TE/Prabhupada 0805 - కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు



Lecture on SB 5.5.2 -- London, September 17, 1969


ప్రభుపాద:

...mahāntas te sama-cittāḥ praśāntā
vimanyavaḥ suhṛdaḥ sādhavo ye
( SB 5.5.2)

గత సమావేశంలో మనము మోక్షము యొక్క మార్గము గురించి చర్చిస్తున్నాము. రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం మోక్షము. మోక్షము అంటే ఈ భౌతిక బంధనం నుండి విముక్తి అని అర్థము. భౌతిక బంధనము అంటే ప్రజలు అర్థం చేసుకోలేరు. కానీ కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు

ఒక ఆత్మ, భగవంతునిలో అంశ మరియు భాగంగా, అతడి స్వభావము చాలా శక్తివంతమై ఉంది. మనము ఎంత ఆధ్యాత్మిక శక్తిని పొంది ఉన్నామో మనకు తెలియదు, కానీ అది భౌతిక పొర ద్వారా అణచివేయబడుతుంది. ఉదాహరణకు ఈ అగ్ని వలె. ఈ అగ్ని, చాలా బూడిద కలిగి ఉంటే, అగ్ని యొక్క వేడి సరిగ్గా తెలియదు. కానీ మీరు బూడిదను కదిలించి, దానికి గాలి వీస్తే, అది జ్వలించే సమయంలో, అప్పుడు మీరు సరైన వేడిని మరియు ఇంక దాన్ని చాలా ప్రయోజనముల కొరకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధముగా, మనము, ఆత్మగా, మనకు చాలా శక్తి ఉంది. భగవంతుడు పరమాత్మ, కాబట్టి మనము ఊహించలేము భగవంతునికి ఎంత శక్తి ఉంది. కానీ మనము కూడా, కేవలము చిన్న కణము... ఉదాహరణకు.... పోలిక కేవలము అగ్ని మరియు కణముల వలె. అగ్ని మరియు కణాలు, రెండు అగ్నియే. కణము అయినా కూడా, ఎక్కడైతే కణము పడుతుందో, వెంటనే అది కాలుస్తుంది. అదేవిధంగా, మనకు అన్ని లక్షణములు ఉన్నాయి, తక్కువ పరిమాణంలో, భగవంతునిలోవి. భగవంతునికి సృజించే శక్తి ఉంది, కాబట్టి మనం కూడా చాలా విషయాలు సృష్టిస్తున్నాము. శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలను సృష్టిస్తున్నారు. మన లాంటి వ్యక్తులకు అది చాలా అద్భుతం, ఎందుకంటే ఒకరు ఎంత అద్భుతముగా ఆడగలరో మనకు తెలియదు. అది మనకు తెలియదు