TE/Prabhupada 0837 - మనము చాలా శక్తివంతులము కావచ్చు, కృష్ణుడు మనల్ని శక్తివంతముగా ఉంచినంత వరకు



731130 - Lecture SB 01.15.20 - Los Angeles


ప్రద్యుమ్న: అనువాదం: "ఓ రాజా, ఇప్పుడు నేను నా స్నేహితుడి మరియు శ్రేయోభిలాషి నుండి విడిపోయాను, భగవంతుడి నుండి, అందుచే నా హృదయములో ప్రతిదీ శూన్యముగా కనిపిస్తుంది. ఆయన లేనప్పుడు నేను అనేక మంది గోవులను సంరక్షించే నాస్తిక వ్యక్తులచే ఓడింపబడ్డాను నేను కృష్ణుడి యొక్క అందరి భార్యలను కాపలా కాస్తున్నప్పుడు. "

ప్రభుపాద: కృష్ణుడు వెళ్ళిన తర్వాత, కృష్ణుడి భార్యలందరూ, 16,108, మంది వారు. అర్జునుడు వారిని సంరక్షిస్తున్నాడు. కానీ కొందరు గోప వ్యక్తులు, వారు రాణులందరినీ దోచుకున్నారు, అర్జునుడు వారిని రక్షించలేకపోయాడు.

కావున ఇది ఉదాహరణ మనము చాలా శక్తివంతులము కావచ్చు, కృష్ణుడు మనల్ని శక్తివంతముగా ఉంచినంత వరకు. మనము స్వతంత్రంగా శక్తివంతమైన వారము కాదు అర్జునుడి విషయములో కూడా అంతే. మనము మన janmaiśvarya-śruta-śrīḥ-śruta-śrīḥ ( SB 1.8.26) కు చాలా గర్వంగా ఉన్నాము. భౌతిక ప్రపంచములో , ప్రతిఒక్కరూ ఆయన జన్మ గురించి చాలా గర్వంగా ఉంటాడు, ధనము, విద్య మరియు అందం. అందం. ఈ నాలుగు విషయాలు పవిత్ర కార్యక్రమాల ఫలితంగా పొందవచ్చు. అపవిత్రమైన కార్యక్రమాలకు ఫలితంగా, వాటికి వ్యతిరేకమైనవి. చాలా మంచి కుటుంబములో లేదా దేశంలో జన్మించడము ఉండదు, సంపద ఉండదు, పేదరికము. విద్య ఉండదు మరియు అందం ఉండదు. కానీ మనము తెలుసుకోవాలి ఈ వసతులు, భౌతిక వసతులు... ఉదాహరణకు మీరు అమెరికన్ ప్రజలు మీకు మంచి వసతులు ఉన్నాయి. మీరు చాలా గౌరవప్రదమైన దేశములో జన్మించారు - అమెరికా దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ గౌరవించబడుతున్నాయి. కాబట్టి అది మీకు మంచి అవకాశము, జన్మ. మీరు జన్మించారు... ప్రతి అమెరికన్... భారతదేశంతో పోలిస్తే, ప్రతి అమెరికన్ ధనవంతుడు, ఎందుకంటే సాధారణ వ్యక్తి కూడా ఇక్కడ కనీసం నాలుగు వేలు, లేదా ఐదు వేల రూపాయలు సంపాదించుకుంటాడు. భారతదేశములో, ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కూడా, ఆయన అంత సంపాదించలేడు. నాలుగు వేలు దాటదు. కావున కృష్ణుడి కృపతో మీరు ఈ విషయాలన్నింటినీ పొందారు అనే చైతన్యము మీరు కలిగి ఉండాలి. పేదరికం లేదు, కొరత లేదు, విద్య కోసము మంచి అవకాశం ఉంది, మీరు సంపన్నమైన వారు, అందమైన వారు, ప్రతిదీ. Janmaiśvarya-śruta-śrīḥ. కానీ మీరు కృష్ణ చైతన్య వంతులు కాకపోతే, ఈ వసతులను దుర్వినియోగం చేస్తే, అప్పుడు మళ్ళీ పునర్ మూషికో భవ.

