TE/Prabhupada 0747 - ద్రౌపది ప్రార్థన చేసింది కృష్ణా, మీకు కావాలంటే, మీరు రక్షించవచ్చు



Lecture on SB 1.8.24 -- Los Angeles, April 16, 1973


కర్ణుడు ద్రౌపది యొక్క స్వయంవరం సమయంలో అవమానించబడ్డాడు. స్వయంవరం లో... స్వయంవరం అంటే గొప్ప, గొప్ప యువరాణులు, చాలా యోగ్యత కలిగిన యువరాణి, వారు తన భర్తను సొంతంగా ఎంపిక చేసుకుంటారు. ఉదాహరణకు మీ దేశంలో వలె, భర్త ఎంపికను అమ్మాయికి ఇవ్వబడుతుంది. ఆమెకు ఇష్టం వచ్చినవారిని ఎంపిక చేసుకోవచ్చు ఇది చాలా సర్వసాధారణమైనది కాదు, కానీ అసాధారణమైన వారు, అత్యంత అర్హత ఉన్నవారు, ఎలా ఎంచుకోవాలో తెలిసిన ఒకరు, అలాంటి అమ్మాయి తన భర్తను ఎన్నుకోవటానికి, చాలా కఠినమైన పరిస్థితులు ఇవ్వబడతాయి. ఉదాహరణకు ద్రౌపది తండ్రి ఈ విధముగానే షరతు పెట్టినాడు - పైకప్పు మీద ఒక చేప ఉంది, వ్యక్తి ఎవరైనా చేప కంటిలో గుచ్చాలి, ప్రత్యక్షంగా చూస్తూ కాదు, కానీ క్రింద నీటిలో నీడను చూస్తూ కాబట్టి చాలామంది రాజులు ఉన్నారు. అటువంటి ప్రకటన ఉన్న వెంటనే, యువరాజులు అందరూ ఎదుర్కోవడానికి వస్తారు. అది క్షత్రియ పద్ధతి.

కాబట్టి ద్రౌపది యొక్క ఆ స్వయంవరం సమావేశంలో కర్ణుడు కూడా ఉన్నాడు. ద్రౌపదికి తెలుసు...ద్రౌపది యొక్క వాస్తవ ఉద్దేశ్యము అర్జునుడిని ఆమె భర్తగా అంగీకరించడం. కానీ కర్ణుడు ఉన్నాడని ఆమెకు తెలుసు. కర్ణుడు పోటీ చేస్తే, అర్జునుడు విజయము సాధించలేడు. అందుకని, "ఈ పోటీలో, క్షత్రియులు తప్ప, ఎవరూ పోటీ చేయకూడదు." అంటే, ఆ సమయంలో కర్ణుడు, ఆయన ఒక క్షత్రియుడని తెలియదు. అతను కుంతీ కుమారుడు ఆమె వివాహానికి ముందు . కాబట్టి ప్రజలకు తెలియదు. ఇది రహస్యంగా ఉంది. కర్ణుడును ఒక వడ్రంగి పెంచినారు. అందువల్ల ఆతను శూద్ర అని పిలువబడ్డాడు. కాబట్టి ద్రౌపది ఈ ప్రయోజనమును తీసుకున్నది మరియు ఇలా చెప్పినది ఏ వడ్రంగి వాడు ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని నేను కోరుకోను. నాకు ఇది ఇష్టం లేదు. కాబట్టి కర్ణుడు అనుమతించబడ లేదు. కాబట్టి కర్ణుడు అది పెద్ద అవమానంగా తీసుకున్నాడు.

