TE/Prabhupada 0681 - అందువల్ల, మీరు కృష్ణుడుని ప్రేమిస్తే, అప్పుడు మీ సార్వత్రిక ప్రేమ లెక్కించబడుతుంది



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

భక్తులు:కీర్తి అంతా శ్రీ గురు మరియు గౌరంగాలకు.

ప్రభుపాద: తరువాత?

విష్ణుజన: శ్లోకము ముఫ్ఫై: "ప్రతిచోట నన్ను చూసేవానికి మరియు నాలో ప్రతిదీ చూసేవానికి, నన్ను ఎన్నడూ కోల్పోడు, లేదా ఆయనను ఎప్పుడూ నేను కోల్పోను ( BG 6.30) "

ప్రభుపాద: అంతే. మీరు ఎలా కృష్ణుడిని కోల్పోతారు? sadā tad-bhāva-bhāvitaḥ ( BG 8.6) మీరు ఈ విధముగా మీ జీవితాన్ని పాటిస్తే, ఎప్పుడూ కృష్ణుడికి దూరమవ్వరు, కాబట్టి మరణం సమయంలో మీరు కృష్ణుడి దగ్గరకు తప్పకుండా వెళ్లుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణుడు మిమ్మల్ని కోల్పోడు. Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati ( BG 9.31) కృష్ణుడు వాగ్దానం ఇచ్చాడు, "నా ప్రియమైన అర్జునా, నా పవిత్ర భక్తుడుని నేను ఎప్పుడూ కోల్పోను." కాబట్టి కృష్ణుడికి దూరమవ్వరు. అది జీవితం యొక్క పరిపూర్ణత. అది జీవితం యొక్క పరిపూర్ణత. కేవలం కృష్ణుడికి దూరమవ్వరు. మీరు అన్ని విషయాలను మర్చిపోవచ్చు, కానీ కృష్ణుడిని మర్చిపోకండి. అప్పుడు మీరు అత్యంత ధనవంతులు. మిమ్మల్ని చాలా పేదవాడిగా ప్రజలు చూడవచ్చు, ఉదాహరణకు గోస్వాములు లాగా. వారు చాలా పేదరిక జీవితాన్ని తీసుకున్నారు. బిచ్చగాడి జీవితమును. వారు మంత్రులు, చాలా సంపన్నమైనవారు. చాలా గౌరవనీయమైన వ్యక్తులు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, పండితులు, ధనవంతులు, మంత్రులు, ప్రతి విషయములో వారి సామాజిక పరిస్థితి చాలా ఉన్నతముగా ఉన్నది. కానీ వారు ఈ యాచక వృత్తిని అంగీకరించారు: tyaktvā tūrṇam aśeṣa-maṇḍala-pati-śreṇīm. ఆ గోస్వామి ప్రార్థనను మీరు చూస్తారు. Tyaktvā tūrṇam aśeṣa-maṇḍala-pati-śreṇīṁ sadā tuccha-vat. అత్యంత అల్పమైన వారి వలె , వారు ప్రతిదీ వదిలేసారు Bhūtvā dīna-gaṇeśakau karuṇayā kaupīna-kanthāśritau. Kaupīna-kanthāśritau - కేవలం ఒక లోదుస్తుల మరియు నడుము వస్త్రం, అంతే. వారు అయ్యారు, అంగీకరించారు, జీవితం యొక్క అత్యంత పేద విధానమును. కానీ, వారు ఎలా జీవించారు? చాలా ధనవంతుడైన వ్యక్తి ఇటువంటి అధ్వాన్నమైన పరిస్థితి ఉన్న జీవితాన్ని అంగీకరిస్తే, అతడు బ్రతకలేడు. నేను దానిని చూశాను. వ్యక్తులు జీవితములో ఉన్నత ప్రమాణములకు అలవాటు పడినట్లయితే, మీరు ఆయన జీవిత స్థాయిని వెంటనే తగ్గించినట్లయితే, ఆయన జీవించలేడు. కానీ వారు చాలా సంతోషంగా నివసించారు. ఎలా? అది చెప్పబడింది. Gopī-bhāva-rasāmṛtābdhi-laharī-kallola-magnau muhur vande rūpa-sanātanau raghu-yugau śrī-jīva-gopālakau. గోపికల యొక్క ప్రేమ వ్యవహారాల సముద్రంలో తమని తాము ముంచుకోవడం ద్వారా, వారు అత్యంత ధనవంతులై ఉన్నారు. కావున కృష్ణుడికి గోపీకల ప్రేమ వ్యవహారాలను మీరు మననము చేసుకుంటూ ఉంటే, అప్పుడు మీరు కోల్పోరు. చాలా మార్గాలు ఉన్నాయి. కృష్ణుడిని కోల్పోకండి. అప్పుడు మీరు విజయవంత మవ్వుతారు. అప్పుడు కృష్ణుడు కూడా కోల్పోడు ఆయన కోల్పోడు. చదవడము కొనసాగించు.

