TE/Prabhupada 0822 - మీరు భగవంతుని కీర్తిస్తూ ఉంటే, మీరు పవిత్రము అవుతారు కేవలం కీర్తన ద్వారా



Lecture on SB 3.28.18 -- Nairobi, October 27, 1975


హరికేస: అనువాదం: "భగవంతుని యొక్క కీర్తి ఎల్లప్పుడూ పాడటం విలువను కలిగి ఉంది, ఆయన మహిమలు ఆయన భక్తుల గొప్పతనమును పెంచుతాయి. అందువలన, భగవంతుని మీద, ఆయన భక్తుల మీద ధ్యానం చేయాలి. మనస్సు స్థిరపడేంత వరకు భగవంతుని యొక్క శాశ్వతమైన రూపము మీద ధ్యానం చేయాలి. "

ప్రభుపాద:

kīrtanya-tīrtha-yaśasaṁ
puṇya-śloka-yaśaskaram
dhyāyed devaṁ samagrāṅgaṁ
yāvan na cyavate manaḥ
(SB 3.28.18)

దీనిని ధ్యానం అంటారు. యావన్ - ఎంత కాలము మనస్సు కలత కలిగి ఉంటుందో మరియు ధ్యానం మీద నుండి మన మనస్సు వైదొలగిపోతుందో, ఈ కీర్తనను సాధన చేయాలి. Kīrtanīyaḥ sadā hariḥ ( CC Adi 17.31) భక్తుడు ఎల్లప్పుడు ఇరవై నాలుగు గంటలు కీర్తన చేయాలని చైతన్య మహా ప్రభు సూచించారు. కీర్తన్య: "పాడటం విలువ కలిగి ఉంది." పాడటం విలువ కలిగి ఉంది, ఎందుకు? Puṇya ślokasya. Puṇya ślokasya... Puṇya śloka yaśaskaram. మీరు మీ మనసును స్థిరముగా ఉంచుకోకపోతే - కీర్తన అనగా మీ మనస్సును స్థిరముగా ఉంచుకోవడము - కానీ మీరు మీ మనస్సు ను మార్చుకోకపోయినా, అప్పుడు మీరు ఇంకా లాభం పొందుతారు. మరింత మీరు భగవంతుని కీర్తిస్తూ ఉంటే, మీరు పవిత్రము అవుతారు కేవలం కీర్తన ద్వారా . మీరు అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, కానీ మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తూ ఉంటే, అప్పుడు మీరు పవిత్రంగా ఉంటారు. పుణ్య-శ్లోక. కృష్ణుని యొక్క మరొక నామము పుణ్య-శ్లోక, ఉత్తమ-శ్లోక,. కేవలం "కృష్ణుని" కీర్తన, జపము చేయడము ద్వారా మీరు పవిత్రంగా ఉంటారు.

కావున dhyāyed devaṁ samagrāṅgam. ధ్యానం, ధ్యానం, కమల పాదాల నుండి ప్రారంభం కావాలి. మీరు కీర్తన ప్రారంభం చేసిన వెంటనే, మొట్టమొదట కమల పాదముల మీద మీ మనస్సు దృష్టిని కేంద్రీకరించాలి, నేరుగా ముఖం మీదకు అకస్మాత్తుగా వెళ్ళడము కాదు. కమల పాదముల మీద ధ్యానము చేయడమును సాధన చేయండి, అప్పుడు ఇంకా పైకి, మోకాలు, తరువాత తొడలు, తరువాత బొడ్డు, తరువాత ఛాతీ. ఈ విధముగా, చివరకు ముఖం దగ్గరకు వెళ్ళండి. ఇది పద్ధతి. ఇది రెండవ స్కంధములో వివరించబడింది. కృష్ణుని గురించి ఆలోచించడం ఎలా, man-manā bhava mad-bhaktaḥ ( BG 18.65) ఇది ధ్యానం. ఇది... కీర్తన ద్వారా చాలా సులభం అవుతుంది. హరిదాస ఠాకురా లాగా మీరు ఇరవై నాలుగు గంటలు హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన చేస్తే... అది సాధ్యం కాదు. వీలైనంత వరకు. Tīrtha-yaśasa. Kīrtana... ఇది కూడా కీర్తనా. మనము కృష్ణుని గురించి మాట్లాడుతున్నాము, కృష్ణుని గురించి చదువుతున్నాము, భగవద్గీతలో కృష్ణుని ఉపదేశమును చదువుతున్నాము లేదా శ్రీమద్-భాగవతము లో కృష్ణుని మహిమలను చదవడము. ఇవి అన్ని కీర్తన. మనము సంగీత వాయిద్యాలతో పాడుతున్నప్పుడే, అది కీర్తన అని కాదు. కాదు. కృష్ణుని గురించి మీరు మాట్లాడతారు. అది కీర్తన