకు నాకు జన్మ మరియు మరణం లేదు. ఇది రెండవ అధ్యాయములో భగవద్గీతలో వివరించబడింది మీరు చదివారు: na jāyate na mriyate vā. జీవి ఎన్నటికి జన్మించడు లేదా చనిపోడు. అదే విధముగా, దేవుడు కూడా శాశ్వతమైనవాడు, మీరు కూడా శాశ్వతమైవారు. మీరు శాశ్వతమైన, పూర్తిగా శాశ్వతమైన వానితో మీ శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పర్చుకున్నప్పుడు ... Nityo nityānāṁ cetanaś cetanānām. ఆయన జీవులలో మహోన్నతమైన జీవి ఆయన శాశ్వతమైన వారిలో మహోన్నతమైన శాశ్వతమైనవాడు.

కాబట్టి, కృష్ణ చైతన్యము ద్వారా, మీ ఇంద్రియాలను పవిత్రము చేసుకుంటే, ఈ జ్ఞానం వస్తుంది మీరు దేవుణ్ణి చూస్తారు.చదవడము కొనసాగించండి.

భక్తుడు: కృష్ణుడి యొక్క కృపతో కృష్ణ చైతన్య వ్యక్తి సాక్షాత్కార జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, ఎందుకంటే ఆయన పవిత్రమైన భక్తియుక్త సేవలతో సంతృప్తి చెందాడు. సాక్షాత్కార జ్ఞానం ద్వారా, వ్యక్తి సంపూర్ణమవుతాడు. అటువoటి పరిపూర్ణ జ్ఞానం ద్వారా ఆయన తన నమ్మకాలలో స్థిరంగా ఉంటాడు, కాని భౌతిక విద్య పరమైన జ్ఞానం ద్వారా చాలా సులభముగా భ్రాంతి చెందుతాడు. కనబడుతున్న వైరుధ్యాలతో అయోమయంగా ఉంటాడు. వాస్తవానికి ఆత్మ-సాక్షాత్కారము పొందిన వ్యక్తి మాత్రమే ఆత్మ నియంత్రణ కలిగి ఉంటాడు , ఎందుకంటే ఆయన కృష్ణుడికి శరణాగతి పొందుతాడు. ఆయన ఆధ్యాత్మికము ఎందుకంటే ఆయనకు లౌకిక పాండిత్యముతో ఎటువంటి సంబంధం లేదు

ప్రభుపాద: అవును. ఒక వ్యక్తి నిరక్షరాస్యుడైనా కూడా , ఆయనకు ABCD తెలియక పోయినా ఆయన దేవుణ్ణి గ్రహించగలడు, ఆయన విధేయతతో ప్రేమపూర్వక ఆధ్యాత్మిక సేవలో తాను నిమగ్నమయితే. ఒక వ్యక్తి చాలా జ్ఞానము కలిగి ఉండవచ్చు, కానీ ఆయన దేవుణ్ణి గ్రహించలేడు. దేవుడు ఏ భౌతిక పరిస్థితి యొక్క అధీనములో ఉండడు. ఆయన మహోన్నతమైన ఆత్మ. అదేవిధముగా, దేవుడిని తెలుసుకునే పద్ధతి ఏ విధమైన భౌతిక పరిస్థితుల అధీనములో ఉండదు. మీరు పేదవారు కనుక మీరు దేవుణ్ణి గ్రహించలేరు అని కాదు. లేదా మీరు చాలా ధనవంతుడు కనుక, మీరు అందువలన మీరు దేవుణ్ణి గ్రహించగలరు. లేదు మీరు నిరక్షరాస్యులు కనుక , మీరు దేవుణ్ణి గ్రహించలేరు, లేదు, అది కాదు. మీరు బాగా చదువుకున్నందున, మీరు దేవుణ్ణి గ్రహించగలరు. లేదు, అది కాదు. ఆయన బేషరతుగా ఉంటారు. Apratihatā. Sa vai puṁsāṁ paro dharmaḥ. భాగవతములో ఇది మొదటి తరగతి మత సూత్రముగా చెప్పబడినది.

భాగవతములో ఈ హిందూ ధర్మము మొదటి తరగతి అని ప్రస్తావించలేదు, లేదా క్రిస్టియన్ మతము మొదటి తరగతి, లేదా మొహమ్మదియన్ మతముము మొదటి తరగతి, లేదా ఏ ఇతర మతము ఏదైనా. మనం చాలా చాలా మతములు సృష్టించాము. కాని భాగవతము చెప్తుంది, ఆ మత సూత్రం మొదటి తరగతిది.ఏది? Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) మీ మతమైతే మీ సేవను మరియు దేవుడు మీద ప్రేమను ఉన్నత స్థానమునకు తీసుకువెళ్ళడానికి సాధించుటకు మీకు సహాయపడుతుందో దానిని మతము అని అంటారు. అంతే. ఇది మొదటి తరగతి మతము యొక్క నిర్వచనం. ఈ మతము మొదటి తరగతి, అ మతము చివరి తరగతి అని మనం విశ్లేషించము అయితే వాస్తవానికి, నేను మీకు చెప్పినట్లుగా, భౌతిక ప్రపంచంలో మూడు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి లక్షణము ప్రకారం, మత భావన కూడా సృష్టించబడింది. కాని మతము యొక్క ప్రయోజనము దేవుడిని అర్థం చేసుకోవటము. దేవుడిని ఎలా ప్రేమించాలో తెలుసుకోవడము. అది ఉద్దేశ్యం. ఏ మత పద్ధతి అయినా. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అది మీకు బోధిస్తుంటే, అది మొదటి తరగతి. లేకపోతే అది నిరుపయోగం. మీరు మీ మతపరమైన సూత్రాలను చాలా కఠినంగా చాలా చక్కగా పాటించవచ్చు, కాని దేవుడు మీది మీ ప్రేమ శూన్యము. భౌతిక పదార్థము మీద మీ యొక్క ప్రేమ కేవలం పెరుగుతుంది, అది ఏ మతము కాదు.భాగవతము తీర్పు ప్రకారం: sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) Apratihatā.Ahaituky apratihatā. ఆ మత పద్ధతికు కారణం లేదు. ఏ అవరోధం లేకుండా. మీరు అటువంటి మతపరమైన సూత్రములు గల పద్ధతిని చేరుకోగలిగితే, మీరు అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నారని మీరు కనుగొంటారు.లేకపోతే అవకాశం లేదు.

Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ( SB 1.2.6) Adhokṣaje. దేవుడు మరొక నామము అధోక్షజ. దేవుడిని చూడడానికి అన్ని భౌతిక ప్రయత్నాలను జయించటము Adhokṣaja. అంటే. Adhokṣaja. Akṣaja అంటే ప్రయోగాత్మక జ్ఞానం ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మీరు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు, లేదు. మీరు వేరే విధముగా జ్ఞానమును నేర్చుకోవాలి. అంటే విధేయతతో కూడిన శ్రవణము ద్వారా మరియు ప్రేమతో ఆధ్యాత్మిక సేవలను అందించడం. అప్పుడు మీరు దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. మీకు బోధించే మరియు సహాయపడే ఏ మత సూత్రం అయినా, ఏ కారణం లేకుండా భగవంతుని ప్రేమను అభివృద్ధి చేయటానికి... ఆయన నా ఇంద్రియ తృప్తి కోసం చాలా మంచి విషయాలు నాకు అందిస్తున్నాడు అందుకని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. అది ప్రేమ కాదు. అహైతుకీ. ఏమీ లేకుండా ... దేవుడు గొప్పవాడు. దేవుడు నా తండ్రి. ఆయనను ప్రేమించడం నా బాధ్యత. అంతే. మార్పిడి లేదు. ",దేవుడు నాకు రోజువారీ రొట్టె ఇస్తాడు, అందువలన నేను దేవుడిని ప్రేమిస్తున్నాను." కాదు. రోజువారీ రొట్టెను దేవుడు జంతువులు, పిల్లులు, కుక్కలకు కూడా ఇస్తాడు. అనగా, దేవుడు అందరికి తండ్రి. ఆయన అందరికి ఆహారాన్ని సరఫరా చేస్తాడు. కాబట్టి అది ప్రేమ కాదు. ప్రేమ కారణం లేకుండా ఉంటుంది. దేవుడు నాకు రోజువారీ ఆహారాన్ని సరఫరా చేయక పోయినా కూడా, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. అది ప్రేమ. అది ప్రేమ.

చైతన్య మహా ప్రభు అ విధముగా చెప్తాడు: āśliṣya vā pāda-ratāṁ pinaṣṭu mām ( CC Antya 20.47) మీరు నన్ను ఆలింగనం చేసుకోండి లేదా నన్ను మీ పాదాల క్రింద త్రొక్కండి. లేదా మీరు నా దగ్గరకు ఎప్పటికి రావద్దు. నేను మిమ్మల్ని చూడకుండా ఉంటే నేను పగిలిన హృదయము కలిగిన వాడను అవుతాను. అయినా ఇంకా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. "ఇది దేవుడు పట్ల స్వచ్చమైన ప్రేమ. మనము దేవుడు ప్రేమలో ఆ దశకు వచ్చినప్పుడు, అప్పుడు మనము కనుగొంటాము, అన్నిటినీ, పూర్తి ఆనందముతో. దేవుడు సంపూర్ణముగా సంతోషముగా ఉంటాడు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉంటారు. అది పరిపూర్ణత. చదవటము కొనసాగించండి