ఇప్పుడు, ఆటలో ద్రౌపదిని కోల్పోయినప్పుడు, ఆయన మొదటగా ముందుకు వచ్చాడు. అతడు దుర్యోధనుడి యొక్క గొప్ప స్నేహితుడు. ఇప్పుడు ద్రౌపది యొక్క నగ్న అందం చూడాలనుకుంటున్నాడు. సమావేశంలో వృద్ధులు ఉన్నారు. ధృతరాష్ట్రుడు ఉన్నాడు. భీష్ముడు అక్కడ ఉన్నాడు, ద్రోణాచార్య. అయినప్పటికీ, వారు నిరసన చెప్పలేదు, ఓ, ఈ సమావేశములో మీరు ఒక స్త్రీని నగ్నముగా చేయబోతున్నారా? వారు నిరసన వ్యక్తము చేయలేదు. అందువలన అసత్ సభాయాః, "అనాగరిక వ్యక్తుల సభ." అనాగరిక వ్యక్తియే ఒక మహిళను నగ్నముగా చూడాలని కోరుకుంటాడు. కానీ అది ఈ రోజుల్లో ఫ్యాషన్గా మారింది, మీరు చూస్తారు? ఒక స్త్రీ అలా ఉండకూడదు, ఆమె తన భర్త ముందు తప్ప, ఎవరి ముందు నగ్నంగా ఉండకూడదు. ఇది వేదముల సంస్కృతి. కానీ ఆ దుష్టులు ఆ మహాసభలో ద్రౌపదిని నగ్నంగా చూడాలని అనుకున్నారు కనుక, కాబట్టి వారు అందరూ దుష్టులు, asat ఉన్నారు. సత్ అంటే మర్యద తెలిసిన వారు, అసత్ సభ్యత లేని వారు అని అర్థం . కావున అసత్ సభాయాః, "సభ్యత లేని వారి సమావేశంలో నీవు రక్షించావు" -కృష్ణుడు రక్షించాడు ద్రౌపదిని నగ్నంగా చేయాలని, ఆమె చీర తీసివేయబడుతోంది, చీర పూర్తి కాలేదు. కృష్ణుడు చీరను సరఫరా చేస్తున్నాడు.

కాబట్టి ఆమెను నగ్నంగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు అలసిపోయారు. (నవ్వు) ఆమె ఎప్పుడూ నగ్నంగా మారలేదు, వస్త్రము కుప్పలుగా పేర్చబడినది. వారు అర్థం చేసుకున్నారు, "ఇది అసాధ్యం." ద్రౌపది కూడా తన వస్త్రాన్ని కాపాడుకోవటానికి మొదటి ప్రయత్నం చేసినది. ఆమె ఏమి చేయగలదు? ఆమె స్త్రీ, వారు ఇద్దరు వ్యక్తులు. కర్ణుడు మరియు దుశ్శాసనుడు ఆమెను నగ్నంగా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఆమె కృష్ణుడికి ప్రార్థన చేస్తుంది, "నా గౌరవాన్ని కాపాడు" . కానీ ఆమె కూడా ప్రయత్నిస్తుంది, తనకు తాను, రక్షించుకునేందుకు. నన్ను నేను నా గౌరవమును, ఈ విధముగా రక్షించుకోవటము అసాధ్యం అని ఆమె భావించినప్పుడు అప్పుడు ఆమె తన చేతులను వదిలి వేసినది. ఆమె తన చేతులను పైకి లేపి ప్రార్థన చేసినది, కృష్ణా, మీకు కావాలంటే, మీరు రక్షించవచ్చు.

కాబట్టి ఇది పరిస్థితి. ఎంత కాలము మనం మనల్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తామో, అది చాలా మంచిది కాదు. మీరు కేవలం కృష్ణుడిపై ఆధారపడి ఉంటే, అది సరైనది. "కృష్ణా, మీరు నన్ను కాపాడండి, లేకపోతే నన్ను చంపండి, మీకు నచ్చినట్లుగా . " మీరు చూడండి? Mārobi rākhobi—jo icchā tohārā. భక్తివినోద ఠాకురా చెప్తున్నారు, "నేను నీకు శరణాగతి పొందుతున్నాను." Mānasa, deho, geho, jo kichu mor, నా ప్రియమైన ప్రభూ, నా దగ్గర ఉన్నది ఏదైనా, నా ఆస్తి... నా దగ్గర ఏమి ఉంది? నా దగ్గర ఈ శరీరం ఉంది. నా మనస్సు ఉంది. నా దగ్గర చిన్న ఇల్లు ఉంది, నా భార్య, నా పిల్లలు. ఇది నా ఆస్తి. " So mānasa, deho, geho, jo kichu mor. "నా దగ్గర ఉన్నది ఏమైనా-ఈ శరీరం, ఈ మనస్సు, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ఇల్లు, నేను నీకు అర్పిస్తున్నాను ప్రతిదీ. " Mānasa, deho, geho, jo kichu mor, arpiluṅ tuwā pade, nanda-kiśor. కృష్ణుడిని నంద కిశోరా అని పిలుస్తారు. కాబట్టి ఇది శరణాగతి పొందుట, దాచిపెట్టుకోవడము లేదు, పూర్తిగా శరణాగతి పొందుట, అకించన