TE/Prabhupada 0783 - ఈ భౌతిక ప్రపంచంలో మనము ఆనందించే కోరికతో వచ్చాము.అందువలన మనము పతనము అయ్యాము



Lecture on BG 1.21-22 -- London, July 18, 1973


ఇప్పుడు ఇక్కడ, కృష్ణుడిని అచ్యుత అని సంభోదిస్తున్నారు. చ్యుత - పతితుడు అని అర్థం, అచ్యుత- పతితుడు కానివాడు. మనము పతితులైనట్లుగా. మనము పతితులైన బద్ధ ఆత్మలము. ఈ భౌతిక ప్రపంచంలో మనము ఆనందించే కోరికతో వచ్చాము. అందువలన మనము పతనము అయ్యాము ఒక వ్యక్తి తన స్థానాన్ని ధర్మముగా ఉంచుకుంటే, అతడు పతనము కాడు. లేకపోతే ఆయన అధోగతి చెందుతాడు. ఇది పతిత పరిస్థితి. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం లోపల అన్నీ జీవులూ, అందరూ, బ్రహ్మ నుండి చిన్న అల్పమైన చీమ వరకు, వారు అందరు పతితులు, పతితులైన బద్ధజీవాత్మలు. ఎందుకు వారు పతనమయ్యారు?

kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare
pāśate māyā tāre jāpaṭiyā dhare
(Prema-vivarta)

పతిత అంటే జీవులు ఈ భౌతిక శక్తి యొక్క కోరలలో ఉన్నప్పుడు దానిని పతనము అవ్వటము అని అంటారు. ఉదాహరణకు ఒక మనిషి ఆయన పోలీసుల అధీనములో ఉన్నపుడు, ఆయన ఒక నేరస్తుడు అని అర్థం చేసుకోవాలి, ఆయన పతనమయ్యాడు. ఆయన మంచి పౌరసత్వం నుండి పతనమయ్యాడు. అదేవిధముగా, మనము అందరము కృష్ణుని లో భాగము . మమైవాంశో జీవ-భూత ( BG 15.7) కావున భాగం mairyu అంశ అయినందున, మన స్థితి కృష్ణుడితో నివసించడం. ఉదాహరణకు నా ఈ వేలు వలె, నా శరీరం యొక్క భాగము వేలు ఈ శరీరముతో కలసి ఉండాలి. ఈ వేలు కత్తిరించబడి మరియు క్రింద పడిపోయినప్పుడు, ఇది వేలు అయినప్పటికీ, అది అంత ముఖ్యమైనది కాదు గతంలో వలె ఇది ఈ శరీరముతో కలసి ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుడు యొక్క సేవతో సంబంధం లేని వారు ఎవరైనా అతడు పతనమైనాడు. ఇది సారంశము.

కానీ కృష్ణుడు పతనము కాడు. కృష్ణుడు... ఆయన మనల్ని తిరిగి తన దగ్గరకు తీసుకు వెళ్ళటానికి వస్తాడు కనుక.

yadā yadā hi dharmasya
glānir bhavati bhārata
abhyutthānam adharmasya
tadātmānaṁ sṛjāmy aham
(BG 4.7)

కృష్ణుడు ఇలా అన్నాడు, "ధర్మాచరణకు హాని కలుగుతుందో అప్పుడు అవతరిస్తాను, నేను చెప్పేది ఏమిటంటే జీవుల యొక్క వృత్తిపరమైన బాధ్యతలను." Dharmasya glānir bhavati. మనం ధర్మాన్ని "మతము" అని అనువదించము. ఆంగ్ల నిఘంటువులో మతము యొక్క అర్థము, ఇది "ఒక విధమైన విశ్వాసము." విశ్వాసము మారవచ్చు, కానీ ధర్మము అనే పదము మార్చలేనిది. (మార్పులేనిది) అది మారినట్లయితే, అది కృత్రిమము అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు నీటి వలె . నీరు ద్రవం, అందరికి తెలుసు. కానీ కొన్నిసార్లు నీరు గట్టిగా అవుతుంది, చాలా గట్టిగా, ఐస్ అవుతుంది. కానీ అది నీటి సహజ స్థితి కాదు. కృత్రిమంగా, అధిక చల్లదనము లేదా కృత్రిమ పద్దతుల కారణంగా, నీరు ఘనముగా మారింది. కానీ నీటి వాస్తవ స్థితి ద్రవ్యత్వం.

కాబట్టి మనము భగవంతుని సేవ నుండి వేరు అయినప్పుడు, ఇది కూడా అసహజమైనది. అసహజము. సహజ స్థితి మనము భగవంతుడు యొక్క సేవలో వినియోగించ బడాలి. ఇది మన సహజ పరిస్థితి. అందువలన వైష్ణవ కవి చెప్తాడు kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare (Prema-vivarta). జీవుడు కృష్ణుని మరచిపోయినప్పుడు, కృష్ణుడి స్థానాన్ని మరచిపోతాడు ... కృష్ణుడి యొక్క స్థానాన్ని ... కృష్ణుడు చెప్తాడు, bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram: ( BG 5.29) నేను యాజమానిని, నేను ఆనందించేవాడిని. ఇది కృష్ణుడి స్థానము. ఆయన ఎప్పుడూ ఆ స్థానము నుండి పతనమవ్వడు. కృష్ణుడు ఆనందించేవాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ స్థితిని కలిగి ఉంటాడు. ఆయన ఎప్పుడూ పతనము అవ్వడు. ఆయన ఎప్పటికీ అనందించబడుతున్న స్థితికి రాడు. అది సాధ్యం కాదు. మీరు కృష్ణుడిని అనందించబడే స్థితికి తీసుకురావాలనుకున్నట్లయితే, మీరు ఓడిపోతారు. ఆనందంగా ఉండటం అంటే కృష్ణుడిని ముందు ఉంచుకోవడము, నేను ఇంద్రియ తృప్తి ద్వారా కొంత లాభం పొందాలనుకుంటున్నాను . అది మన అసహజ స్థితి. కృష్ణుడు ఎప్పుడు అంగీకరించరు. కృష్ణుడు ఎప్పుడు అంగీకరించరు. కృష్ణుడిని ఆనందించలేరు. ఆయనే ఎల్లప్పుడూ ఆనందించేవాడు. ఆయనే ఎల్లప్పుడూ యజమాని. కావున kṛṣṇa bhuliya jīva కృష్ణుడి యొక్క ఈ స్థితిని మనము మరచిపోయినప్పుడు, ఆయన మహోన్నతమైన ఆనందించేవాడు, ఆయన మహోన్నతమైన యజమాని అని ... దీనిని మరుపు అని పిలుస్తారు. నేను "నేను ఆనందించే వాడిని, నేను యజమానిని," అని అనుకున్న వెంటనే అది నా పతన దశ. Kṛṣṇa bhuliya jīva bhoga vañcha kare (Prema-vivarta). మనము ఉన్నప్పుడు... అక్కడ... Jāpaṭiyā dhare, māyā, వెంటనే మాయ బంధిస్తుంది