TE/Prabhupada 0733 - సమయం చాలా విలువైనది. లక్షల బంగారు నాణేలను చెల్లించినా ఒక్క క్షణమును తిరిగి పొందలేరు



Lecture on SB 7.6.1 -- San Francisco, March 15, 1968


అక్కడ చాణక్య శ్లోకములలో చాలా మంచి శ్లోకము ఉంది. సమయం ఎంత విలువైనదిగా భావించాలో మీరు చూడండి. ఈ శ్లోకము ద్వారా మీరు తెలుసుకుంటారు. చాణక్య పండిట్ చెప్తాడు... చాణక్య పండితుడు ఒక గొప్ప రాజకీయవేత్త. ఆయన కొన్నిసార్లు భారత చక్రవర్తి యొక్క ప్రధాన మంత్రి. అందుకే ఆయన చెప్పెను, āyuṣaḥ kṣaṇa eko 'pi na labhya svarṇa-koṭibhiḥ. ఆయన "ఒక క్షణం, మీ జీవిత వ్యవధి యొక్క ఒక్క క్షణం సమయం..." క్షణం . గంటలు రోజులు గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక్క క్షణం. ఆయన క్షణ క్షణానికి ఆలోచిస్తున్నాడు. ఈరోజు లాగా, 1968 మార్చి 15 న, ఇప్పుడు అది ఏడున్నర, లేదా గత ఏడు, ముప్పై ఐదు. ఇప్పుడు ఈ 1968, 7:35, పోయింది, అది 7:36 అయిన వెంటనే, 1968, మార్చి 15, సాయంత్రం, 7:35, మళ్లీ మళ్లీ మీరు తీసుకురాలేరు. మీరు మిలియన్ల డాలర్లను చెల్లించినా, "దయచేసి మళ్లీ రండి," లేదు, పూర్తయింది. కాబట్టి చాణక్య పండితుడు చెప్పారు అది "సమయం చాలా విలువైనది, అది మీరు లక్షలాది బంగారు నాణేలను చెల్లించినా కూడా మీరు పోయిన క్షణమును తిరిగి పొందలేరు. " కోల్పోయినది ఏమైన మంచి కోసం కోల్పోయాము. Na cen nirarthakaṁ nītiḥ: "మీరు అలాంటి విలువైన సమయాన్ని ఏమీ లేకుండా పోగొట్టుకుంటే" ఏ లాభం లేకుండా, Na ca hānis tato 'dhikā, "మీరు ఒకసారి ఊహించండి ఎంత కోల్పోతున్నారో, మీరు ఎంతగానో కోల్పోతున్నారు." మిలియన్ల డాలర్లు చెల్లించడం ద్వారా మీరు తిరిగి పొందలేని విషయం, అది ఏమీలేని దాని కొరకు కోల్పోయినట్లయితే, మీరు ఎంత నష్టపోతున్నారో, కేవలం ఊహించుకోండి.

కాబట్టి ఇదే విషయం: ప్రహ్లాద మహారాజా చెప్పారు అది ధర్మాన్ భాగవతాన్ (SB 7.6.1), కృష్ణ చైతన్యముతో, లేదా భగవంతుని చైతన్యముతో, కాబట్టి చాలా ముఖ్యమైనది అది మనము ఒక క్షణం సమయం కూడా కోల్పోకూడదు వెంటనే మనము ప్రారంభించాలి. ఎందుకు? Durlabhaṁ mānuṣaṁ janma. Mānuṣaṁ janma. (SB 7.6.1) ఈ మానవ శరీర రూపం చాలా అరుదుగా లభించిందని ఆయన చెప్పాడు. ఇది అనేక జన్మల తరువాత పొందినది. కాబట్టి ఆధునిక నాగరికత, ఈ మానవ జీవితం యొక్క విలువ ఏమిటో అర్థం కాలేదు. వారు ఈ శరీరం పిల్లులు కుక్కల వలె అనుభవించడానికి ఉద్దేశించబడిందని భావిస్తున్నారు. పిల్లులు కుక్కలు, అవి కూడా నాలుగు సూత్రాలలో జీవితంను ఆనందిస్తున్నాయి; తినడం, నిద్రపోవడం, రక్షించుకోవటము, సంభోగము చేయడము. కాబట్టి మానవ జీవితం యొక్క రూపం పిల్లులు కుక్కలు వలె చెడగోట్టుకోవడము కోసం కాదు. మానవ జీవితం వేరొక దాని కోసం ఉద్దేశించబడింది. అ "వేరొకటి" కృష్ణ చైతన్యము లేదా భగవంతుని చైతన్యము. ఎందుకంటే మానవ రూపాన్ని లేకుండా, ఏ ఇతర శరీరం దీనిని అర్థం చేసుకోగలదు, భగవంతుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, నేను ఏమిటి, నేను ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి. ఈ విషయాలు మానవ జీవితం కోసం ఉద్దేశించబడ్డాయి. అందువలన ఆయన చెప్పారు అది "చాలా చిన్నతనం నుండి..." వాస్తవానికి ఇది అవసరం. చిన్ననాటి నుండి, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఈ భాగవత-ధర్మము, లేదా కృష్ణ చైతన్యము యొక్క ధర్మముని ప్రవేశపెట్టాలి. ఇది అవసరం, కాని వారు అర్థం చేసుకోవడం లేదు. వారు ఆలోచిస్తున్నారు అది ఈ ఒక్క జీవితమే అంతా అని, ఈ శరీరమే అంతా అని, మరియు ఏ ఇతర జీవితం లేదు. తదుపరి జీవితం, వారు నమ్మరు. ఇది అంతా అజ్ఞానము వలన ఉంది. జీవితం శాశ్వతం, ఈ ప్రస్తుత జీవితము తదుపరి జీవితం కోసం సన్నద్ధం చేసుకోవడానికి