TE/Prabhupada 0728 - రాధా-కృష్ణ లీల భౌతికము అని అర్థం చేసుకున్న వ్యక్తి, వారు తప్పుదోవ పడుతున్నారు



Lecture on CC Adi-lila 7.5 -- Mayapur, March 7, 1974


అగ్ని కృష్ణుడి నుంచి వస్తుంది మహి భూమి, ఇది కృష్ణుడి నుండి వస్తుంది. అగ్ని, మహి, గగన,అంటే ఆకాశం ఇది కృష్ణుడు నుండి వస్తుంది. అంబు, నీరు, కృష్ణుడి నుండి వస్తుంది అగ్ని మహి గగనము అంబు..... వాయు, గాలి కృష్ణుడి నుండి వస్తున్నాయి. ఇది కృష్ణుడి నుండి వస్తుంది కాబట్టి ఇది కృష్ణుడి కంటే భిన్నంగా లేదు. ప్రతిదీ కృష్ణుడు. కానీ మీరు గాలిని రుచి చూస్తే, వీస్తున్న గాలిని మరియు నీరు మరియు భూమి మరియు అగ్ని, మీరు చెప్పలేరు, " గాలి కృష్ణుడి నుంచి వస్తుంది మరియు నీరు కృష్ణుడి నుండి వస్తుంది కాబట్టి, నేను గాలిలో లేదా సముద్రంలో ఉండవచ్చు, అన్నీ ఒకేలా ఉన్నాయి." మనము గాలిలో ఉన్నాము, కానీ గాలి మరియు నీరు ఒకటే అని నేను అనుకుంటే, నేను మహాసముద్రంలో దూకితే, అది మంచి ఆలోచన కాదు. కానీ వాస్తవానికి, గాలి కూడా కృష్ణుడు, నీరు కూడా కృష్ణుడు, భూమి కూడా కృష్ణుడు. అగ్ని కూడా కృష్ణుడు, వారు అందరూ కృష్ణుడి శక్తి.

కాబట్టి ఈ విధముగా, మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పంచ-తత్త్వ, శ్రీ-కృష్ణ-చైతన్య ప్రభు-నిత్యానంద, శ్రీ- అద్వైత గధాధర శ్రీ వాసాది- గౌర- భక్త-వృంద.... ఇది పంచ-తత్త్వః శ్రీ కృష్ణ చైతన్య, శ్రీ నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ గదాధర, మరియు శ్రీ వాసాది. శ్రీ వాసాది అంటే జీవ -తత్త్వ. జీవ-తత్త్వ, శక్తి తత్త్వ, విష్ణు తత్త్వ, ఇవి అన్నీ తత్త్వాలు. కాబట్టి పంచ-తత్త్వ. శ్రీ కృష్ణ చైతన్య మహోన్నతమైన తత్త్వ, కృష్ణుడు. శ్రీ-కృష్ణ-చైతన్య, రాధా-కృష్ణ నహే అన్య. మనము రాధా- కృష్ణుడిని పూజిస్తున్నాము. కాబట్టి శ్రీ కృష్ణ చైతన్య రాధా-కృష్ణ కలయిక. శ్రీ-కృష్ణ-చైతన్య, రాధా-కృష్ణ నహే అన్య.

రాధా-కృష్ణ-ప్రణయ-వికృతిర్ హ్లాదినీ-శక్తిర్ అస్మాద్
ఎకాత్మానావ్ అపి భువి పురా దేహ-బేధం గతౌ తౌ.
చైతన్యాఖ్యం ప్రకటం అధునా తద్-ద్వయం చైక్యం ఆప్తం....
( CC adi 1.5)

రాధా-కృష్ణ.... కృష్ణుడు మహోన్నతుడు. ఆస్వాదించాలని కోరుకుంటే.... ఆనందించువాడు... భోక్తారం యజ్ఞ-తపసాం సర్వ-లోక-మహేశ్వరం ( BG 5.29) ఆయన ఆనందించువాడు. కాబట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటే, అది భౌతిక ఆనందం కాదు. అది ఆధ్యాత్మిక ఆనందం - ఉన్నతమైన శక్తి, భౌతిక శక్తి కాదు. ఎందుకంటే కృష్ణుడు మహోన్నతుడు, అందుచే ఆయన ఉన్నతమైన శక్తిని ఆనందిస్తాడు. కాబట్టి కృష్ణుడి.... రాధా-కృష్ణ లీల భౌతికమైనది కాదు. రాధా-కృష్ణ లీల భౌతికము అని అర్థం చేసుకున్న వ్యక్తి, వారు తప్పుదోవ పడుతున్నారు. కృష్ణుడు భౌతికమైనది ఎదైనా అనుభవించలేడు. మీరు ఇలా అంటే “మేము చూస్తున్నాము రోజూ మీరు ప్రసాదాన్ని అర్పిస్తున్నారు, కూరగాయలు, అన్నము. అవి అన్నీ భౌతికము, “లేదు, అవి భౌతికము కాదు. ఇది నిజమైన అవగాహన.” అది భౌతికము కాకుండా ఎలా ఉంటుంది? అది అచింత్య, అనూహ్యమైనది. కృష్ణుడు భౌతికమును ఆధ్యాత్మికముగా చేయగలడు. ఆధ్యాత్మికమును భౌతికముగా చేయగలడు. అది కృష్ణుడి యొక్కఅనూహ్యమైన శక్తి, అచింత్య-శక్తి. మీరు కృష్ణుడి అనూహ్యమైన శక్తిని అంగీకరించకపోతే, మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. అచింత్య-శక్తి.