TE/Prabhupada 0861 - మెల్బోర్న్ నగరములో ఆకలిగా ఉన్న వ్యక్తులందరూ, ఇక్కడికి రండి, మీరు సంతృప్తిగా తినండి



750521 - Conversation - Melbourne


మెల్బోర్న్ నగరములో ఆకలిగా ఉన్న వ్యక్తులందరూ, ఇక్కడికి రండి, మీరు తీసుకోండి పరిపూర్ణంగా సంతృప్తిగా తినండి

దర్శకుడు: ఎవరైనా ఈ ప్రదేశంలోకి దొంగతనమునకు వస్తే, మీరు ఎలా స్పందిస్తారు ఎవరైనా వచ్చి దోచుకోవడానికి ప్రయత్నించితే...

అమోఘ: అతడు ఇలా అంటాడు, "కొంత మంది ఎవరైనా భవనములో దొంగతనము చేయాలని ప్రయత్నించినప్పుడు ఎలా స్పందిస్తాం?"

ప్రభుపాద: రాబ్?

అమోఘ: ఒక దొంగ. ఒక దొంగ వచ్చినప్పుడు మనమేమి చేస్తాము? మరో మాటలో చెప్పాలంటే, మనము హింసాత్మకంగా ఉండాలా?

ప్రభుపాద: దొంగ వచ్చినప్పుడు మనము ఆయనని శిక్షిస్తాము.

దర్శకుడు: మీరు హింసాత్మకంగా ఉంటారా?

ప్రభుపాద: ఎందుకు కాదు? ఒక దొంగ శిక్షించబడాలి.

దర్శకుడు: మీకు మీరే శిక్షిస్తారా? మీరు ఏమి చేస్తారు? మీరు అతనిపై దాడి చేయడానికి సిద్ధమవుతారా?

ప్రభుపాద: కాదు, మనమైనా లేదా ఎవరైనా, దొంగను శిక్షించాలి. ఒక దొంగ శిక్షింపబడవలసి ఉంది. మేమైనా లేదా మీరైనా, అది పట్టింపు లేదు. ఒక దొంగ దొంగే. ఆయన శిక్షించబడాలి.

దర్శకుడు: అతను దొంగతనము ఎందుకు చేసాడంటే అతను ఆకలితో ఉన్నాడు

ప్రభుపాద: ఎవరు దొంగతనము చేస్తారు?

అమోఘ: అతను చెప్పారు అతను దొంగతనము చేశాడు ఎందుకంటే అతను ఆకలితో ఉన్నాడు అతను ఒక దొంగలా వచ్చాడు ఎందుకంటే అతను కొంత ఆహారం కోరుకుంటున్నాడు

ప్రభుపాద: మనము అందరికీ చెప్తున్నాము, "వచ్చి తినండి." ఎందుకు ఆయన ఆకలితో ఉండాలి? మనము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము, "ఇక్కడకు వచ్చి, తినండి, వెల లేదు." మనము వసూలు చేయము. ఎందుకు ఆయన ఆకలితో ఉండాలి? మనము ఈ కార్యక్రమాన్ని పెంచుదాం. మెల్బోర్న్ నగరములో ఆకలితో ఉన్న వ్యక్తులందరు, ఇక్కడకు రండి, మీరు తినండి మీరు సంతృప్తిగా తీసుకోండి. మేము ఆహ్వానిస్తాము, "రండి." ఎందుకు మీరు ఆకలితో ఉండాలి?

దర్శకుడు: అతను ఒక మద్యం తీసుకునేవాడు అయితే మరియు అతను ఆకలితో ఉంటే?

భక్తుడు: మాకు ఇక్కడకు ఒకరిద్దరు మద్యపాన సేవకులు వస్తారు, మేము ప్రతి రాత్రి వారికి ఆహారం ఇస్తాము. దర్శకుడు: మీరు ఇస్తారా?

భక్తుడు: అవును. దర్శకుడు: ఉదాహరణకు గోర్డాన్ హౌస్ వలె.

భక్తుడు: అవును. వారు వస్తారు. ప్రతి ఆదివారం మనము ఒక విందు ఏర్పాటు చేస్తాము. వారు వస్తారు మరియు మనము ఆహారాన్ని ఇస్తాము.

ప్రభుపాద: దీని అభ్యాసముకు కొంత సమయము కావాలి కాకపోతే, అది ప్రతి ఒక్కరి కొరకు తెరిచి ఉంటుంది సంస్కరణ కోసం.

దర్శకుడు: కానీ మీరు ఎంత వరకు ప్రజలకు ఆహారం అందించగలరు అనే దానికి మీ పరిమితులను మీరు కలిగి ఉంటారు.

ప్రభుపాద: హమ్?

అమోఘ: మనం ఎంత మందికి ఆహారం అందించగలము అనే దానికి మనము మన పరిమితులు కలిగి ఉంటాము అని ఆయన చెప్తున్నారు.

ప్రభుపాద: ప్రభుత్వం సహాయపడితే మనము అపరిమితంగా ఆహారం అందించగలము.

దర్శకుడు: మీరు ఏర్పడవచ్చు... మీరు ఒక ప్రదేశమును ఏర్పాటు చేయ వచ్చు, ప్రజలు, నిరాశ్రయులైన ప్రజలు వచ్చి ఉచితంగా భోజనం చేయవచ్చు.

ప్రభుపాద: ఓహ్, అవునవును. ప్రతిఒక్కరూ, అందరినీ మనము ఆహ్వానిస్తాము. మీరు రండి ప్రసాదం తీసుకోండి.

