TE/Prabhupada 0732 - నేను గాలికి లేదా ఆకాశమునకు సేవ చేయలేను. నేను ఒక వ్యక్తికి సేవ చేయాలి



Room Conversation with Yoga Student -- March 14, 1975, Iran


ప్రభుపాద: సూఫీవాదం అంటే ఏమిటి? సాహిత్య అర్థం?

యోగ విద్యార్థి: సరే, సూఫీజం అంటే హిందువుల సందర్భంలో భక్తి అని అర్థము.

ప్రభుపాద: భక్తి అంటే భగవంతునికి సేవలను చేయడము. అది కూడా అదే అర్థమును ఇస్తుందా?

యోగా విద్యార్థి: పరిపూర్ణంగా.

ప్రభుపాద: కాబట్టి భగవంతునికి సేవ చేయవలెను అంటే, అప్పుడు ఆయన ఒక వ్యక్తిగా ఉండాలి; లేకపోతే సేవ యొక్క ప్రశ్న ఎక్కడ ఉంది?

యోగ విద్యార్థి: సరే, సూఫీలు అది చూస్తారు, భగవంతుడి యొక్క వ్యక్తిగత విషయమును...

ప్రభుపాద: ఒక వ్యక్తి అయితే తప్ప, నేను ఆయనని ఎలా సేవిస్తాను? నేను గాలికి లేదా ఆకాశమునకు సేవ చేయలేను. నేను ఒక వ్యక్తికి సేవ చేయాలి. ప్రేమ ఆకాశంలో లేదా గాలిలో ఉండదు. ఇది ఒక వ్యక్తి అయి ఉండాలి. పురుషుడు లేదా స్త్రీ, అది పట్టింపు లేదు. లేకపోతే ప్రేమ ఎక్కడ ఉంది? ఎవరిని ప్రేమించాలి?

యోగ విద్యార్థి: సూఫీలు ఈ వ్యక్తులలో ప్రేమను చూస్తారు... ఉదాహరణకు, సూఫీలు Ibn 'Arabi,, ఒక అందమైన మహిళ ముఖం ద్వారా...

ప్రభుపాద: అందమైన మహిళ ముఖం ద్వారానా?

యోగ విద్యార్థి: అవును.

ప్రభుపాద: కాబట్టి అక్కడ భౌతిక వ్యక్తులను కూడా చూస్తారు.

