TE/Prabhupada 0858 - మనము శిక్షణ ఇస్తున్నాము, అక్రమ లైంగికత పాపమని మనము ప్రచారము చేస్తున్నాము

From Vanipedia
Jump to: navigation, search

మనము శిక్షణ ఇస్తున్నాము, అక్రమ లైంగికత పాపమని మనము ప్రచారము చేస్తున్నాము
- Prabhupāda 0858


750521 - Conversation - Melbourne


మనము శిక్షణ ఇస్తున్నాము, అక్రమ లైంగికత పాపమని మనము ప్రచారము చేస్తున్నాము

ప్రభుపాద: మనము శిక్షణ ఇస్తున్నాము, కొన్నిసార్లు ప్రజలు నవ్వుతున్నారు, "ఏమిటీ వెర్రిపని?" వారు విమర్శిస్తున్నారు. సమాజంలోని ఈ నాయకులు ప్రోత్సహించరు. నిన్న నేను ఒక పాదరి తో మాట్లాడుతున్నాను. అక్రమ లైంగిక జీవితం గురించి ఆయన ఇలా చెప్పాడు, "అక్కడ ఏమి తప్పు ఉంది? ఇది గొప్ప ఆనందం." మీరు చూడండి? మనము శిక్షణ ఇస్తున్నాము, అక్రమ లైంగిక సంబంధం పాపం అని మనము ప్రచారము చేస్తున్నాము. మన మొదటి నియమం ఏమిటంటే, ఈ నాలుగు అంశాలను ఒకరు తప్పక వదిలివేయాలి: అక్రమ లైంగిక సంబంధం, మాంసం తినడం, మత్తు, జూదం. ఇది వారిని అంగీకరించడానికి ముందు నా మొదటి నియమం. కాబట్టి వారు అంగీకరిస్తున్నారు, వారు అనుసరిస్తున్నారు.

దర్శకుడు: అదే మా ప్రజలూ చేస్తున్నారు.

ప్రభుపాద: హమ్?

దర్శకుడు: అదే మా ఖాతాదారులందరూ చేస్తున్నారు.

ప్రభుపాద: అవును, వారు చేస్తారు. సాధారణ సంస్థ అన్ని సౌకర్యాలతో నడుస్తుంటే... ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. కొంత సమయం తరువాత వారు భక్తులుగా అంకితమవుతారు. అక్కడ తప్పనిసరిగా పద్ధతి ఉండాలి. ఇది... మనము పెరుగుతున్నాం; మన ఉద్యమం తగ్గిపోవడం లేదు. మనము ఇక్కడ ఒక ఆలయాన్ని తెరిచినట్లుగానే. ఇక్కడ దేవాలయం లేదు, కానీ మనము మంచి ఆలయం కలిగి వున్నాము. ఈ విధముగా ప్రపంచవ్యాప్తంగా మన ఉద్యమం పెరుగుతోంది; ఇది తగ్గటం లేదు. నేను 1965 లో భారతదేశం నుండి వచ్చాను న్యూయార్క్లో లో ఒంటరిగా . ఒక సంవత్సరం నాకు ఉండడానికి చోటు లేదు, నాకు తినడానికి మార్గము లేదు. నేను ఆచరణాత్మకంగా ఏమి అభివృద్ధి లేకుండా తిరుగుతూ ఉన్నాను , స్నేహితుల ఇంట్లో మరియు కొందరు మిత్రుల ఇంటిలో నివసిస్తున్నాను. తరువాత క్రమంగా అది అభివృద్ధి చెందినది, ప్రజలు. నేను న్యూయార్క్లో ఒక స్క్వేర్లో కీర్తన చేస్తూ ఉన్నాను, ఒంటరిగా పూర్తి మూడు గంటలు. అది ఏమిటి, టాంప్కిన్సన్ స్క్వేర్? అవును. మీరు న్యూయార్క్లో ఉన్నారా? కాబట్టి అది నా ప్రారంభము. అప్పుడు క్రమంగా ప్రజలు వచ్చారు. (భక్తుడితో:) మీరు ఏదో క్లబ్ లో ఉన్నారు, అది ఏమిటి?

