TE/Prabhupada 0855 - నేను నా భౌతిక సంతోషాన్ని ఆపివేస్తే, నా ఆనందమైన జీవితము ముగుస్తుంది. కాదు



750306 - Lecture SB 02.02.06 - New York


నేను నా భౌతిక సంతోషాన్ని ఆపివేస్తే, నా ఆనందమైన జీవితము ముగుస్తుంది. కాదు కాబట్టి, ఎంత కాలం మనము ఈ భౌతిక ప్రపంచం లోనే ఉంటామో, నేను భగవంతుడు ఇంద్రుడు కావచ్చు, భగవంతుడు బ్రహ్మ, లేదా అమెరికా అధ్యక్షుడు, లేదా ఇది లేదా అది - మీరు ఈ నాలుగు విషయాలను నివారించలేరు. ఇది భౌతిక జీవితము. అది సమస్య. కానీ మీరు సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే, అప్పుడు ఇచ్చే పద్ధతి: నివృత్త. Anyābhilāṣitā-śūnyaṁ. భౌతిక ఆనందాన్ని కోరుకోవద్దు. ఆనందం అక్కడ ఉంది. నా భౌతిక సంతోషాన్ని నేను ఆపితే, నా ఆనందమైన జీవితం ముగిసిపోతుందని అనుకోవద్దు. లేదు ఇది ముగియలేదు. ఉదాహరణకు ఒక వ్యాధి ఉన్న మనిషి లాగా: ఆయన కూడా తింటున్నాడు, ఆయన కూడా నిద్రిస్తున్నాడు, ఆయన ఇతర విధులు కలిగి ఉన్నాడు, కానీ అది... ఆయన తినడం, నిద్రపోవడము, ఆరోగ్యకరమైన మనిషి తినడం, నిద్ర పోవడము అది ఒకే విషయము కాదు. అదేవిధముగా ,మన భౌతిక ఆనందం - తినడం, నిద్ర పోవడము, సంభోగము చేయడము రక్షణ - ఇది ప్రమాదాలతో పూర్తిగా ఉంది. ఏ అడ్డంకి లేకుండా మనము ఆనందించలేము. చాలా అడ్డంకులు ఉన్నాయి.

మనకు ఆ ఆటంకము లేని ఆనందం కావాలంటే... ఆనందం ఉంది. వ్యాధి ఉన్న వ్యక్తి లాగానే, అతడు కూడా తినుచున్నాడు, ఆరోగ్యవంతుడు తింటున్నాడు. కానీ ఆయన చేదును రుచి చూస్తున్నాడు. కామెర్లతో ఉన్న మనిషి, మీరు ఆయనకు చెరుకును ఇస్తే, అతడు దానిని చేదుగా రుచి చూస్తాడు. అది సత్యము. కానీ కామెర్లు వ్యాధి నుండి నయమయినప్పుడు అదే వ్యక్తి, ఆయన దానిని చాలా తియ్యగా రుచి చూస్తాడు. అదేవిధముగా , జీవితం యొక్క భౌతిక పరిస్థితిలో చాలా అవరోధాలు ఉన్నాయి, మనము జీవితాన్ని పూర్తిగా ఆనందించలేము. మీరు జీవితములో పూర్తిగా ఆనందమును కోరుకుంటే, అప్పుడు మీరు ఆధ్యాత్మిక స్థితికి రావాలి. Duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఈ భౌతిక ప్రపంచం భగవద్గీతలో వివరించబడింది, ఇది దుఃఖాలయము అని. ఇది దుఃఖముల యొక్క ప్రదేశం. అప్పుడు మీరు చెప్తే, "లేదు, నేను ఏర్పాటు చేసాను, ఇప్పుడు నేను బాగున్నాను, మంచి బ్యాంకు బాలన్స్ కలిగి ఉన్నాను. నా భార్య చాలా బాగుంది, నా పిల్లలు చాలా బాగున్నారు, కాబట్టి నేను పట్టించుకోను. నేను భౌతిక ప్రపంచం లోనే ఉంటాను " కృష్ణుడు అశాశ్వతం అన్నాడు: "కాదు, అయ్యా, మీరు ఇక్కడ నివసించలేరు, మిమ్మల్ని తరిమేస్తారు." Duḥkhālayam aśāśvatam. మీరు ఇక్కడ ఉండడానికి అంగీకరిస్తే, జీవితం యొక్క ఈ బాధాకరమైన పరిస్థితిలో, ఇది కూడా అనుమతించబడదు. శాశ్వత పరిష్కారం లేదు. Tathā dehāntara-prāptir. కాబట్టి ఈ సమస్యలు... ఈ సమస్యల గురించి చర్చిస్తున్న శాస్త్రవేత్తలు ఎక్కడ ఉన్నారు? కానీ సమస్యలు ఉన్నాయి. ఆయన కలిగి ఉన్న సంసార కుటుంబమును ఎవరు విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు? అందరూ కుటుంబం కలిగి ఉన్నారు, కానీ ఎవరూ తన కుటుంబం విడిచిపెట్టాలని కోరుకోవడము లేదు. కానీ బలవంతంగా ఆయనను తీసివేయబడతాడు. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, ఓ, నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఇప్పుడు చనిపోతున్నాను. నా భార్య, నా పిల్లలకు ఏమి జరుగుతుంది? ఆయనను బలవంతము చేశారు. మీరు తప్పనిసరిగా బయటపడాలి. కాబట్టి ఇది సమస్య. కాబట్టి సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? సమస్యకు పరిష్కారం లేదు. మీకు సమస్యకు పరిష్కారం కావాలంటే, అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు,

mām upetya kaunteya
duḥkhālayam aśāśvatam
nāpnuvanti mahātmānaḥ
saṁsiddhiṁ paramāṁ gatāḥ
(BG 8.15)

ఎవరైనా ఒకరు నా దగ్గరకు వస్తే, అప్పుడు ఆయన తిరిగి, మళ్ళీ, పూర్తిగా దుఃఖములతో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలోకి రావలసిన అవసరము లేదు.

కావున ఇక్కడ శుకదేవ గోస్వామి మీరు భక్తుడు కావాలని సూచిస్తున్నారు. మీ అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి.