TE/Prabhupada 0726 - వేదముల నాగరికత ప్రకారం, ఉదయాన్నే నిద్ర లేచి హారే కృష్ణ కీర్తన చేయాలి



750304 - Lecture CC Adi 01.15 - Dallas


శ్రీమద్-భాగవతము ద్వారా, నారద ముని సూచించారు, అది "మీరు, మీరు ఈ మానవ రూపాన్ని పొందారు. ఇప్పుడు మీ ఆహారం ఎక్కడ ఉందో తెలుసుకోవలసిన అవసరం మీకు లేదు, మీ ఆశ్రయం ఎక్కడ ఉంది, మీ మైథున సంతృప్తి ఎక్కడ ఉంది, మీ రక్షణ ఎక్కడ ఉంది. ఇది మీ సమస్య కాదు. మీరు ఆ విషయము కోసం ప్రయత్నించాలి, అంటే ఈ భౌతిక జీవన అవసరాల నుండి ఉపశమనం కలిగించే విషయము. " ఆ సలహా ఉంది. మనము పొరపాటు చేస్తున్నాము. మనము... ఈ ఉదయం నడక లో మనము చూసాము అటువంటి ఒక గొప్ప దేశం కానీ సమస్య ఆహార సమస్య. ఉదయాన్నే ఉదయం ఆరు గంటలకే వారు పనికి వెళ్తున్నారు. వారు పనికి వెళ్తున్నారు. ఎందుకు? ఇప్పుడు, జీవితం యొక్క అవసరాలు కనుగొనటానికి.

ఈ నాగరికత ఏమిటి? ఉదయం ప్రారంభము అవ్వగానే, ఆరు గంటలకే... వేదముల నాగరికత ప్రకారం, ఉదయాన్నే నిద్ర లేచి హారే కృష్ణ కీర్తన చేయాలి, మంగళ హారతి చేయాలి, అర్చా మూర్తిని ఆరాధించాలి. ఇది ఉదయం దినచర్య. కానీ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం, వారు వారి రొట్టె సంపాదించుటకు ఆరు ముప్పై వద్ద పనికి వెళ్తున్నారు. ఇది జీవితం యొక్క మంచి పురోగతా? మొత్తం రోజు అంతా వారు పని చేయవలసి ఉంటుంది ఇక్కడ మాత్రమే కాదు, ప్రతిచోటా, వారి రోజువారీ రొట్టె సంపాదించడానికి, వారు ఇంటి నుండి యాభై మైళ్ల. వంద మైళ్ల దూరం వెళ్ళాలి ప్రతి నగరములో... భారతదేశంలో కూడా, అదే విషయము - బాంబేలో, వారు వంద మైళ్ళ దూరం వచ్చి, రోజువారీ ప్రయాణీకుల రైల్వేలో చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వేలాడుతూ వస్తున్నారు. ఇది శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది కలి యుగము చివరిలో ఒక మనిషి పనిచేయవలసి ఉంటుంది... వారు ఇప్పటికే ఒక గాడిద వలె పని చేస్తున్నారు, వాస్తవానికి వారు తమ రొట్టెను పొందడానికి గాడిదలా పనిచేయవలసి ఉంటుంది. పురోగతి ఇలాగ ఉంటుంది. అంతే కాకుండా, ఆహార పదార్థాలు, ముఖ్యంగా సాత్విక ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయలు, పాలు, బియ్యం, గోధుమ, చక్కెర, ఈ విషయాలు అందుబాటులో ఉండవు- పూర్తిగా నిలిపివేయబడతాయి. కాబట్టి క్రమంగా మనము అలాంటి పురోగతిని చేస్తాము. నేను ఆచరణాత్మకంగా చూశాను. నేను మాస్కో వెళ్ళాను, కనీసం మనము అక్కడ నివసించడానికి చాలా కష్టము. బియ్యం సరఫరా లేదు. గోధుమ సరఫరా లేదు. చాలా అరుదుగా... కూరగాయలు లేవు, ఏ పండు లేదు, మేడి పండు వలె కొన్ని కుళ్ళిన పండు ... మాత్రమే, మనకు అది చాలా కష్టము. అయితే, పాలు అందుబాటులో ఉన్నాయి, మాంసం. ఓ, మీకు నచ్చినంత , మీరు కలిగి ఉంటారు.

కాబట్టి అది మానవ జీవితం కాదు. మానవ జీవితం... ఇక్కడ వర్ణించబడింది, సరిగ్గా కవిరాజ గోస్వామి చే, mat-sarvasva-padāmbhojau rādhā-madana-mohanau (CC Adi 1.15). మన ఏకైక ఆస్తి రాధారాణితో పాటు కృష్ణుడి కమల పాదముల దగ్గర ఉండాలి. మదన-మోహన. కృష్ణుడు చాలా మనోహరంగా ఉంటాడు, ఆయన మన్మథుని కన్నా ఆకర్షణీయంగా ఉంటాడు. మదన-మోహన. మదన అంటే మన్మథుడు. మన్మథుడు విశ్వంలో అత్యంత అందమైన వ్యక్తిగా భావించబడతాడు, కానీ కృష్ణుడు ఇంకా అందంగా ఉన్నాడు. Kandarpa-koṭi-kamanīya-viśeṣa-śobham (Bs. 5.30). ఇది శాస్త్రంలో వివరించబడింది. కృష్ణుడు ఉన్నప్పుడు, మనకు శాస్త్రము నుండి లేదా సాక్ష్యముల నుండి తెలుసు చాలామంది గోపికలకు కృష్ణుడు ఆకర్షణీయంగా ఉన్నాడు. గోపికలు చాలా అందమైన స్త్రీలు, కృష్ణుడు వారికి ఆకర్షణీయముగా ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో ఊహించుకోండి. గోపికలకు మాత్రమే కాదు; కృష్ణుడి యొక్క 16,108 రాణులు ఉన్నారు. అందువలన ఆయన నామము కృష్ణుడు. ఆయన అందరికీ ఆకర్షణీయంగా ఉంటాడు. Jayatam suratau paṅgor mama (CC Adi 1.15). అందుచేత ఆయన మనలాంటి పతితులైన జీవులకు ఎందుకు ఆకర్షణీయంగా ఉండకూడదు? కాబట్టి ఇది కృష్ణుడి యొక్క పరిస్థితి