మధుద్విస: కాలిఫోర్నియాలోనా?

ప్రభుపాద: అవును.

మధుద్విస: రాంచ్లో.

ప్రభుపాద: రాంచ్ లోనా?

మధుద్విస: ఆ మార్నింగ్ స్టార్ లోనా?

ప్రభుపాద: అహ, హ, హ.

మధుద్విస: అవును. (నవ్వుతూ)

ప్రభుపాద: (నవ్వుతూ) అది మరొక వేశ్యాగృహం.

మధుద్విస: హిప్పీల ఫామ్. మీరు అక్కడకు వచ్చారు.

ప్రభుపాద: నేను అక్కడ ఉన్నాను... నేను అక్కడకు వెళ్ళాను. యజమాని, నిర్వాహకుడు, ఆయన నన్ను అక్కడకు తీసుకుని వెళ్లాడు. కాబట్టి నేను భావిస్తున్నాను మనం... మీరు తీవ్రముగా ఉంటే, మనము కలిసి ఒక సంస్థను తెరుద్ధాము మొదటి తరగతి వారిగా ఎలా అవ్వవచ్చో ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. అది ఒక పరిష్కారం చేస్తుంది.

దర్శకుడు: తరువాత సమాజాన్ని మార్చాలి.

ప్రభుపాద: లేదు, మార్పు లేదు. సమాజమును అలానే ఉండనివ్వండి. మనము డల్లాస్లో చేస్తున్నట్లుగా మనము కొందరు పిల్లలకు శిక్షణ ఇద్దాము, మరియు కొందరు వ్యక్తులకు కూడా. మనము వారికి శిక్షణ ఇచ్చినట్లుగానే. అది సాధ్యమే. ఇది ఆచరణాత్మక ఉదాహరణ. ఉదాహరణకు మీరు డెన్, మార్నింగ్ స్టార్లో ఉన్నారు.

దర్శకుడు: మీ మనుషులలో చాలామంది వారి జీవితంలో నేరములు చేసారా?

మధుద్విస: నేరమా?

దర్శకుడు: అవును. మీరు చేరడానికి ముందు చట్టపరమైన ఇబ్బందుల్లో ఎదుర్కొన్నారా?

మధుద్విస:ఓ , చాలా మంది భక్తులు.

దర్శకుడు: నీవు కూడానా?

మధుద్విస:ఓ, అవును.

దర్శకుడు: మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, అవునా?

మధుద్విస: అవును.

భక్తుడు (1): ఇక్కడ ఒక అబ్బాయి పెన్రిడ్జ్లో తొమ్మిది నెలలు గడిపారు. (విక్టోరియా జైలులో , ఆస్ట్రేలియాలో)

ప్రభుపాద: ఇది ఆచరణాత్మకమైనది. మనము ఆపవచ్చు. ఉదాహరణకు వారు పవిత్రమైన వ్యక్తులు అయినారు. ప్రతి ఒక్కరూ ... భారతదేశం, వారు ఆశ్చర్యపోతున్నారు "మీరు ఎలా ఈ యూరోపియన్లు, అమెరికన్ల ను ఈ విధంగా తయారు చేశారు ?" వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే భారతదేశంలో, బ్రాహ్మణులు ఇతరులు, వారు ఈ అభిప్రాయముతో ఉన్నారు "ఈ పాశ్చాత్య ప్రజలు ఎందుకూ పనికిరాని వారు అని. వారు ఏ ఉన్నతమైన ధర్మము లేదా ఆధ్యాత్మికం చేయలేరు." కాబట్టి వారు చూసినప్పుడు భారతదేశంలో మనకు అనేక దేవాలయాలు ఉన్నాయి, అది వారు శ్రీవిగ్రహాన్ని పూజిస్తున్నారు, అంతా నిర్వహిస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, వారు ఆశ్చర్యపోతున్నారు. చాలామంది స్వాములు నాకంటే ముందు వచ్చారు, కానీ వారు మార్చలేక పోయినారు. కానీ నేను కాదు వారిని మార్చినది, కానీ పద్ధతి చాలా బాగుంది అందుకే వారు మారారు