TE/Prabhupada 0877 - మీరు ఆదర్శంగా లేకుంటే, అప్పుడు కేంద్రాన్ని తెరవడము వలన ఉపయోగము లేదు



750519 - Lecture SB - Melbourne


మీరు ఆదర్శంగా లేకుంటే, అప్పుడు కేంద్రాన్ని తెరవడము వలన ఉపయోగము లేదు

మధుద్విస: కుక్కను-తినేవాడు మొదటి-తరగతి వ్యక్తి కాగలడా?

ప్రభుపాద:, అవును. ఈ రెండు పనుల కోసం ఈ నాలుకను ఉపయోగించండి: హరే కృష్ణ కీర్తన చేయండి. ప్రసాదం తీసుకోండి. ఆయన కుక్కను తినడం మర్చిపోతాడు. (నవ్వు) మినహాయింపు లేదు. ఆయన అనుసరిస్తే అందరూ కృష్ణ చైతన్య వంతులు అవుతారు, ప్రారంభంలో, ఈ రెండు నియమాలు: హరే కృష్ణ కీర్తన చేయడము మరియు ప్రసాదం తీసుకోవడము. అంతే. దీనిని పరీక్షించండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక్కడ ఆలయం ఉంది. మనము నివసిస్తున్నాము. ఇక్కడకు రండి. ఈ రెండు పనులు చేయండి. మన మధుద్విస మహారాజు మీకు ప్రసాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నృత్యము చేయడానికి మరియు పాడటానికి అవకాశము ఇస్తున్నాడు . అంతే. ఇబ్బంది ఎక్కడ ఉంది? మీరు దాని కొరకు చెల్లించాల్సిన అవసరం లేదు. నష్టం లేదు. ఏమైనా లాభం ఉంటే, ఎందుకు మీరు ప్రయత్నించడము లేదు?

మధుద్విస: శ్రీల ప్రభుపాద, ఇక్కడకు వచ్చి హరే కృష్ణ కీర్తన చేసి, ప్రసాదం తీసుకోవడానికి అవసరం ఏమిటి ఎవరికైనా?

ప్రభుపాద: కేవలము... ఎందుకంటే ఇక్కడ కేంద్రం ఉంది కనుక. ప్రతిదీ సరిగా జరుగుతోంది. నువ్వు నేర్చుకుంటావు. ఉదాహరణకు మీరు నేర్చుకోవడానికి పాఠశాల లేదా కళాశాలకు వెళ్తారు కాబట్టి అదేవిధముగా, మీరు ఆధ్యాత్మిక జీవితము యొక్క విద్యను తీసుకోవలసి వస్తే, వారు ఇక్కడకు వస్తారు ప్రజలు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తారు, ఆదర్శముగా. మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు ఆదర్శంగా లేకుంటే, అప్పుడు కేంద్రాన్ని తెరవడము వలన ఉపయోగము లేదు. మీరు మంచిగా ప్రవర్తించండి, వారు వస్తారు, వారు చూస్తారు, వారు నేర్చుకుంటారు. మీరు ఏదైనా పాఠశాలకు వెళ్లితే, ఆచార్యులు మూర్ఖులు అయితే, అప్పుడు మీరు ఏమి నేర్చుకుంటారు? ఇది రెండు వైపులా, పరస్పరము ఉంటుంది. మీరు ప్రొఫెసర్, ఉపాధ్యాయులుగా వ్యవహరించాలి. మీ జీవితం ఆదర్శంగా ఉండాలి, వారు వచ్చి చూస్తారు, వారు నేర్చుకుంటారు.

భక్తురాలు: శ్రీల ప్రభుపాద, మొత్తం విశ్వాన్ని పాలించడము రాజులకు నేర్పించి ఉంటే, అంటే దాని అర్థం అన్ని లోకములనా లేదా విశ్వములోని అన్ని లోకములనా ఈ భూమిని మాత్రమే సూచిస్తుందా?

మధుద్విస: ఒక రాజు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించటానికి ఎలా సాధ్యమవుతుంది అని ఆమె ఆశ్చర్యపోతోంది. ఇది చాలా కష్టము అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము చాలా మంది నాయకులును చూస్తున్నాము, వారు నిర్వహించలేక పోతున్నారు ...

ప్రభుపాద: ఆ మర్చిపొండి. ఎందుకు మీరు పాలించలేరని మీరు ఆలోచిస్తున్నారు, కాబట్టి ఇతరులు చేయలేరు? మీరు మీ వైపు నుండి ఆలోచిస్తున్నారు. కానీ ఉన్నారు. అది సాధ్యమే. కాబట్టి ఇది మనము చేయగల కార్యక్రమము కాదు. ఇది ఇతరులది, రాజకీయాలు ... కానీ మనకు ... మన పని జీవితం యొక్క మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగు పరుచుకోవడము ఎలా . మీరు ప్రపంచాన్ని పాలించక పోయినా, అది పట్టింపు లేదు. ఎందుకు మీరు ప్రపంచమును మొత్తమును పాలించాలని ఆందోళన చెందుతున్నారు? ఇది మన పని కాదు. మీరు హరే కృష్ణ కీర్తన చేయండి ప్రసాదం తీసుకోండి. (నవ్వు)