యోగ విద్యార్థి: అది భౌతిక విషయము. తప్పకుండా

ప్రభుపాద: అందువలన ఇస్లాం ధర్మములో రూపము అనేది తిరస్కరించబడినది ఎందుకంటే అది అక్కడికే వస్తుంది. వారు రూపం గురించి ఆలోచించిన వెంటనే, వారు ఈ భౌతిక రూపము, స్త్రీ యొక్క అందమైన ముఖం గురించి ఆలోచిస్తారు. అది పతనము చెందుట. కాబట్టి మీరు భౌతిక రూపమును తీసుకోకుండా ఉండటానికి చాలా కఠినముగా ఉంటారు. అది వేదముల భావము. Apāni-pādaḥ javano grahītā: "ఆయనకి కాళ్ళు చేతులు లేవు." ఇది, రూపమును తిరస్కరించడము. తరువాత ఆయన చెప్పినారు, వేదాలు అంటున్నాయి, javano grahītā: మీరు ఆయనకు ఏది అర్పించినా ఆయన అంగీకరించగలడు. అంటే ఆయన... భగవంతునికి భౌతిక రూపం లేదు, కానీ ఆయనకు రూపం ఉంది; లేకపోతే ఆయన ఎలా అంగీకరిస్తాడు? ఆయన నా ప్రేమను ఎలా అర్థం చేసుకోగలడు? కాబట్టి వాస్తవ ఇస్లాం ధర్మములో ఈ రూపం ఆమోదించబడలేదు. అందువల్ల వేదముల వివరణ, రూపం మరియు రూపం లేనిది. ఏకకాలంలో రూపము లేదు అంటే భౌతిక రూపము లేదు అని, మరియు రూపము ఉంది అంటే ఆధ్యాత్మిక రూపము అని ఉదాహరణకు నేను ఉన్నట్లే; మీరు... మనము... నేను శరీరం లోపల ఉన్నాను, కానీ నేను ఈ శరీరం కాదు. ఈ రూపం "నేను" కాదు. కానీ శరీరమునకు రూపం ఎక్కడ నుండి వచ్చింది? ఎందుకంటే నాకు రూపం ఉంది. నేను చేయి కలిగి ఉన్నాను కనుక నా స్వెటర్ కు చేయి ఉంది స్వెటర్ పైన కప్పి ఉంది. నాకు రూపం లేకపోతే, అప్పుడు స్వెటర్ కు చేయి ఎలా వచ్చింది, ప్యాంటుకు కాలు ఎలా వచ్చింది? కాబట్టి ప్యాంట్ ఆచరణాత్మకంగా కాలు కాదు. వాస్తవమైన కాలు ప్యాంట్ లోపల ఉంది. అదేవిధముగా, ఇది నా రూపం కాదు; ఇది ప్యాంట్ వలె, ప్యాంట్ యొక్క కాలు లేదా కోటు యొక్క చేయి వలె ఉంది. వాస్తవ రూపం లోపల ఉంది, అశ్మిన్ దేహే. అది భౌతిక రూపము కాదు. వాస్తవమైన రూపం నేను చూడగలిగితే, మీరు చూడగలుగుతారు, అప్పుడు ఎటువంటి వివాదము లేదు, స్పూర్తి. కానీ వారు చూడలేరు. అందువల్ల వారు "రూపము లేనిది అని చెప్తారు." అది రూపము లేనిది అయితే, వెలుపలి రూపం ఎలా బయటికి వస్తుంది? ఇది ఎలా వీలు అవుతుంది? మనిషి రూపాన్ని కలిగి ఉన్నాడు కనుక దర్జీ కోటును తయారు చేస్తాడు. కోట్ కు చేతులు ఉన్నాయి కనుక, కాబట్టి కోటు తయారు చేయబడిన మనిషి కోసం, ఆయనకు రూపం ఉంది అని నిర్ధారించారు. ఎలా మీరు రూపం లేదు అని చెప్పగలరు? కష్టము ఏమిటంటే మనము కోటు యొక్క రూపమును చూడగలము, కానీ మనము మనిషి యొక్క రూపం చూడలేకపోతున్నాము. ఇది నా కళ్ళ యొక్క లోపము - అంతే కానీ భగవంతునికి రూపము లేకపోవటము కాదు. భగవంతునికి రూపము ఉంది.

యోగ విద్యార్థి: భగవంతుడిని సాధువుల రూపములో చూడవచ్చు. భగవంతుడిని సాధువుల రూపములో చూడవచ్చు

ప్రభుపాద: హుహ్? అది మరొకటి. ఇది ప్రధానమైనది కాదు. కానీ భగవంతుడుకి రూపం ఉంది. అది సారాంశము. కానీ మనము మన ప్రస్తుత కళ్ళతో చూడలేము. అది వర్ణింపబడినది ataḥ śrī-kṛṣṇā-nāmādi na bhaved grahyam indriyayḥ (brs 1.2.234). మీ ఈ మొద్దుబారిన ఇంద్రియాలతో... అదే విషయము, నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగానే. నేను నిన్ను ఏమి చూస్తున్నాను? నీ శరీరం. మీరు నన్ను చూస్తున్నారు నా శరీరాన్ని. శరీరం ఉన్నప్పుడు ఆత్మ లేనప్పుడు, అప్పుడు అది పదార్థము యొక్క ముద్ద. మీరు దానిని తన్ని వేస్తారు, ఎవ్వరూ నిరాకరించరు. మీరు చనిపోయిన శరీరాన్ని మీ కాళ్ళతో మరియు బూట్లతో చితగ్గొడితే, "ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు?" అని ఎవరూ అడగరు కానీ ఎంత కాలము ఆత్మ ఉంటుందో, ఎవరినైనా ఆవిధముగా కొడితే, వెంటనే అన్ని వైపుల నుండి నిరసన ఉంటుంది, "ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు?" అందువల్ల ప్రజలకు వాస్తవమైన రూపం గురించి తెలియదు. అందువల్ల వారు రూపము లేదు అని అంటారు