TE/Prabhupada 0794 - తన దుష్ట గురువు చెప్తాడు, అవును, మీరు ఏదైనా తినవచ్చు, మీరు ఏమైనా చేయవచ్చు



Lecture on BG 2.17 -- London, August 23, 1973


కాబట్టి ఈ కలి యుగము చాలా తీవ్రముగా ఉంది, అది భక్తులు అని పిలువబడే వారి మీద కూడా దాడి చేస్తుంది. కలి యుగము చాలా బలంగా ఉంది. అందువల్ల చైతన్య మహాప్రభు మీరు మిమ్మల్ని రక్షించుకోవాలని అనుకుంటే, మీకు ఆసక్తి ఉంటే, మీరు అమృతం యొక్క స్థితిని తీసుకోవాలని కోరుకుంటే... ఎవరికి ఆసక్తి లేదు. శ్రీ కృష్ణుడు చెప్తాడు sa amṛtatvāya kalpate. ఇది జీవితం యొక్క లక్ష్యం: ఎలా నేను అమరత్వం పొందుతాను. నేను బాధ కలిగించే నాలుగు సూత్రాలకు లోబడను జన్మ, మరణం, వ్యాధి, వృద్ధాప్యం. ఎవరూ తీవ్రముగా లేరు. వారు చాలా నిస్తేజంగా ఉన్నారు. అందువల్ల వారిని మంద అని వర్ణించారు. మంద అంటే చాలా చెడ్డది, అందువల్ల వారికి జీవిత ఆశయం లేదు. జీవిత లక్ష్యమేమిటో వారికి తెలియదు. మంద. మంద అంటే "చెడు." సుమంద-మతాయః. వారిలో కొందరు, కేవలం చాలా మతపరమైన వారిగా గుర్తించబడాలనుకుంటే, ఆయన ఒక దుష్టుడిని గురువుగా అంగీకరిస్తాడు, మాంత్రికుడు, ప్రతిదీ తింటాడు, ప్రతిదీ చేస్తాడు, ఆధ్యాత్మికముగా మారుతాడు, తన దుష్ట గురువు చెప్తాడు, "అవును, మీరు ఏదైనా తినవచ్చు, మీరు ఏమైనా చేయవచ్చు. ధర్మముకు తినడం తో ఏమీ పని లేదు. "ఇది జరుగుతోంది. క్రిస్టియన్ ప్రజలు, స్పష్టంగా, స్పష్టంగా చెప్పబడినది, "నీవు చంప కూడదు." కానీ వారు చంపుతున్నారు. అయినప్పటికీ, వారు చాలా గర్వముగా ఉంటారు, "నేను క్రైస్తవుడను." నీవు ఏ విధమైన క్రైస్తవుడివి? మీరు క్రమము తప్పకుండా క్రీస్తు ఆజ్ఞకు అవిధేయులవుతున్నారు, ఇంకా మీరు క్రైస్తవులేనా?

కాబట్టి ప్రతిదీ జరుగుతోంది. క్రిస్టియన్ గాని, మొహమ్మదిన్ లేదా హిందూ, అని పిలవబడే. వారు అందరు దుష్టులు మూర్ఖులు అయ్యారు. అంతే. ఇది కలి యుగము. Mandāḥ sumanda-matayaḥ. వారు వారి స్వంత ఊహాత్మక మత సూత్రాన్ని సృష్టించారు, అందువలన వారు ఖండించబడ్డారు. వారికి తెలియదు. జీవితం, జీవితం యొక్క లక్ష్యం భగవంతుని అర్థము చేసుకోవడము అని. ఇది మానవ జీవితం. కావున వారు ఈ అనియంత్రిత ఇంద్రియాలతో చాలా ఇబ్బందిపడుతున్నారు వారు భౌతిక జీవితము యొక్క అత్యంత చీకటి ప్రాంతములోనికి వెళ్తున్నారు. Adānta-gobhiḥ. అదాంత అంటే అనియంత్రిత అని అర్థం. వారు ఇంద్రియాలను నియంత్రించలేరు. వారు చాలా దురదృష్టవంతులు అయ్యారు ఆ సాధారణ విషయము, చిన్న ప్రయత్నం, చిన్న తపస్సు, ఇంద్రియాలను నియంత్రించడానికి. యోగా పద్ధతి అంటే ఇంద్రియాలను నియంత్రించడము. యోగ అంటే మీరు కొంత ఇంద్రజాలమును చూపించడము అని కాదు. ఇంద్రజాలము, ఇంద్రజాలికుడు కూడా ఇంద్రజాలమును చూపగలడు. మనము ఒక ఇంద్రజాలికుని చూసినప్పుడు, ఆయన వెంటనే చాలా నాణేలను రూపొందిస్తాడు టంగ్ టంగ్ టంగ్ టంగ్. తదుపరి క్షణం అంతా పూర్తవుతుంది. కాబట్టి జీవితం, వారు జీవిత లక్ష్యం కోల్పోతున్నారు. Mandāḥ sumanda-matayaḥ. ఎందుకు? Manda-bhāgyāḥ. వారు దురదృష్ట వంతులు. కాబట్టి మీరు అలుసుగా తీసుకుంటారు. మన కృష్ణ చైతన్యము యొక్క లక్ష్యం కూడా, మనము ప్రయత్నిస్తున్నాము, మేల్కొపుటకు ప్రయత్నిస్తున్నాము. అయినప్పటికీ వారు దురదృష్టవంతులు, వారు ఇంద్రియ తృప్తిని వదలి వేయలేరు. ఎంతో దురదృష్టము. ఖండించబడ్డారు, దురదృష్టవంతులు. మనము మన రక్తమును గాలన్ల కొద్ది ఖర్చుపెడుతున్నాము - "ఇది చేయవద్దు" - అయినా వారు వాటిని చేస్తున్నారు. నిద్రపోవడాన్ని కూడా వదలలేరు. కాబట్టి ఖండించబడ్డారు. Kali-yuga. Mandāḥ sumanda-matayaḥ