విష్ణుజన: భాష్యము. "కృష్ణ చైతన్యములో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కృష్ణుడిని ప్రతి చోటా చూస్తాడు ఆయన కృష్ణుడిలో ప్రతిదీ చూస్తాడు. అలాంటి వ్యక్తి భౌతిక ప్రకృతిలో అన్ని ప్రత్యేకమైన వ్యక్తీకరణలను చూడవచ్చు. కానీ ప్రతి సందర్భంలో, ఆయన కృష్ణుడి యొక్క చైతన్యములో ఉంటాడు, ప్రతీది కృష్ణుడి శక్తి యొక్క అభివ్యక్తీకరణ అని తెలుసుకుంటాడు. "

ప్రభుపాద: "శక్తి." ఇప్పుడు, ఒక చెట్టు చూసే వ్యక్తి ... ఆయన తత్వవేత్త, కృష్ణ చైతన్యము, కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి తత్వవేత్త. ఆయన శ్రద్ధతో చూస్తే, "ఈ చెట్టు ఏమిటి?" ఆయన చెట్టును, ఒక భౌతిక విషయముగా, అది ఒక భౌతికము శరీరం కలిగి ఉన్నది అని చూస్తాడు, ఉదాహరణకు నేను ఈ భౌతిక శరీరాన్ని కలిగి ఉన్నట్లు, కానీ ఆయన జీవాత్మ. గతంలోని పాపముల వలన ఆయన అటువంటి అసహ్యకరమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆయన కదలలేడు కూడా. కానీ ఆయన శరీరం భౌతికము, భౌతికము అంటే భౌతిక శక్తి, భౌతిక శక్తి ఎవరి శక్తి? కృష్ణుడి శక్తి. అందువల్ల ఈ చెట్టుకు కృష్ణుడితో సంబంధము ఉన్నది చెట్టు, ఒక జీవాత్మగా, కృష్ణుడిలో భాగము. ఈ విధముగా మీరు తత్వము, కృష్ణ చైతన్యము గురించి చర్చించుకుంటే, చెట్టును చూడవద్దు, మీరు అక్కడ కృష్ణుడిని చూడండి. ఇది కృష్ణ చైతన్యము. మీరు చెట్టును చూడవద్దు. మీరు కృష్ణుడిని చూడండి. ఇది కృష్ణ చైతన్యము. మీరు ఆ విధముగా సాధన చేయాలి. అది యోగాభ్యాసం. అది సమాధి. అవును, చదవడము కొనసాగండి.

విష్ణుజన: "కృష్ణుడు లేకుండా ఏదీ ఉండదు కృష్ణుడు అన్నిటికీ ప్రభువు. ఇది కృష్ణ చైతన్యము యొక్క ప్రాధమిక సూత్రం. కృష్ణ చైతన్యము అనేది కృష్ణుడి ప్రేమను పెంచుకోవడము, ఈ స్థితి భౌతిక విముక్తికి కూడా అతీతమైనది. "

ప్రభుపాద: అవును. ఈ చైతన్యం, చెట్టును కృష్ణుడి శక్తిగా చూడగలగటము, కృష్ణుడిలో భాగము మీరు చెట్టును చాలా చక్కగా ఎందుకు చూసుకుంటారు? ఎందుకంటే మీకు కృష్ణుడి మీద ప్రేమ ఉంది. మీరు మీ బిడ్డను ప్రేమిస్తారు, మీ బిడ్డ మీ నుండి దూరంగా ఉన్నాడు. మీరు మీ బిడ్డ చెప్పులను చూస్తారు.", ఇది నా బిడ్డ యొక్క చెప్పు." అనుకుంటారు మీరు ఆ చెప్పును ప్రేమిస్తున్నారా? లేదు, మీరు ఆ బిడ్డను ప్రేమిస్తున్నారు. అదేవిధముగా కృష్ణుడి యొక్క శక్తి వేరొక విధముగా కనబడితే. మీరు కృష్ణుడిని ప్రేమిస్తున్నారంటే ఆ శక్తిని కూడా మీరు ప్రేమిస్తారని అర్థం. అందువల్ల, మీరు కృష్ణుడుని ప్రేమిస్తే, అప్పుడు మీ సార్వత్రిక ప్రేమ లెక్కించబడుతుంది. లేకపోతే అది అర్థంలేనిది. మీరు ప్రేమించలేరు. అది సాధ్యం కాదు. మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, అప్పుడు ప్రేమ, సార్వత్రిక ప్రేమ, చాలా విషయాలు ఉన్నాయి ఇది చాలా రకములుగా ప్రకటితమైనది. మీరు కృష్ణుడిని ప్రేమించకపోతే, అప్పుడు మీరు చూస్తారు ఇక్కడ నా అమెరికన్ సోదరుడు ఉన్నాడు, ఆవు నా ఆహారం. ఎందుకంటే మీరు ఆవుని ప్రేమించరు. ఆవు అమెరికన్ నా సోదరుడు అమెరికన్. నా సోదరుడు మంచివాడు, మరియు ఆవు ఆహారం. ఇది నా సార్వత్రిక ప్రేమ. ఎందుకు? కానీ కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి, ఆయన చూస్తాడు, ఓ, ఇక్కడ ఒక ఆవు ఉంది. ఇక్కడ ఒక కుక్క ఉంది. ఆయన కృష్ణుడి యొక్క భాగం ఏదో ఒక విధముగా అతడికి నా కంటే వేరొక శరీరం ఉన్నది. దాని అర్థము ఆయన నా సోదరుడు కాదని కాదు. కావున నేను నా సోదరుణ్ణి ఎలా చంపుతాను? " ఇది కృష్ణుడి ప్రేమ, కృష్ణుడి మీద ప్రేమ కారణంగా . కాబట్టి కృష్ణుడు ప్రేమ చాలా బాగుంది. అంతా పరిపూర్ణమైనది. కృష్ణుడి ప్రేమ లేనట్లయితే, ప్రేమ ప్రశ్నేలేదు, ఇది అంతా అర్థంలేనిది. కృష్ణ చైతన్యము లేకుండా ఏ ప్రేమ ఉండదు. అవును.