దర్శకుడు: ప్రభుత్వము, ఒక పదంలో, మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు ...

ప్రభుపాద: లేదు, ప్రభుత్వము మనల్ని ఉపయోగించుకోకూడదు. మనము ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం మనల్ని నిర్దేశించకూడదు. అది సహాయం చేయదు.

దర్శకుడు: ఒక్క క్షణం. ఒక్క క్షణం. (అస్పష్టముగా ఉంది) వాస్తవము ఏమిటంటే మనకు చూసుకోవటానికి నిరాశ్రయులు చాలా మంది ఉన్నారు, మీ మతపరమైన పద్ధతి ప్రజలకు సహాయం చేయాలని మీరు భావిస్తున్నారు. ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం మీకు సబ్సిడీ ఇస్తే ...

ప్రభుపాద: అది మనము చేయగలము. దర్శకుడు: అది మీరు చేయవచ్చు. వారు మీకు విరుద్ధంగా లేనంత వరకు ...

ప్రభుపాద: లేదు. మన సూత్రం ఇది....

దర్శకుడు: నేను అనేదేమిటంటే చాలా చర్చ్ సంస్థలు పిల్లలను తీసుకొని...

ప్రభుపాద: మీరు ఒకరోజు చూడవచ్చు. మీరు దయచేసి ఉదయాన్నే రండి, ఒకరోజు గడిపితే, మీరు మా కార్యక్రమాలు చూడగలరు, ఎంత చక్కగా చేస్తున్నామో చూడండి. ఆపై అవసరమైనవి చేయండి.

దర్శకుడు: నేను ఇక్కడకు ఒక వ్యక్తిగా రాలేదు. నేను నా విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.

ప్రభుపాద: లేదు, అది ఏమైనా కావచ్చు...

దర్శకుడు: వాస్తవానికి మీరు నన్ను ఒప్పించగలరా లేదా అని ... సమాజం తప్పక ... మనము చాలా పేద ప్రజలతో వ్యవహరిస్తున్నామని మాత్రమే చెప్పగలను. మేము వారికి తెలియజేయగలము మీరు ఏమి చేస్తున్నారో, అప్పుడు నేను చెప్పవచ్చు బహుశా ఏదైనా కలపవచ్చు అని . లేదా నేను మంత్రికి చెప్పగలను, మన సమావేశము యొక్క సారంశము, అది అక్కడ నుండి వెళ్తుంది. నేను నా ఇతర విధులకు తిరిగి వెళ్ళవచ్చు.

ప్రభుపాద: అప్పుడు వారు మనకు ప్రతి ఒక్కరినీ చూసుకోవటం కొరకు కొంత సహాయమును చేయవచ్చు అప్పుడు మనము ఆహ్వానించవచ్చు. మనము మన సేవను పెంచవచ్చు. ఇప్పుడు మనము చేస్తున్నాం. మనము వ్యాపారము చేయడము లేదు, ఆదాయం లేదు. మేము మా పుస్తకాలను విక్రయిస్తున్నాం. మా ఆదాయం పరిమితంగా ఉంది. అయినప్పటికీ, మనము ఎవరినైనా ఆహ్వానిస్తాము, రండి. కానీ ప్రభుత్వం మనకు ప్రోత్సాహమిస్తే, అప్పుడు మనము కార్యక్రమాలను పెంచగలము.

దర్శకుడు: అవును. (ఆడియో టేప్ లో వేరే వారి సంభాషణ) అయితే, ఇది రాజకీయ నిర్ణయం. నేను కేవలం చెప్పగలను ...

ప్రభుపాద: ఇది రాజకీయాలకు అతీతంగా ఉంది.

దర్శకుడు: క్షమించండి? ప్రభుపాద: ఇది రాజకీయాలకు అతీతంగా ఉంది.

దర్శకుడు: మీ దృక్కోణం నుండి, కానీ మేము మా శాఖలో రాజకీయ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాము.

ప్రభుపాద: అవును, విభాగం అంటే అక్కడ మరికొందరు...

దర్శకుడు: అవును, అది ప్రజల ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది. మన సమాజంలో ప్రజల సంకల్పం ప్రకారం మంత్రి ఎన్నుకోబడతారు.

ప్రభుపాద: ఎందుకంటే వారు ఒక విభాగం తయారు చేశారు, మీ శాఖ లాగానే... ఆ విభాగం ఏమిటి?

భక్తుడు: సామాజిక సంక్షేమం. ప్రభుపాద: సామాజిక సంక్షేమం. కావున వారు సామాజిక సంక్షేమమును కనుగొంటే, ఎందుకు సహాయం చేయకూడదు? ఎందుకు వారు రాజకీయాలు తీసుకువస్తారు? వాస్తవానికి ఇక్కడ సామాజిక సంక్షేమము ఉంటే, ఎందుకు వారు మద్దతు ఇవ్వడం లేదు?

దర్శకుడు: అవును, మీరు చెప్పినది నిజమే. కానీ మన సమాజంలో, మంత్రి కొన్ని విధానాలను చేయడానికి ఎన్నుకోబడతారు - ఆయనకు ఏమి కావాలి అని కాదు, కానీ ప్రజలు దేని కోసం ఓటు వేశారు. వారికి పన్ను వేస్తారు దీనికి మద్దతు ఇవ్వడము కోసము.

ప్రభుపాద: మీ విధానం సామాజిక సంస్కరణ అయినట్లయితే...

దర్శకుడు: సామాజిక సంస్కరణ మా విధానం కాదు.

ప్రభుపాద: అప్పుడు, సామాజిక సంక్షేమం