మీకు కథ తెలుసా, పునర్ మూషికో భవ? ఏవరికైనా తెలుసా? పునర్ మూషికో భవా అంటే "తిరిగి నీవు ఒక ఎలుక అవ్వు." (నవ్వు) ఒక ఎలుక ఒక సాధువు దగ్గరకు వచ్చింది: "అయ్యా, నేను చాలా ఇబ్బంది పెట్టబడుతున్నాను." "అది ఏమిటి?" ప్రజలు సాధారణంగా కొన్ని భౌతిక లాభాల కోసం సాధువుల దగ్గరకు వెళతారు. అది సహజ స్వభావము, జంతు స్వభావం. ఎందుకు మీరు కొంత భౌతిక ప్రయోజనము కోసం ఒక సాధువు దగ్గరకు వెళ్ళాలి? లేదు. నీవు భగవంతుని గురించి నేర్చుకోవటానికి అక్కడకు వెళ్ళాలి. ఇది వాస్తవమైన కర్తవ్యము. ఏమైనప్పటికి, సాధువులు కొన్నిసార్లు అడుగుతారు. "కావున, నీకు ఏమి కావాలి?" ఉదాహరణకు శివుడి లాగా, ఆయన భక్తులు అందరు ఆ ఎలుక వంటి వారు, ఏదో కావాలి. అయ్యా, ఈ పిల్లి నన్ను చాలా కష్టాలు పెడుతుంది. కాబట్టి నీకు ఏమి కావాలి? "నన్ను ఒక పిల్లిగా మార్చండి." సరే, నీవు ఒక పిల్లిగా మారు. అందువలన ఆయన ఒక పిల్లి అయ్యాడు. కొద్ది రోజుల తరువాత, అది తిరిగి వచ్చింది. "అయ్యా, ఇప్పటికీ నేను ఇబ్బందుల్లో ఉన్నాను." "అది ఏమిటి?" కుక్కలు, (నవ్వు) అవి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి నీకు ఏమి కావాలి? "ఇప్పుడు నేను కుక్కగా మారాలనుకుంటున్నాను." "అది సరే, నీవు కుక్కగా మారు." కొన్ని రోజుల తరువాత... ఒకటి తరువాత... ప్రకృతి అమరిక ఉంది. ఒకటి బలహీనముగా ఉంటుంది, ఒకటి బలంగా ఉంటుంది. అది ప్రకృతి అమరిక. కాబట్టి ఏమైనప్పటికీ, ఆయన ఒక పులిగా మారాలని కోరుకున్నాడు. కాబట్టి సాధువు యొక్క దయతో ఆయన పులి అయ్యాడు. ఆయన ఒక పులి అయిన తరువాత, ఆయన , సాధువు వంక తదేకముగా చూస్తున్నాడు. (ప్రభుపాద ముఖముతో చూపెడుతారు-భక్తులు నవ్వుతున్నారు) కావున సాధువు అడిగాడు, "నీవు నన్ను తినాలని అనుకుంటున్నావా?" "అవును." ఓ, నీవు మళ్ళీ ఒక ఎలుకగా మారిపో. (నవ్వు) నా కృప ద్వారా, నా దీవెనతో, నీవు పులిగా మారావు, నేను మళ్ళీ ఎలుకగా మారిపొమ్మని శిక్షిస్తున్నాను. "

కాబట్టి మీరు అమెరికన్ ప్రజలు, మీరు ఇప్పుడు పులిగా మారారు, నిక్సన్ పులి. కానీ మీరు కృతజ్ఞతా భావముతో ఉండకపోతే , మీరు కృతజ్ఞతతో ఉండకపోతే... పులి కృతజ్ఞతా భావముతో "సాధువు యొక్క కృప వలన, నేను ఒక పులి అయ్యే దశకు వచ్చాను, నేను ఆయనకి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి... " కానీ కృతజ్ఞతతో ఉండే బదులుగా, మీరు తినాలని కోరుకుంటే, అప్పుడు మళ్ళీ ఒక ఎలుక అవుతారు. ఎలుక నుండి పులిగా మిమ్మల్ని తయారు చేసే శక్తి సాధువుకు ఉంటే, అప్పుడు ఆయన పులి నుండి ఎలుకగా మిమ్మల్ని మళ్ళీ మార్చగలడు. మీరు ఎల్లప్పుడూ దీన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి భగవంతుడు, కృష్ణుని కృపతో, మీరు చాలా శక్తివంతమైన దేశంగా, ధనికముగా, అందముగా, విద్యావంతులై ఉన్నారు. కృష్ణుడి కృపతో మీరు అయ్యారు, కానీ మీరు కృష్ణుడిని మరచిపోయినట్లయితే, మీరు మళ్ళీ ఎలుకగా మారుతారు. దానిని గుర్తుంచుకోండి. ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు